Jabardasth కమెడియన్ చలాకీ చంటికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స.. ఏం జరిగిందంటే?

జబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న చలాకీ చంటి హాస్పిటల్ లో చేరినట్లుగా తెలుస్తోంది. సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా తన స్థాయిని పెంచుకున్న చంటి గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా పాల్గొన్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ అతను సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతున్న సమయంలోనే హఠాత్తుగా అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ కమెడియన్ ఆరోగ్యం గురించి చాలామంది కమెడియన్స్ అలాగే సినీ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. చంటి ఇవాళ గుండెల్లో నొప్పి రావడంతో వెంటనే డాక్టర్ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. అయితే దాని తీవ్రత ఎంతో ఉంది అనే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ కమెడియన్ చంటి మాత్రం గుండెపోటు కారణంగా హాస్పిటల్ లో చేరాడు అనే విధంగా పలు రకాల వార్తలు అయితే వెలువడుతున్నాయి.

Senior jabardasth comedian chalaki chanti suffer with heart attack latest health update

ఇక ఈ విషయంలో అధికారికంగా కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చలాకి చంటి అనగానే ఇండస్ట్రీలో అందరికీ కూడా అతని కామెడీ గుర్తుకు వస్తూ ఉంటుంది. మొదట కొన్ని చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన చంటి రేడియో జాకీగా కూడా కొంతకాలం పాటు కొనసాగాడు. ముఖ్యంగా నవ్వుల డాన్ అనే కామెడీ అతనికి రేడియో ప్రపంచంలో మంచి గుర్తింపు అయితే లభించింది. ఇక చంటి జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత అతని స్థాయి మరింత పెరిగింది.

అలాగే ఆ తర్వాత నా షో నా ఇష్టం అనే షో కూడా చేశాడు. దాని తర్వాత సినిమా ఇండస్ట్రీలో మరింత బిజీ అయ్యేవిధంగా చంటి కి అవకాశాలు కూడా వచ్చాయి. ఇక బిగ్ బాస్ 6 వ సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. చంటికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గత కొంతకాలంగా కొంత అస్వస్థతో బాధపడుతున్న చంటి ఇటీవల గుండె నొప్పి ఉండడంతో వెంటనే హాస్పిటల్ లో చేరినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం చంటి ఐసీయూ లో చికిత్స అందుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఇంకా కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. జబర్దస్త్ లోనే మరి కొంతమంది ప్రముఖ కమెడియన్స్ కూడా చంటి ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు అతని సన్నిహితులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చంటి త్వరగా కోలుకుని మళ్లీ అందరికీ క్లారిటీ ఇవ్వాలి అని సోషల్ మీడియాలో కూడా ఓ వర్గం వారు రియాక్ట్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X