రెచ్చిపోయిన సీనియర్ యాంకర్ శిల్ప.. ఈ ఏజ్‌లో కూడా అందాల సునామీ
ఇప్పుడంటే తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు ఉన్నారు. కానీ, ఆ మధ్యన చాలా తక్కువ మంది మాత్రమే హవాను చూపించేవారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు శిల్పా చక్రవర్తిదే. అంతలా ఈ భామ చాలా ఏళ్ల పాటు టెలివిజన్ రంగంలో వరుసగా షోలు చేస్తూ సందడి చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆశించిన రీతిలో కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్లడం లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శిల్పా చక్రవర్తి కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
అలా వచ్చి.. ఫుల్ పాపులర్:శిల్పా చక్రవర్తి ముందుగా మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అందులో తన అందచందాలతో సందడి చేస్తోన్న సమయంలోనే ఆమెకు వెండితెరపై, బుల్లితెరపై అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే శిల్పా చక్రవర్తి 'వావ్: ది అల్టిమేట్ గేమ్ షో' ద్వారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'కంటే కూతురినే కనాలి' అనే సీరియల్ ద్వారా నటిగానూ పరిచయం అయింది.

యాంకర్‌గా సత్తా చాటింది:యాంకర్‌గా ఎంటరైన తర్వాత శిల్పా చక్రవర్తి తనదైన హోస్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో షోలలో కూడా భాగం అయింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్‌గా ఎదిగింది. షోలు మాత్రమే కాదు సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లతోనూ హడావిడి చేసేసింది.
పెళ్లి తర్వాత కెరీర్‌కు బ్రేక్:యాంకర్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే శిల్పా చక్రవర్తి.. కల్యాణ్ అనే వ్యక్తితో లవ్ ట్రాకును నడిపించింది. అలా రెండేళ్ల పాటు అతడితో సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించిన తర్వాత పెద్దలను ఒప్పించి వీళ్లు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత శిల్పా చక్రవర్తి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి తన యాంకరింగ్ అండ్ యాక్టింగ్ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది.

బిగ్ బాస్ చాన్స్ వచ్చింది:పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అవడంతో కెరీర్‌కు విరామం ఇచ్చిన శిల్పా చక్రవర్తి.. 2019లో ప్రసారం అయిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంటరైంది. కానీ, ఈ అమ్మడు కేవలం రెండు వారాలు మాత్రమే హౌస్‌లో కొనసాగి.. ఆ తర్వాత ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుని ఇప్పుడు టీవీపై సందడి చేస్తోంది.
సోషల్ మీడియాలో బిజీనే:ఎన్నో ఏళ్ల పాటు యాంకర్‌గా, నటిగా తెగ సందడి చేసి.. ఈ మధ్య కాలంలో కెరీర్‌కు గ్యాప్ ఇచ్చినా.. శిల్పా చక్రవర్తి సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా అభిమానులను పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.

అలా రెచ్చిపోతోన్న శిల్పా:సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా రచ్చ చేస్తోన్న శిల్పా చక్రవర్తి.. ఈ మధ్యప ఎక్కువగా అందాలను ఆరబోస్తూ హైలైట్ అవుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ.. క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.
చీరలో స్టన్నింగ్ ఫోజులు:యాంకర్ శిల్పా చక్రవర్తి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్లీవ్‌లెస్ జ్లౌజ్‌లో చీరను కట్టుకుని కనిపించింది. అలాగే, అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో ఫోజులు ఇచ్చింది. దీంతో శిల్పా చక్రవర్తి షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవన్నీ తక్కువ టైంలోనే వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











