Anasuya bharadwaj: నాకు ఒక ఫ్యామిలీ ఉంది.. దయచేసి నన్ను వదిలెయ్యండి..

టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నటిగా తనదైన శైలిలో దూసుకుపోతోంది. వరుస సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకొంటోంది. అయితే అప్పుడప్పుడు ఆమె సోషల్ మీడియాలో ఊహించని విధంగా రియాక్ట్ అవుతుంటారు. ఇక రీసెంట్ గా అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...

అరడజనుకి పైగా సినిమాలున్నాయి: తెలుగుతో పాటు తమిళ్, మలయాళీ భాషలలో కూడా అనసూయ నటిస్తూ మంచి క్రేజ్ అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పుష్ప 2 లాంటి పాన్ ఇండియా మూవీతో పాటు అరడజనుకి పైగా సినిమాలున్నాయి. ఇక అనసూయ నటిగా ఎంత పాపులారిటీ తెచ్చుకుందో అంతకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. ఆమె ఫోటోలతో పాటు మాట్లాతో కూడా సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ ఉంటారు.

Senior Anchor Anasuya bharadwaj latest comments viral

ఫైర్ బ్రాండ్ అనే గుర్తింపు: ఓ విధంగా చెప్పాలంటే ఫైర్ బ్రాండ్ అనే గుర్తింపు ఇండస్ట్రీలో అనసూయకి ఉంది. గతంలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం తెలపడం ద్వారా సోషల్ మీడియాలో ఆమె టార్గెట్ అయ్యారు. అప్పటి నుంచి విజయ్ ఫ్యాన్స్, అనసూయకి మధ్య వార్ నడుస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ పేరు ముందు ది పెట్టడంపై ఆనే ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు.

Senior Anchor Anasuya bharadwaj latest comments viral

చాలా మంది ట్రోల్ చేసి విమర్శించారు: తరువాత అనసూయని డైరెక్టర్ గా, ఇన్ డైరెక్ట్ గా చాలా మంది ట్రోల్ చేసి విమర్శించారు. ఐక విజయ్ దేవరకొండ వివాదానికి తాను ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నట్లు మీడియా ముందే కీలక ప్రకటన చేసింది. ఇకపై అనవసరమైన విషయాలలో తల దూర్చనని చెప్పింది. అయితే తాజాగా అనసూయ మరోసారి ట్విట్టర్ రియాక్ట్ అయ్యారు. తనకు సంబందం లేకుండా, చాలా విషయాలలో తన పేరుని ఉపయోగిస్తున్నారని అనసూయ చెప్పుకొచ్చింది.

Senior Anchor Anasuya bharadwaj latest comments viral

వాటితో నాకెలాంటి సంబంధం లేదు: పొలిటికల్, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందిని టార్గెట్ చేయడానికి నా పేరు వాడుకుంటున్నారని ఆమె వాపోయారు. వాటితో నాకెలాంటి సంబంధం లేదు. ఇది నా జీవితం నాకు నచ్చినట్లు ఉంటా. నా దారిలో నేను వెళ్తాను.. అని చెప్పారు. నేను కూడా ఒక మహిళనే, నాకు ఒక కుటుంబం ఉంది. నాకు పీఆర్ టీమ్ లేదు.

ఏదైనా డైరెక్ట్ గా నేనే సమాధానం చెబుతాను. నన్ను ప్రోత్సహించాలని లేకపోతే నా నుంచి దూరంగా ఉండండి. అంతేకాని నాకు సంబంధం లేని విషయాలలోకి నన్ను లాగొద్దు. నేను నా ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్న అని అనసూయ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X