TV టాప్ సెలబ్రిటీలలో నెంబర్ వన్ స్థానంలో జబర్దస్త్ కమెడియన్.. సుమ ర్యాంక్ ఎంతంటే?
ఇటీవల కాలంలో కేవలం వెండితెరపై కనిపించే స్టార్స్ కు మాత్రమే కాకుండా టెలివిజన్ ప్రపంచంలో ఉండే సెలబ్రిటీలకు కూడా మంచి క్రేజ్ దక్కుతోంది. కొన్ని రియాలిటీ షోల ద్వారా కూడా కొందరు మంచి గుర్తింపును అయితే అందుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్స్ కు అయితే సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇటీవల ఓరామాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీ ర్యాంక్స్ లలో ఐదు మంది టాప్ టీవీ సెలబ్రిటీల ఎక్కువ స్థాయిలో గుర్తింపు అందుకున్నట్లు తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

రష్మి గౌతమ్
2022 సెప్టెంబర్ టాప్ 5 లిస్ట్ చూసుకుంటే 5వ స్థానంలో అయితే ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్ గా కొనసాగిన రష్మీ గౌతమ్ నిలిచింది. ఆమె మొదట జబర్దస్త్ ద్వారానే గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది. ఇక ఇప్పుడు ఢీ ప్రోగ్రాం అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లతో కూడా మంచి క్రేజ్ అయితే అందుకుంటుంది.

చలాకి చంటి
ఇక ఇటీవల బిగ్ బాస్ ద్వారా చలాకి చంటి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు. అంతకుముందు జబర్దస్త్ లో కనిపించిన చలాకి చంటి ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన షోలతో కూడా మెప్పించాడు. ఇక రీసెంట్ గా అతను బిగ్ బాస్ లో కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు కానీ తొందరగా ఎలిమినేట్ అయ్యాడు. అయినప్పటికీ కూడా ఈ లిస్టులో అతను నాలుగో స్థానంలో నిలిచాడు.

సుమ 3వ స్థానంలో
మూడవ స్థానంలో యాంకర్ సుమ నిలవడం విశేషం. టెలివిజన్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే కొన్ని ఎంటర్టైన్మెంట్ షోలలో క్యాష్ ప్రోగ్రామ్ ఒకటి. ఇక సుమ అయితే ఎక్కువగా క్యాష్ ప్రోగ్రామ్ తోనే తన క్రేజ్ పెంచుకుంటుంది. పలు సినిమా ఈవెంట్స్ లలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ లిస్టులో అయితే మూడవ స్థానంలో నిలిచింది.

హైపర్ ఆది
ఇక నెంబర్ 2 లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది నిలిచాడు. హైపర్ ఆది మొదటి జబర్దస్త్ ద్వారానే తనకంటూ ఒక గుర్తింపునందుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కొన్ని సినిమాలు చేసినప్పటికీ అతనికి ఎక్కువగా టెలివిజన్ రంగంలోనే మంచి గుర్తింపు లభించింది. ఇక కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ షోలలో కూడా ఆది బాగానే ఫేమస్ అయ్యాడు.

నెంబర్ వన్ సుధీర్
ఇక నెంబర్ వన్ స్థానంలో సుడిగాలి సుదీర్ నిలిచాడు. అతను ఇటీవల కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ తో మరో లెవెల్ కు వెళ్లాడు అనే చెప్పాలి. ఎక్కువకాలం జబర్దస్త్ లోనే ఉన్న సుధీర్ ఆ తర్వాత ఢీ షోలో కూడా మరి కొంతకాలం ఉన్నాడు. ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కొనసాగుతూ సోషల్ మీడియాలో టెలివిజన్ వరల్డ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. దీంతో ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తేలింది.


Click it and Unblock the Notifications











