Balayya బాలయ్యకు స్టేజ్​పైనే ముద్దు పెట్టి ప్రపోజ్ చేసిన హీరోయిన్​ - మడతపెట్టేసింది!

ఆలీతో సరదాగా షో నెక్స్ట్ వీక్ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ షోకు వచ్చిన ఓ సీనియర్ హీరోయిన్ బాలయ్య బాబు పై ప్రశంసల వర్షం కురిపించింది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఎవ్వరు వచ్చినా మన బాలయ్య ముందు ఎవ్వరూ పనికిరారు అంటూ ప్రపోజ్ చేసింది. ముద్దు కూడా పెట్టింది. పూర్తి వివరాలు స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

ప్రముఖ హాస్య నటుడు, కమెడియన్​ ఆలీ హోస్ట్​గా వ్యవహరిస్తున్న టాక్​ షో ఆలితో సరదాగా. ప్రతి మంగళవారం వందలాది మంది ప్రేక్షకులకు వినోదం పంచుతున్న ఈ షో ఇప్పటికే ఓ సీజన్ పూర్తి చేసుకుంది. ఎంతో విశేష ఆదరణ పొందింది. అయితే ఈ మధ్యే రీసెంట్​గా రెండో సీజన్ కూడా ప్రారంభించుకుంది. ఇప్పటివరకు బిగ్​బాస్​ ఫేమ్​, నటుడు శివాజీతో ప్రారంభమైన ఈ సీజన్​కు ఆ తర్వాత మ్యాచో స్టార్ గోపిచంద్ వచ్చారు. అనంతరం బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా హాజరై పలు ఆసక్తికర విషప్యాపుడులను పంచుకున్నారు.

Senior Heroine Radha Propose And Flying Kiss To Balayya in Alitho Saradaga Season 2 Full Details Here

అయితే తాజాగా ఇప్పుడు సీనియర్ నటి రాధా కూడా వచ్చేసి సందడి చేశారు. ఈమెతో కలిసి అలీ సరదా సంభాషణలు సాగిస్తూ ఆమె పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్​లో జరిగిన సంఘటనలను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన తాజా ప్రోమోను రిలీజై ఆకట్టుకుంటోంది. అలాగే ఇందులో రాధా చెప్పిన కొన్ని సస్పెన్స్​ మాటలు క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

'మీరు చాలా స్ట్రాంగ్​గా ఉన్నారండి.. మీ జోలికి ఎవరైనా వస్తే అంతేనేమో' అని ఆలీ అనగా.. 'ఎస్.. కసక్.. మడతపెట్టేస్తా' అని రాధా చెప్పింది. 'రియల్ లైఫ్​లో మనలో కూడా ఒక దొంగ ఉన్నాడట కదా' అని మళ్లీ అలీ ప్రశ్నించేసరికి.. 'ఇంటర్వ్యూకు ముందు మీరేమన్నా సీబీఐని పెడతారా ఏమిటి?' అని బదులిచ్చింది 'మీకు ఒక డ్రీమ్​ బాయ్ ఉన్నాడని ఆయనతో నటించాలని అనుకునేవారట.. అబ్బాయిలు కూడా ఇంత అందంగా, ఫెయిర్​గా, యాపిల్​లా ఉంటారా?' అని అనిపించింది. 'సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఎవ్వరు వచ్చినా మన బాలయ్య ముందు ఎవ్వరూ పనికిరారు' అంటూ ఐ లవ్​యూ చెప్పి ప్లైయింగ్ కిస్ ఇచ్చింది.

Senior Heroine Radha Propose And Flying Kiss To Balayya in Alitho Saradaga Season 2 Full Details Here

'ఆయన మీకు మొగుడా.. మీరే ఆయనకు మొగుడా' అని ఆలీ అడగగా.. 'అదెందుకులెం.. .నా మొగుడు ఎక్కువగా మాట్లాడరు' అని చెప్పారు రాధా . 'మన కృష్ణ గారి గురించి' అని ఆలీ అనేసరికి.. 'నాకు కృష్ణ గారంటే.. నేను చిరంజీవి గారిలానే డాన్స్ చేస్తా కానీ కృష్ణ గారితో షూటింగ్ కి వెళ్తే" అంటూ సస్పెన్స్​తో ఆపేసారు రాధా. 'ఒక సినిమా షూటింగ్ అయ్యాక మీరు బాధపడ్డారంటా?'.. 'అవును' అని రాధా చెప్పింది.

'ఒక అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపాలంటే..' అని ఆలీ అనేసరికి రాధా కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురైంది. ఆలీ కూడా కన్నీళ్లు పెట్టుకుని చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంతకు రాధా కృష్ణ గురించి ఎం చెప్పారు, రాధా అలీ కన్నీళ్లు పెట్టుకుని ఎందుకు హగ్ చేసుకున్నారనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్​ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X