కన్నడిగుల పెత్తనమెంటీ .. నాకు ఆ పోస్ట్ ఇస్తే , తెలుగు బుల్లితెర నటుడి షాకింగ్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో పరభాషా నటుల తాకిడి ఇప్పుడే కొత్తగా మొదలైంది కాదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఈ ట్రెండ్ ఉంది. ఆ రోజుల్లోనే ఎంతో మంది తమిళ, కన్నడ, మలయాళ , హిందీ నటీనటులు తెలుగు సినిమాలలో నటించారు. కళాకారుడికి ప్రాంతం, మతం వంటి భేదాలు లేవని పెద్ద పెద్ద డైలాగులు చెప్పినా.. తెర వెనుక తిట్టుకునేవారు ఎందరో. ఆశ్చర్యకరంగా సినిమాకే పరిమితమైన ఈ కల్చర్ ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగానికీ విస్తరించింది, ముఖ్యంగా తెలుగు సీరియల్స్‌ మొత్తం కన్నడ నటీనటులు ఆక్రమించేశారు. ఏ ఛానెల్‌లో ఏ సీరియల్ చూసినా లీడ్ క్యారెక్టర్స్ వారివే కావడంతో తెలుగు బుల్లితెర కళాకారులు ఫైర్ అవుతున్నారు.

స్థానికులను పక్కనపెట్టి .. ఎక్కడి నుంచో నటీనటులను తీసుకొచ్చి వారిని అందలం ఎక్కించడం ఏంటని బహిరంగంగానే మండిపడుతున్నారు. ఇంటిల్లిపాది ముఖ్యంగా ఆడవాళ్లకు ఎంటర్‌టైన్మెంట్ అందించడంలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి. అందుకే తెలుగునాట సినిమా తారలతో సమానంగా సీరియల్స్‌కు మంచి క్రేజ్ నెలకొంది. బుల్లితెరపై కొన్ని సీరియల్స్ టీఆర్‌పీల ముందు స్టార్ హీరోల సినిమాలు కూడా నిలబడటం లేదంటే వాటి సత్తా అర్ధం చేసుకోవచ్చు.

serial actor kaushik made sensational comments on kannada actors in telugu television industry

ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా , ఎవరు ఏమనుకున్నా తెలుగు బుల్లితెరపై కన్నడ భామల హవా నడుస్తోంది. అర్చనా అనంత్, శోభాశెట్టి, ఐశ్వర్య పిస్సే, రక్షా గౌడ, మంజుల, నవ్య స్వామి, తేజస్విని గౌడ వంటి భామలతో పాటు పలువురు కన్నడ అబ్బాయిలు కూడా తెలుగు సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. అంతేందుకు తెలుగువారి ఫేవరేట్ షోలలో ఒకటైన జబర్దస్త్‌కు ఆ మధ్య యాంకర్‌గా ఏకంగా సౌమ్యా రావ్ అనే కన్నడ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు. సీరియల్స్ , సినిమాలంటే డబ్బింగ్‌తో మేనేజ్ చేసుకోవచ్చు.. కానీ తెలుగు షోలకు ఓ కన్నడ అమ్మాయి యాంకరింగ్ చేయడమంటే మనవాళ్లు ఎలా దిగజారిపోయారో అర్ధం చేసుకోవచ్చు.

అంతేకాదు.. తెలుగు బిగ్‌బాస్‌ రియాలిటీ షోలోనూ కన్నడ నటీనటులు కంటెస్టెంట్స్‌గా వచ్చి ఇక్కడా పాగా వేశారు. గత సీజన్‌లో కర్ణాటకకే చెందిన శోభాశెట్టి, పూజామూర్తిలు బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి టఫ్ ఫైట్ ఇచ్చారు. ఈ కల్చర్‌ను బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లోనూ కంటిన్యూ చేశారు. ఈసారి ఏకంగా నలుగురు కన్నడిగులకు అవకాశం కల్పించారు. వారే నిఖిల్, యష్మీ గౌడ, ప్రేరణ కంభం, పృథ్వీరాజ్ శెట్టి . వీరంతా ఒక బ్యాచ్‌లా మారి తెలుగు కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇస్తున్నారు.

ఇదిలాఉండగా.. తెలుగు బుల్లితెరపై కన్నడ నటీనటుల హవాపై సీనియర్ నటుడు కౌశిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నడ వాళ్లకి కేర్‌వాన్ ఇస్తారు.. మాకేమో రూమ్ ఇస్తారని తెలిపారు. మన వాళ్లకి అక్కడ సమస్యలు స్టార్ట్ అవుతాయని .. కానీ ఏమున్నా ముందే ప్రొడ్యూసర్‌తో మాట్లాడుకుంటే ఈ ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు. మనకంటే కన్నడ వాళ్లకే రెమ్యునరేషన్ ఎక్కువని అయితే వాళ్లు రాత్రి 1 గంట వరకు కూడా పనిచేస్తారని కౌశిక్ చెప్పారు. ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ అనే ఒక సంఘం ఉందని దానికి ఎన్నికలు జరగడం లేదన్నారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కంటే టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 1000 రెట్లు బెటర్ అన్నారు. కానీ ఎన్నికలు ఎందుకు జరగడం లేదో తనకు ఇప్పటికీ అర్ధం కావడం లేదన్నారు. 25 ఏళ్లు వినోద్ బాలా టీవీ ఆర్టిస్టులకు ప్రెసిడెంట్‌గా చేశారని.. కానీ తనకు ఏకగ్రీవంగా అవకాశం ఇవ్వాలని అడిగానని కౌశిక్ తెలిపారు . సీరియల్‌కి ముగ్గురు కన్నడిగులను పెట్టుకుని , ఏడుగురిని మనవాళ్లని పెట్టుకుందామని తన వద్ద ప్రపోజల్ ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు దానికి విరుద్దంగా ఏడుగురు కన్నడ నటులు, ముగ్గురు తెలుగువాళ్లు ఓ సీరియల్ కోసం పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X