టెలివిజన్ నటి ఐశ్వర్య అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన భర్త.. ఫోన్‌లో అలాంటి వీడియోలు అంటూ!
ప్రముఖ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య వివాహేతర సంబంధం అంటూ ఆమె గురించి మీడియాలో వార్తలు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆమె తనను వేధిస్తోందని, అకారణంగా విడాకులు అడుగుతోందని భర్త శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించారు. దీంతో ఆమెకు సంబంధించిన విషయాలన్నీ ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా మరోసారి ఆమె భర్త మరో ఇంటర్వ్యూలో తన భార్య ఐశ్వర్య గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు. తన దగ్గర ఐశ్వర్య అక్రమ సంబంధానికి గురించి ఆధారాలు కూడా ఉన్నాయంటూ షాకింగ్ విషయాలను తెలిపాడు. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, అక్రమ సంబంధం, డివొర్స్ ఇలా ఎక్కువగా వినిపిస్తాయన్న సంగతి తెలిసిందే. మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా అలా బయటకు వచ్చిన పేరు ప్రముఖ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య. ఇప్పుడంతా ఈమె గురించే ఎక్కువగా వినిపిస్తోంది. అక్రమ సంబంధంతో భర్తను మోశం చేసి రూ.25 లక్షలు కాజేసిందని, పైగా తిరగబడి అతడి వేధిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నటి ఐశ్వర్య అడ్డాల. అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 2023 సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్‌ను వివాహమాడింది. అయితే వీరి కాపురం మూడు నెలలు కూడా సరిగ్గా సాగలేదు. సాధారణంగా ఎక్కడైనా భార్యను భర్త వేధిస్తున్నాడని వింటుంటాం. కానీ ఇక్కడ రివర్స్ అవుతోంది. భార్యే తనను వేధిస్తోందని, అకారణంగా విడాకులు అడుగుతోందని భర్త శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించారు. ఆమెపై షాకింగ్ ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా మరో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన భార్య, నటి ఐశ్వర్య అక్రమ సంబంధించిన వీడియోలు, ఆడియో రికార్డుల ఆధారాలు ఉన్నాయంటూ ముందుకొచ్చారు. "మమ్మల్ని మోసం చేసింది. పైగా మేము మోసం చేసినట్లు అంతా పబ్లిసిటీ చేస్తోంది. తన గురించి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసుకున్నాను. తను చేసేది అంతా నటనే. ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటుంది. పైగా వారానికి ఒక్క రోజే కదా అంటుంది. స్మోక్ కూడా చేస్తుంది. వీడియో కాల్లో కూడా ఇవన్నీ చూశాను. పెళ్లైన మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు నటించింది.

హైదరాబాద్ వెళ్లాక తన నిజస్వరూపం బయటపడింది. కర్ణా రమేశ్ బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి ఉంటుందని తెలిసింది. కబోర్డ్‌లో అతడితో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి, సెఫ్టీలు(కండోమ్స్) కూడా ఉన్నాయి. ఒకరోజు తన మొబైల్ పగిలిపోయింది. దాన్ని రిపేర్ చేయించాను. అందులో వారిద్దరికి సంబంధించిన ఫొటోలు, మెసేజ్‌లు ఉన్నాయి. వారిద్దరు కలిసి ఓ సారి రూమ్‌లో ఉన్నప్పుడు కూడా చూశాను. పైగా వీటికి ఏదో ఒక కారణం చెబుతుంటుంది" అంటూ ఎమోషనల్ అయ్యాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.
చూడాలి మరి శ్యామ్ కుమార్ - నటి ఐశ్వర్య పంచాయతి ఎక్కడి దాాకా వెళ్తుందో. అసలు ఇందులో ఎవరు బాధితులో, ఎవరు డ్రామా చేస్తున్నారో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











