‘సీరియల్స్‌లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్లకు ఛాన్సులు ఇవ్వరు అనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఎంతో మంది తెలుగు నటీమణులు మీడియా వేదికగా ఈ విషయాన్ని బయట పెట్టారు. అయితే అది కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాదు. ఇటీవల కాలంలో బుల్లితెర విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో నటీనటులను తీసుకొచ్చి సీరియల్స్ లో హీరోయిన్లుగా చూపిస్తున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం మీద తాజాగా సీనియర్ సీరియల్ యాక్టర్ కౌశిక్ క్లారిటీ ఇచ్చారు.
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కౌశిక్ కు ఎక్కువగా కన్నడ నటీనటులను తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు తీసుకుంటున్నారు? మీలాంటి సీనియర్ యాక్టర్స్ దీని గురించి మాట్లాడరా? అనే ప్రశ్న ఎదురయ్యింది. ఆ ప్రశ్నకు కౌశిక్ స్పందిస్తూ కేవలం తెలుగు వాళ్ళకు ఒక్క పని మనిషి పాత్ర మాత్రమే మిగిలిందని, మిగిలిన అన్ని పాత్రలను కన్నడ యాక్టర్స్ తో చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు.

అయితే కన్నడలో నేను వెళ్లి యాక్ట్ చేస్తాను అన్నా కూడా వాళ్లు అసలు కాళ్ళు కూడా పెట్టనివ్వరని అన్నారు కౌశిక్. ఇదంతా యూనిటీపై ఆధారపడి ఉంటుందని, కన్నడ ఇండస్ట్రీలో ఆర్టిస్టుల మధ్య అంత స్ట్రాంగ్ యూనిటీ ఉంటుంది కాబట్టి బయట వాళ్లను అడుగు పెట్టనివ్వరని వివరించారు.
అయితే తెలుగు వాళ్ళ విషయంలో ఈ యూనిటీ కరువైందని, అందుకే దాదాపు అన్ని క్యారెక్టర్స్ లో కన్నడ ఆర్టిస్టులే ఎక్కువగా కనిపిస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా ఒక నాలుగు ఏళ్ల క్రితం డబ్బింగ్ సీరియల్స్ పైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని, కానీ తమలో తమకు యూనిటీ లేకపోవడం వల్ల అది వర్కౌట్ కాలేదని వెల్లడించారు.
అప్పట్లోనే స్ట్రాంగ్ గా ఫైట్ చేసి, అన్ని ఛానల్స్ దగ్గరకు వెళ్లి డబ్బింగ్ సీరియల్స్ ను ప్రసారం చేయకుండా ఆపాలని రిక్వెస్ట్ చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని గుర్తు చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో అది లేకపోవడం వల్లే ఈ దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడుతుందని కౌశిక్ చెప్పుకొచ్చారు.
ఇక ఆయనకు ఇండస్ట్రీలో ఎదురైన రెమ్యూనరేషన్ కష్టాలను కూడా ఈ సందర్భంగా బయట పెట్టారు కౌశిక్. దాదాపుగా 31 సీరియళ్లలో నటించిన కౌశిక్ కు ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టారా? అనే ప్రశ్న ఎదురు కాగా, చాలామంది ఎగ్గొట్టారని చెప్పారు. తనకు రావాల్సిందే 15 లక్షల దాకా ఉండగా, ఇక అవి రావని వదిలేసుకున్నానని చెప్పారు.
ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేము అని చెప్తే పీక మీద కత్తి పెట్టి ఇవ్వాల్సిందే అని అనలేము కదా. కష్టపడ్డాము దానికి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదే. ఆ విధంగా ఇప్పటిదాకా దాదాపు 15 లక్షలు పోగొట్టుకున్నాను అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు కౌశిక్.
దీంతో కౌశిక్ చెప్పింది నిజమే అంటున్నారు ఆయన మాటలు విన్నవారు. అంతేకాకుండా ఇలాంటి సీనియర్ యాక్టర్లకే రెమ్యూనిరేషన్ ఎగ్గొడితే ఇక చిన్న ఆర్టిస్టుల పరిస్థితి ఉంటే ఇంకెంత దారుణంగా ఉంటుందో మరి అనే టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











