Brahmamudi September 1st: అత్తాకోడళ్ల మధ్య వ్రతం చిచ్చ.. మరి రాజ్ ఏం చేయనున్నాడో?

బ్రహ్మముడి సీరియల్ రోజు రోజు ఆసక్తి కలిగిస్తోంది. ఇక కావ్యకు ఇందిరాదేవి వరలక్ష్మి పూజ నిర్వహించే బాధ్యతలు అప్పగిస్తుంది. దీంతో అపర్ణ కోపంతో రగిలిపోతుంది. మరోవైపు కల్యాణ్ ను కలవడానికి అనామిక వస్తుంది. ఇక పూర్తి ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే...

కల్యాణ్ వీర అభిమాని అనామిక కోసం ఓ హోటల్ కు వెళ్తాడు. ఇక అక్కడున్న స్టాఫ్ అంతా.. కల్యాణ్ కు వెల్ కమ్ చెబుతారు. అనామిక బుక్ చేసిన టేబుల్‍ దగ్గర కూర్చుంటాడు కల్యాణ్. ఇంతలో ఓ చిన్న అమ్మాయి రోజా పూవ్వుతో వస్తుంది. ఈమె అనామికనా అని టెన్షన్ పడుతాడు.. మేడమ్ వస్తున్నారు అని చెప్పి రోజ్ ఫ్లవర్ ఇచ్చి వెళ్లిపోతుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఓ ఆంటీ, ఆ తర్వాత మరో బామ్మ.. ఇలా వచ్చి... పువ్వు ఇచ్చిపోతారు. కల్యాణ్ మాత్రం అనామిక వీరేనేమో అని టెన్షన్ పడుతూ.. కాదని తెలుసుకున్నకా కూల్ అవుతూ ఉంటాడు.

Brahmamudi

కొద్దిసేపటికి అనామిక వస్తుంది. అనామిక వచ్చి ఆలస్యం గురించి మాట్లాడుతుంటే తన అందం గురించి పొగుడుతూ కవిత చెబుతాడు కల్యాణ్. ఇద్దరూ మాట్లాడుకుంటారు. అనామికకు వాచ్ గిఫ్టుగా ఇస్తాడు కల్యాణ్. ఇంతలో అప్పు కల్యాణ్‍కు తెగ కాల్ చేస్తుంటుంది. కాల్ కట్ చేసిన కల్యాణ్ పదే పదే చేసేసరికి స్విచ్ ఆఫ్ చేస్తాడు. దీంతో అప్పు తెగ కోపం తెచ్చుకుంటుంది.

Brahmamudi

మరోవైపు ఇంట్లో రాజ్‍ను పిలిచిన తాతయ్య కావ్య గురించి గొప్పగా చెబుతాడు. తను ఇప్పటివరకు అబద్ధం చెప్పలేదు. తన వల్లే నీకు పదిమందిలో గౌరవం దక్కింది. తనతో మంచిగా ఉండు. అర్థం చేసుకో అని తాతయ్య చెబుతాడు. ఇక రాత్రి ఇంట్లో అంతా భోజనం చేస్తుంటారు. భార్యలందరూ భర్తల ఆశీర్వాదం తీసుకునే శ్రావణ మాసం ఇది. ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేద్దాం అని ఇందిరా దేవి అంటుంది. రాజ్ ఆఫీస్‍లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని అంటే.. అసలు ఉండాల్సింది ముఖ్యంగా నువ్వేరా అని ఇందిరా దేవి అంటుంది.

ఇన్నాళ్లు నా పెద్ద కోడలు ఇంట్లో వరలక్ష్మి వ్రతం బాధ్యతలు నిర్వర్తించేది. ఇప్పుడు ఆ బాధ్యతలను అపర్ణ కోడలుకు అప్పజెపుతున్నాను అని ఇందిరాదేవి అంటుంది. దీంతో అపర్ణ, కావ్య ఇద్దరూ షాక్ అవుతారు. కావ్య వద్దని చెప్పినా ఇందిరా దేవి వినదు. చివరిగా వరలక్ష్మి వ్రతం చేసేందుకు ఒప్పుకుంటుంది కావ్య. మరోవైపు కాల్ లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసినందుకు కల్యాణ్‍పై సీరియస్‍గా ఉంటుంది అప్పు. తనదగ్గరికి వచ్చిన కల్యాణ్ తను అనామికను కలిసేందుకు వెళ్లినట్లు చెబుతాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తోంది.

Brahmamudi

ఇక తదుపరి ప్రోమోలో... దుగ్గిరాల ఇంట్లో జరిగే వరలక్ష్మీ వ్రతం బాధ్యతలు ఈసారి అపర్ణ కోడలు కావ్యకి అప్పగిస్తున్నట్టు ఇంద్రాదేవి అందరికీ చెప్తుంది. ఆ మాటకి అపర్ణ కోపంతో రగిలిపోతుంది. దీంతో వారి మధ్య. మళ్లీ యుద్దం రానుందని తెలు్స్తోంది. ఇక ఈ ప్రోమోలో... కావ్య కిచెన్ లో ఉండగా అపర్ణ వెళ్తుంది. తనని ఎదిరించి తన కొడుకు వ్రతంలో కూర్చోడు అన్నట్టు ధీమాగా మాట్లాడుతుంది. అపర్ణ మాట్లాడుతూ... ఈ ఇల్లు నీకు ఆశ్రయం ఇచ్చింది. ఇంటి పెద్దలు నిన్నొక మనిషిలా గుర్తిస్తున్నారు. నువ్వు ఈ ఇంట్లో తిరుగుతుంటే చూసి సహించలేను.

Brahmamudi

అంటే కావ్య వ్రతానికి సంబంధించి ఏదో సవాలు విసిరినట్టుగా ఉంది. వాడు నా కొడుకు నువ్వు నాతో తిరగబడి మాట్లాడినందుకు ఇంటి ముందు నిలబెట్టి తలుపులు మూశాడు. ఇక నాతో సవాలు చేస్తే ఊరుకుంటాడా? అని అంటుంది. దీనికి మీ అబ్బాయ్ మీ మనసు మార్చొచ్చు ఏమో అని కావ్య సమాధానం చెబుతుంది. మరోవైపు అప్పుడే కావ్య గదిలోకి వెళ్తుంటే రాజ్ ఎదురుపడతాడు. వ్రతం నువ్వు చెయ్యి ఫలితం నేను ఇస్తానని మాట ఇస్తాడు. ఏం చేస్తారని కావ్య అడుగుతుంది. కానీ రాజ్ మాత్రం వెయిట్ అండ్ సీ అనేసి వెళ్ళిపోతాడు. ఇక చూడాలి ఏం జరగనుందోనని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X