Rajeev Kanakala: సుమకి టీవీ షోలు తగ్గిపోవడానికి కారణం ఇదే.. తొలిసారి రివీల్ చేసిన రాజీవ్!
సుమ కనకాల.. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న ఈమె.. రాజీవ్ కనకాల భార్య అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. వీరిద్దరి ప్రేమాయణం, పెళ్లి జీవితం.. ఇలా వీరి జీవితంలో జరిగే అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు.
అయితే దాదాపు 12 సంవత్సరాల పాటు స్టార్ మహిళ షో చేసి చాలా ఏళ్లుగా అనేక ఛానెళ్లలో సందడి చేస్తున్న ఈమె... ఈ మధ్య ఎక్కువగా కనిపించట్లేదు. ఒక్క సుమ అడ్డా ప్రోగ్రామ్ లో మాత్రం దర్శనం ఇస్తోంది. అయితే యాంకర్ సుమ టీవీ షోలు తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని ఆమె భర్త, నటుడు రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యాంకర్ సుమ వల్ల తన జీవితమే మారిపోయిందని రాజీవ్ కనకాల వివరించాడు. ముఖ్యంగా ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్థికంగా, మానసికంగా అన్ని రకాలుగా చాలా ధృడంగా అయినట్లు పేర్కొన్నారు. తన వల్లే ఈరోజు తాము మంచి పొజిషన్ లో ఉన్నామని.. తన తండ్రి చేసిన అప్పులను ఇద్దరూ కలిసి తీర్చామని అన్నారు. అలాగే తన తండ్రికి అప్పులు ఎక్కువ అయి.. ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి అనేక ఆస్తులు సంపాధించే వరకూ చేరుకున్నామంటే సుమ కష్టం చాలా ఉందని అన్నారు.
అలాగే ఎన్ని షోలు చేసినా, ఎంత పని చేసినా పిల్లలను, నన్ను ఎప్పుడూ తాను నిర్లక్ష్యం చేయలేదని.. సాయంత్రం 6 గంటల వరకు కచ్చితంగా ఇంటికి వచ్చేస్తుందని అన్నారు. ఎప్పుడో ఒకసారి ఆలస్యం అయితే పిల్లలను నేరుగా షూటింగ్ కు తీసుకెళ్తుందని.. అలా వాళ్లు ఒంటరిగా ఫీల్ కాకుండా చూసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే సుమకి టీవీ షోలు తగ్గిపోవడానికి కారణం పిల్లలే అని వివరించారు. పిల్లలతో పాటు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ లో పలు షోలు చేస్తుందని అన్నారు.

తమవి గవర్నమెంట్ జాబ్స్ కావని.. ఎప్పుడు ఏం అవుతుందో తెలియదు కాబట్టి తాము యూట్యూబ్ లో షోలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లతో పాటు సుమ అడ్డా, యూట్యూబ్ లో పలు షోలు చేసుకుంటూ కెరియర్ ను కొనసాగిస్తున్నామని అన్నారు.


Click it and Unblock the Notifications











