‘ఒడ్డు పొడుగు ఉన్నావ్.. హీరోయిన్ కాదు అది చేస్తావా’.. సీనియర్ నటి ఆమని ఆవేదన
సీనియర్ నటి ఆమని తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో 35 ఏళ్లకు పైగా యాక్టివ్ గా కనిపిస్తోంది. తొలుత హీరోయిన్ గా, ఆ తర్వాత ప్రధాన పాత్రల్లో నటిస్తూ తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది. అటు సినిమాలతో పాటు ఇటు సీరియళ్లలోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సినిమాలు, డైలీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక తనకు సమయం ఉన్నప్పుడల్లా ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులకు తెలియజేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్ వర్ష టాక్ షోకు హాజరైంది.
కిస్సిక్ టాక్స్ షోలో ఆమని..
జబర్దస్త్ బ్యూటీ వర్ష రీసెంట్ గా ప్రారంభించిన కిసిక్ టాక్స్ షోకు సెలబ్రెటీలు హాజరవుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. టీవీ స్టార్స్, సెలబ్రెటీలు, సీనియర్ నటులు ఈ షోకు హాజరై తమ గురించి వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారు. అభిమానులకు తమ గురించి కొత్త విషయాలను చెబుతూ మరింతగా ఆకట్టుకుంటున్నారు. ఈక్రమంలోనే సీనియర్ నటి ఆమని కూడా ఈ షోకు హాజరై జబర్దస్త్ వర్షతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

ఆమని సినీ ప్రయాణం ప్రారంభం ఇలా..
సీనియర్ నటి ఆమని కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగింది. ప్రస్తుతం ఆమెకు 52 ఏళ్లు. ఇప్పటికీ సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తొలుత ఆమని కెరీయర్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రారంభం అయ్యింది. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కోలీవుడ్ లో కొన్నాళ్లు సందడి చేసింది. ఇక హీరోయిన్ గా మాత్రం టాలీవుడ్ లోకే ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో సీనియర్ నటుడు నరేశ్ సరసన 'జంబ లకిడి పంబ' అనే చిత్రంలో నటించింది.
తొలి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'మిస్టర్ పెళ్లాం', శుభ లగ్నం, హాలో బ్రదర్, ఘరానా బుల్లోడు, సిసింద్రీ, శుభ సంకల్పం, ఆ నలుగురు వంటి చిత్రాలతో అలరించింది. ఇక ప్రధాన పాత్రల్లో మిడిల్ క్లాస్ అబ్బాయి, భరత్ అనే నేను, శ్రీనివాస కళ్యాణం, హాలో గురు ప్రేమ కోసం, చావు కబురు చల్లగా, రిపబ్లిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వినరో భాగ్యము విష్ణు కథ, రీసెంట్ గా బాపు, నారి, డియర్ ఉమా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
కెరియర్ ప్రారంభంలో అలాంటి మాటలు..
కిసిక్ టాక్స్ కు హాజరైన ఆమనికి జబర్దస్త్ వర్ష ఆసక్తికరమైన ప్రశ్న వేసింది. తన కెరీయర్ ప్రారంభంలోని సవాళ్లను గుర్తు చేసింది. ఈ సందర్భంగా ఆమని స్పందిస్తూ తన కెరీయర్ ప్రారంభంలో చాలా ఛాలెంజ్ లను ఎదుర్కొన్నానని చెప్పింది. చాలా మంది ఇబ్బంది పెట్టారని, 100 ఆడిషన్ల తర్వాత కెరీయర్ కాస్తా మెరుగైందని చెప్పింది. ప్రతి చోటా అవమానమే జరిగేదని, దర్శక నిర్మాతలు తనను చూసి ఒడ్డు పొడుగు, కళ్లు, కలర్ బాగుందని.. కానీ హీరోయిన్ గా కాకుండా, అక్కా చెళ్లె పాత్రలకు అడిగే వారని దాంతో చాలా బాధగా ఉండేదన్నారు. ఏదేమైనా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను అలరించినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ అవకాశం వస్తుందని అంత వరకు వేచి ఉండాలని చెప్పింది.


Click it and Unblock the Notifications











