Bigg Boss Telugu: బిగ్ బాస్ లోకి స్టార్ హీరోయిన్? అసలు విషయం బయటపెట్టిన అలనాటి తార!

బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ పేరుతో వచ్చింది. మొదట్లో ఎలా ఉంటుందో అని అనుకున్న ఈ రియాలిటీ షోపై ప్రేక్షకులు విపరీతమైన ఆదరణ చూపించారు. దీంతో వివిధ భాషల్లోకి తీసుకురావడం మొదలు పెట్టారు. అలా తెలుగులో 2017లో మొదటి సీజన్ ను ప్రారంభించారు. ఇటీవల డిసెంబర్ 18న ఆరో సీజన్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ తోపాటు ఓటీటీ రెండో సీజన్ ను కూడా ప్రారంభించాలను ప్లాన్ చేస్తోంది బీబీ టీమ్. అందుకోసం పాపులర్ సెలబ్రిటీలనే తీసుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా బిగ్ బాస్ షోలోకి వెళ్లడంపై స్టార్ హీరోయిన్ కామెంట్స్ చేసింది.

ఆరు తప్పా మిగతా సీజన్స్ అన్నీ..

ఆరు తప్పా మిగతా సీజన్స్ అన్నీ..

ఎలాంటి అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చినా.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న షో బిగ్ బాస్. అందుకే నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 6 రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. వీటిలో ఇటీవల పూర్తయిన ఆరో సీజన్ మినహా మిగతా అన్ని సీజన్లు మాత్రం మంచి రేటింగ్ నే సొంతం చేసుకున్నాయి.

వెనువెంటనే ఓటీటీ, టీవీ సీజన్స్..

వెనువెంటనే ఓటీటీ, టీవీ సీజన్స్..

ఈ ఏడాది వెనువెంటనే బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ ను, బిగ్ బాస్ టెలివిజన్ సీజన్ ను నడిపించేందుకు బీబీ టీమ్ స్కెచ్ వేసిందని టాక్ నడుస్తోంది. ఇక ఇటీవల బిగ్ బాస్ ఆరో సీజన్ పూర్తి కాగానే బీబీ జోడీ పేరుతో రియాలిటీ డ్యాన్స్ షోను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షోలో బిగ్ బాస్ గత సీజన్లలోని కంటెస్టెంట్స్ డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ బీబీ జోడీ డ్యాన్స్ షో పూర్తి కాగానే బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ ను ప్రారంభించనున్నారట.

త్వరగా ప్రారంభించేందుకు..

త్వరగా ప్రారంభించేందుకు..

బీబీ జోడీ మార్చిలో అయిపోగానే ఏప్రిల్ లో ఓటీటీ నాన్ స్టాప్ రెండో సీజన్ ను స్టార్ చేయాలని బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తోందని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్. అలాగే ఏప్రిల్ నుంచి జూన్ 1 వారంలో ఈ ఓటీటీ రెండో సీజన్ ను పూర్తి చేసి మెయిన్ సీజన్ అంటే బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ను సెప్టెంబర్ లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షో బాగానే నడుస్తోంది.

న్యాయ నిర్ణేతగా స్టార్ హీరోయిన్..

న్యాయ నిర్ణేతగా స్టార్ హీరోయిన్..

బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోలో అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్వి, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-ఇనయా సుల్తానా, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, అవినాష్-అరియానా, మెహబూబ్-శ్రీసత్య, కౌశల్-అభినయ శ్రీ జోడీలుగా ఉన్నారు. అలాగే దీనికి న్యాయ నిర్ణేతలుగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు బ్యూటిఫుల్ హీరోయిన్ సదా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టార్ కొనసాగనున్నారు.

జడ్జెస్ ఛాలెంజ్ లో భాగంగా..

జడ్జెస్ ఛాలెంజ్ లో భాగంగా..

అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోను ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం చేస్తున్నారు. వచ్చే వారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో జోడీలంతా తమ డ్యాన్స్ లతో అదరగొట్టారు. డిఫరెంట్ క్యాస్టూమ్స్ తో.. విభిన్న రకాల థీమ్స్ తో, సూపర్ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే జడ్జెస్ ఛాలెంజ్ ఇచ్చిన ఈ రౌండ్స్ లో అదిరిపోయే డ్యాన్స్ లతో పాటు బిగ్ బాస్ షో తరహాలో గొడవలు కూడా జరిగాయి.

తర్వాత సీజన్ కు వెళదామా..

తర్వాత సీజన్ కు వెళదామా..

ఈ ప్రోమోలో తేజస్వి-అఖిల్ ఇద్దరు కలర్ ఫుల్ అండ్ కథక్ థీమ్ తో డ్యాన్స్ చేస్తారు. ఈ డ్యాన్స్ తర్వాత అఖిల్ అండ్ కౌశల్ మధ్య థీమ్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదని వాదన జరుగుతుంది. తర్వాత ఫైమాకు, కౌశల్ మధ్య వార్ జరుగుతుంది. దీంతో ఈ గొడవలపై రాధ మాట్లాడుతుంది. "రీజనబుల్ కాకుండా వాడు పాయింట్స్ తగ్గిస్తే.. మనకు కూడా స్ట్రాటజీ ఉంటుంది. నెక్ట్స్ సీజన్ కు బిగ్ బాస్ కు వెళదామా అని అనుకుంటున్నా" అని రాధ చెప్పింది. ఇలా తను బిగ్ బాస్ కు వెళ్లాలనుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టింది అలనాటి స్టార్ హీరోయిన్ రాధ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X