నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
సీరియల్స్ తో పాపులర్ అయిన నటుడు సాగర్ బుల్లితెర ప్రేక్షకులకు ఆర్కే నాయుడుగా బాగా తెలుసు. ఆ పాపులారిటీతోనే ఆయన పలు సినిమాల్లో కూడా నటించారు. అయితే సీరియల్స్ చేస్తున్న సమయంలోనే ఓ సీనియర్ నటి నీకెంత బలుపు? అంటూ తనపై సీరియస్ అయిందన్న విషయాన్ని సాగర్ తాజాగా వెల్లడించారు. మరి ఆ సీనియర్ నటి ఎవరు? సాగర్ పై ఎందుకు సీరియస్ అయ్యింది? అనే విషయాన్ని మనం కూడా తెలుసుకుందాం పదండి.
చక్రవాకం, మొగలిరేకులు వంటి సీరియల్స్ ఒకప్పుడు బుల్లితెరను ఎంతగా ఊపేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొగలిరేకులు సీరియల్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించిన సాగర్ అందులోని ఆర్కే నాయుడు పాత్ర ద్వారా విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇప్పటికీ చాలామందికి ఆయన ఒరిజినల్ పేరు సాగర్ కంటే సీరియల్ పేరు ఆర్కే నాయుడుగానే తెలుసు అంటే అతిశక్తి కాదేమో.

ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చక్రవాకం తర్వాత మొగలిరేకులు సీరియల్ లో నటించే ఛాన్స్ ఎలా వచ్చింది? అనే ప్రశ్న ఎదురయ్యింది సాగర్ కు. ఆ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ చక్రవాకం సీరియల్ తర్వాత కెరీర్ లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే విషయంలో కన్ఫ్యూజ్ అయ్యానని, అయితే అదే సమయంలో ఓ తమిళ సీరియల్ లో నటించే అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నారు.
సీనియర్ నటి రమాప్రభ తనను రికమెండ్ చేసి, ఆ తమిళ సీరియల్ లో నటించే అవకాశాన్ని ఇప్పించారని చెప్పుకొచ్చారు సాగర్. అయితే డేట్స్ అన్నీ ఫిక్స్ అయ్యాక ఏదో కారణంతో తను అక్కడికి వెళ్ళలేకపోయాను అని, తనపై అదే రమా ప్రభ కోపానికి కారణమైందని తాజా ఇంటర్వ్యూలో సాగర్ బయట పెట్టారు.
నిజానికి చెన్నై తనకు కొత్త అని, అంతేకాకుండా యాక్టింగ్ స్కూల్లో నేర్పించిన యాక్టింగ్ ఒకటైతే బయట చేయాల్సింది మాత్రం మరొకటి అని చెప్పుకొచ్చారు సాగర్. డ్రామా స్కూల్లో తనకు సహజంగా ఎలా నటించాలి అనే విషయాన్ని నేర్పించారని, కానీ సీరియల్ లో మాత్రం డ్రామాటిగ్గా చేయాలి అనగానే తనకు కష్టంగా అనిపించేదని ఆ రోజులను మళ్లీ గుర్తు చేసుకున్నారు సాగర్.

ఇక ఈ కారణాల వల్లే తాను చెన్నైకి వెళ్లలేదని, దీంతో తాను రికమెండ్ చేసినా వెళ్ళకపోవడంతో రమాప్రభ హార్ట్ అయ్యారని వెల్లడించారు సాగర్. ఆ తర్వాత ఒకరోజు మొగలిరేకులు సీరియల్ స్టార్ట్ కాగా అక్కడికి వెళ్లాల్సి వచ్చిందట సాగర్. అయితే ఆ సెట్ లోకి అనుకోకుండా రమాప్రభ వచ్చారట.
మొగలిరేకులు సీరియల్ టీంతో ఈ అబ్బాయికి చెన్నైలో మంచి ఛాన్స్ ఇప్పిస్తే వెళ్లలేదు అని, ఇతనికి చాలా బలుపు, అక్కడ హీరోగా నటించే మంచి ఛాన్స్ ని వదులుకున్నాడు అంటూ ఫైర్ అయ్యిందట. అయితే సాగర్ మాత్రం సైలెంట్ గా ఉండి ఆ తర్వాత తాను ఇక్కడే సీరియల్స్ చేయాలి అనుకుంటున్నా అన విషయాన్ని చెప్పుకొచ్చారట.
ఎందుకు చెన్నై వెళ్లలేదు అన్న మొగలిరేకులు టీం ప్రశ్నకు మీరు ఛాన్స్ ఇవ్వండి ఇక్కడే నటిస్తాను అని సమాధానం ఇచ్చారట సాగర్. ఆ తర్వాతే ఆయనను చూసి ఆర్కే నాయుడు అనే పాత్రకు సెలెక్ట్ చేశారట. తాజా ఇంటర్వ్యూలో అప్పట్లో జరిగిన ఈ విషయాలన్నింటినీ గుర్తు చేసుకున్నారు సాగర్.


Click it and Unblock the Notifications











