Vichithra: స్టార్ హీరో రూమ్‌కు రమ్మన్నాడు.. అసభ్యంగా ఆ పని చేశాడు.. బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశం అవుతోంది. చాలా ఇండస్ట్రీలకు చెందిన లేడీ ఆర్టిస్టులు తమకు జరిగిన చేదు అనుభవాలను ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు. అందులో కొందరు ఆధారాలతో సహా ఎన్నో రహస్యాలను లీక్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్, బిగ్ బాస్ తమిళం ఏడో సీజన్ కంటెస్టెంట్ విచిత్ర కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. ఈ మేరకు ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పారో మీరే చూడండి!

ఎన్నో చిత్రాలు.. తెలుగులోనూ: తమిళనాడుకు చెందిన విచిత్ర 1991లోనే హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టారు. ఆ తర్వాత అక్కడ ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే, కన్నడం, మలయాళంలోనూ పలు చిత్రాల్లో సందడి చేశారు. ఈ క్రమంలోనే తెలుగులో 'పోకిరి రాజా' అనే చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ తర్వాత బాలయ్య 'భలేవాడివి బాసూ' సహా ఎన్నో మూవీల్లో మంచి మంచి పాత్రల్లో నటించారు.

బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఎంట్రీ: దాదాపు రెండు దశాబ్దాల పాటు దక్షిణాదిలో హీరోయిన్‌గా సందడి చేసిన విచిత్ర.. వివాహం తర్వాత యాక్టింగ్ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేశారు. అయితే, కొంత కాలం నుంచి మాత్రం బుల్లితెరపై సీరియళ్లలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ తమిళం ఏడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చారు. ఇందులో ఆమె అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు.

కాస్టింగ్ కౌచ్‌పై కామెంట్లు చేసి: తాజాగా బిగ్ బాస్‌లో జరిగిన ఎపిసోడ్‌లో విచిత్ర సినీ రంగంలో తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోపై ఈ సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఆమె ఆ హీరో పేరు ప్రస్తావించలేదు కానీ.. ఎవరికి తోచింది వాళ్లు రాసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు.
రూమ్‌కు రమ్మని పిలిచాడని: బిగ్ బాస్ షోలో విచిత్ర మాట్లాడుతూ.. 'ఓ సినిమా షూటింగ్ సమయంలో 3 స్టార్ హోటల్‌లో పెద్ద స్టార్ హీరోను కలిశా. ఆయన నన్ను తన రూమ్‌కు రమ్మన్నాడు. దీంతో నేను షాక్ అయ్యాను. ఆరోజు ఆయన పిలిచినా సరే నా రూమ్‌లోకి వెళ్లి పడుకున్నాను. తర్వాత రోజు నుంచి నాకు నరకాన్ని చూపించాడు. ఇలాంటి ఘటన తమిళ సెట్లలో ఎప్పుడూ జరగలేదు' అని చెప్పారు.
రోజూ రాత్రి తలుపు కొట్టాడు: ఆ తర్వాత విచిత్ర కొనసాగిస్తూ.. 'ఆ సినిమా కోసం పని చేసే వ్యక్తుల్లో ఒకరు ప్రతి రోజూ నా రూమ్ డోర్ కొట్టేవాడు. పలుమార్లు ఫోన్ కూడా చేసేవారు. ఇదంతా గమనించిన హోటల్ మేనేజర్ నాకు సాయం చేశారు. సినిమా టీంకు తెలియకుండా ప్రతి రోజూ నా రూమ్‌ను మార్చే వారు. అది తెలియక రోజూ వచ్చి డోర్ కొట్టే వారు' అని వివరించారు.

అసభ్యంగా ప్రవర్తించారంటూ: విచిత్ర కంటిన్యూ చేస్తూ.. 'ఒక రోజు సెట్‌లో ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. పొరపాటున అలా చేస్తున్నాడేమో అని వదిలేశా. కానీ, మళ్లీ మళ్లీ అలాగే చేశారు. నేను వెంటనే యాక్షన్ కొరియోగ్రాఫర్‌కు కంప్లైంట్ చేశా. అందరి ముందు ఆ స్టంట్‌మెన్ నన్ను చెంప మీద కొట్టాడు. ఆ టైంలో సెట్‌లో ఏ ఒక్కరూ నాకోసం ముందుకు రాలేదు. తప్పు అని చెప్పలేదు' అన్నారు.

పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను: ఆ తర్వాత విచిత్ర 'ఆరోజు నాలో బాధ, కోపం, కసి వచ్చాయి. కానీ, ఇది నా ఫ్రెండ్స్‌కు మాత్రమే చెప్పారు. వాళ్లు యూనియన్‌కు కంప్లైంట్ చేయమన్నారు. వాళ్లకు చెప్తే మర్చిపో అన్నారు. పోలీసులకు కంప్లైట్ చేసి.. లాయర్‌ను కలిశాను. అప్పుడే నా కెరీర్ ముగిసిందని అర్థమైంది. ఇదంతా చూసిన నా భర్త యాక్టింగ్ మానేయమని చెప్పారు' అంటూ ఆమె వివరించారు.


Click it and Unblock the Notifications











