twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss 6 Telugu: ఆ యాంకర్ ఇక రానట్లే.. భారీ ఆఫర్ రిజెక్ట్?

    |

    బిగ్ బాస్ సీజన్ 6 కోసం తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన కొన్ని ప్రోమోలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఇక నాగార్జున మరోసారి తన హోస్టింగ్ తో ఆకట్టుకోబోతున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. అయితే కంటెస్టెంట్స్ విషయంలో కొంత సప్సేన్స్ అయితే కొనసాగుతోంది. దాదాపు 18 పేర్లు ఫిక్స్ అని అంటున్నారు. కానీ వాళ్ళు హౌస్ లోకి వచ్చే వరకు గ్యారెంటీ లేదు. ఇక దాదాపు ఫిక్స్ అనుకున్న ఒక సీనియర్ యాంకర్ ఇటీవల బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    లెక్కలు వేసుకొని మరి..

    లెక్కలు వేసుకొని మరి..

    ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్స్ లలో ఎక్కువగా టెలివిజన్ సెలబ్రిటీలు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా యూత్ కు కూడా అవకాశాలు ఎక్కువగానే వచ్చినట్లు సమాచారం. 6వ సీజన్లో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కంటెస్టెంట్లలో అందరూ కూడా చాలా విభిన్నంగా ఉండే విధంగా లెక్కలు వేసుకొని మరి సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం.

    హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్స్

    హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్స్

    మొత్తంగా అయితే ఈసారి 18 మంది కంటెస్టెంట్లు మొదట హౌస్ లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ఇప్పటికే 15 మంది వరకు ఫైనల్ అయినట్లు సమాచారం. మరో ముగ్గురు విషయంలో కూడా తుది నిర్ణయం తీసుకోవడానికి డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. జబర్దస్త్ అప్పారావు, సింగర్ రేవంత్, నేహా చౌదరి, యాంకర్ ప్రత్యూష, సింగర్ మోహన భోగరాజు, అర్జున్ కళ్యాణ్ ఇలా ప్రముఖ సెలబ్రిటీలు హౌస్ లోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

    పేర్లు బయటకు రాకుండా..

    పేర్లు బయటకు రాకుండా..

    దీపికాపిళ్ళై, రివ్యూవర్ ఆదిరెడ్డి, చలాకీ చంటి, నేహా చౌదరి, RJ సూర్య, గీతు రాయల్, శ్రీ సత్య, పాండు మాస్టర్ వంటి వారు కూడా హౌస్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వీరి విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చి అందరిని కూడా క్వారంటైన్ లోకి పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీలైనంతవరకు పేర్లు బయటకు రాకుండా చూసుకోవాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా ఆ పేర్లు మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయి.

    ఆ విషయంలో సస్పెన్స్

    ఆ విషయంలో సస్పెన్స్

    ఈసారి 18 మందిని హౌస్ లోకి తీసుకువచ్చిన తర్వాత మరొక ఇద్దరిని మధ్యలో వైల్డ్ కార్డు ద్వారా రప్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ ఇద్దరు కంటెంట్ ఎవరు అనేది సస్పెన్స్ గానే కొనసాగుతోంది. అలాగే షో కొనసాగుతున్న ఎన్ని రోజులు కూడా ఎలిమినేషన్స్ విషయంలో కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కఠినమైన ఆంక్షలు మధ్య లీక్ కాకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు. ప్రతిసారి ఇలానే జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా హౌస్ లో నుంచి వెళ్లిపోయే కంటెస్టెంట్ పేర్లు లీక్ అవుతూనే ఉన్నాయి. మరి ఈసారి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.

    ఆమె రిజెక్ట్ చేసినట్లేనా?

    ఆమె రిజెక్ట్ చేసినట్లేనా?

    అయితే బిగ్ బాస్ లోకి ఒక కంటెస్టెంట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యారని అనుకుంటున్న తరుణంలో ఆమె మళ్ళీ వెనుకడుగు వేసినట్లుగా మరొక టాక్ వినిపిస్తోంది. తను మరెవరో కాదో గతంలో దాదాపు సుమ రేంజ్ లో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఉదయభాను అని తెలుస్తోంది. అసలైతే ఆమెను గత సీజన్లో తీసుకురావాలని అనుకున్నారు. ఇక ఈసారి కూడా ప్రయత్నాలు జరిగినప్పటికీ రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. భారీ ఆఫర్ ప్రకటించిన కూడా ఉదయభాను వెనుకడుగు వేసినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే.

    English summary
    senior anchor udaya bhanu rejected bigg boss 6 telugu offer
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X