Bigg Boss 7 Telugu 2.O: షోలోకి మరో హీరో ఎంట్రీ.. టాప్ రెమ్యూనరేషన్‌తో.. శివాజి బ్యాచ్‌కు దెబ్బేనా?
చిత్ర విచిత్రమైన సన్నివేశాలు.. కంటెస్టెంట్ల మధ్య అన్ని రకాల ఎమోషన్స్.. పైగా ఊహకే అందని ట్విస్టులతో సాగుతూ.. ప్రేక్షకులకు పదిహేను వారాల పాటు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే ఈ షో అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ కారణంగానే తెలుగులో ఇది వరుసగా సీజన్ల మీద సీజన్లను జరుపుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఇందులోకి ఎంతో మంది కంటెస్టెంట్లు వచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సీరియల్ హీరో అర్జున్ ఎంటరయ్యాడు. అతడి గురించి పూర్తి వివరాలు మీకోసమే!
కలర్‌ఫుల్‌గా ఏడో సీజన్:భారతదేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతూనే ఉన్నా.. తెలుగులో రన్ అవుతోన్న బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ స్థాయిలో స్పందన దక్కుతోందన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఏడో సీజన్‌లో 2.Oను కూడా సరికొత్త హంగులతో తాజాగా ప్రారంభించారు. ఇప్పుడు ప్రసారం అవుతోన్న ప్రీమియర్ ఎపిసోడ్ ఎంతో కలర్‌ఫుల్‌గా సాగుతోంది.

ఉల్టా పుల్టా సర్‌ప్రైజెస్:బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో రన్ అవుతోన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే గత ఐదు వారాల్లో ఎన్నో రకాల సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు చూపించారు. ముఖ్యంగా ఎలిమినేషన్స్ అన్నీ విభిన్నంగానే సాగాయి. ఇలా ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. ఇక, 2.O సీజన్‌తో ఆట మరింత రసవత్తరంగా మారబోతుందని చెప్పొచ్చు.
అంబటి అర్జున్ ఎంట్రీ:ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ ఏడో సీజన్ 2.O అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌ల నడుమ ఇప్పుడు ప్రముఖ సీరియల్ హీరో అర్జున్ కూడా కంటెస్టెంట్‌గా అడుగు పెట్టాడు. అతడికి హోస్ట్ అక్కినేని నాగార్జున సాదరంగా స్వాగతం పలికాడు. ఇక, మంచి ఫాలోయింగ్ ఉన్న అతడిపై అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడ్డాయి.
టైటిల్ ఫేవరెట్‌గానే:సీరియల్ హీరోగా చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న అర్జున్.. ఈ మధ్య కాలంలో తన రేంజ్‌ను బాగా పెంచుకున్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ను పెంచుకుని బిగ్ సెలెబ్రిటీగా మారిపోయాడు. అలాంటి అర్జున్ ఇప్పుడు బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి వచ్చాడు. దీంతో అతడిని అందరూ టైటిల్ ఫేవరెట్‌గా భావిస్తున్నారు.
అన్ని లక్షలు ఆఫర్:తాజాగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన అర్జున్‌తో షో నిర్వహకులు ఎప్పుడో ఒప్పందం చేసుకున్నారు. దీంతో అతడు ఆరంభంలోనే వస్తాడని అనుకున్నా.. ఊహించని విధంగా ఇప్పుడు 2.O ఎపిసోడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఇక, అర్జున్‌కు బిగ్ బాస్ టీమ్ వారానికి రూ. 4.50 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తుందని తెలిసింది. ఈ సీజన్‌లో శివాజికి, ఇతడికే ఇంత మొత్తం ఇస్తున్నారట.
శివాజి బ్యాచ్‌కు దెబ్బ:ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 10 మంది పాత కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో సీరియల్ బ్యాచ్, శివాజి బ్యాచ్‌లాగా విడిపోయారు. ఇప్పుడు అర్జున్ టెలివిజన్ బ్యాగ్రౌండ్‌తోనే వస్తున్నాడు కాబట్టి అతడు కూడా స్టార్ మా బ్యాచ్‌తోనే కలుస్తాడని అంతా అనుకుంటున్నారు. అదే జరిగితే శివాజి బ్యాచ్‌కు దెబ్బ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి అర్జున్ ఎలా వ్యవహరిస్తాడో.


Click it and Unblock the Notifications











