ప్రేమించి పెళ్లి చేసుకున్న టీవీ జంట... (ఫోటోలు)
చెన్నై: తమిళ టీవీ యాక్టర్లు సెంథిల్, శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్నారు. బుల్లి తెరపై పలు సీరియల్స్‌లో భార్య భర్తలుగా నటించిన ఈ జంట నిజ జీవితంలోనూ భార్య భర్తలు కావడం విశేషం. తమిళ టెలివిజన్ సీరియళ్లలో వీరు 'శరవణన్- మీనాక్షి' పేర్లతో పాపులర్ అయ్యారు.
తిరుపతిలో జరిగిన వీరి వివాహ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభులు, బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్ హాజరయ్యారు. చాలా కాలంగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారని.....వారి సన్నిహితులు అంటున్నారు.
సెంథిల-శ్రీజ వివాహానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

సెంథిల్-శ్రీజ
కెమెరాకు ఫోజులు ఇస్తున్న సెంథిల్-శ్రీజ. తిరుపతిలో వీరి వివాహం జరిగింది.

కుటుంబ సభ్యులతో...
తిరుపతిలో వివాహం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సెంథిల-శ్రీజ.

తాళి కట్టు శుభవేళ...
హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీజ మెడలో మూడు ముళ్లు వేసి తన అర్దాంగిని చేసుకుంటున్న సెంథిల్.

రేడియో మిర్చి కార్యక్రమంలో...
రేడియో మిర్చి నిర్వహించిన ఓ కార్యక్రమంలో సెంథిల్, శ్రీజ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన దృశ్యం.


Click it and Unblock the Notifications











