Bigg Boss: శ్రీ సత్యకు కీర్తి బాయ్‌ఫ్రెండ్ షాక్.. అందరి ముందే అవమానం.. అందుకే అలా పరువు తీశాడా!

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా ఇండియాలోకి వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే బుల్లితెరపై టాప్ ప్లేస్‌కు చేరుకుంది బిగ్ బాస్. హిందీలో సూపర్ డూపర్ హిట్ అవడంతో దీన్ని మిగిలిన భాషల్లోకి పరిచయం చేశారు. అలా తెలుగులోకి వచ్చిన ఈ షో.. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దేశంలోనే నెంబర్ వన్ షోగా ఎదిగింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తూ ఇప్పుడు ఆరో దాన్ని నడుపుతున్నారు. ఇక, ఇందులో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ సత్యకు కీర్తి భట్ బాయ్‌ఫ్రెండ్ బిగ్ షాక్ ఇచ్చాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!

పూర్వ వైభవం కోసం కొత్తగా

పూర్వ వైభవం కోసం కొత్తగా

బిగ్ బాస్ ఆరో సీజన్‌ ఎన్నో అంచనాలతో మొదలైంది. అయితే, ఆరంభం నుంచే చాలా చప్పగా సాగింది. దీంతో బిగ్ బాస్ సక్సెస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షో నిర్వహకులు పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా షోను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడిపిస్తున్నారు. దీంతో ఈ సీజన్‌కు చివరి దశలో స్పందన మంచిగా వస్తోంది.

బీబీ కోచింగ్ సెంటర్ టాస్కు

బీబీ కోచింగ్ సెంటర్ టాస్కు

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ప్రతి వారం రకరకాల టాస్కులు ఇస్తుంటారు. ఇందులో భాగంగానే పన్నెండో వారానికి సంబంధించి 'బీబీ కోచింగ్ సెంటర్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో ఫైమా ఇంగ్లీష్ టీచర్‌గా, ఆది రెడ్డి డ్యాన్స్ మాస్టర్‌గా, శ్రీ సత్య మేకప్ టీచర్‌గా, రాజశేఖర్ సింగింగ్ టీచర్‌, రేవంత్ యోగా టీచర్‌గా, శ్రీహాన్ ఫ్లట్టింగ్ మాస్టర్‌గా వ్యవహరిస్తూ క్లాసులు తీసుకుంటున్నారు.

బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్

బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్


ప్రతి సీజన్‌లోనూ చివరి వారాల్లో కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో అన్ని సీజన్లలోనూ ఇదే తరహాలో వాళ్లను తీసుకొచ్చారు. ఇక, ఆరో సీజన్‌కు సంబంధించి ఇప్పుడు అది జరుగుతోంది. మంగళవారం రాత్రి నుంచి ఇది ప్రారంభం అయింది. వాళ్ల ఎంట్రీలు అన్నీ ఎంతో ఎమోషనల్‌గా సాగుతున్నాయి.

కీర్తి కోసం వచ్చేసిన మహేశ్

కీర్తి కోసం వచ్చేసిన మహేశ్


గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి కీర్తి భట్ బాయ్‌ఫ్రెండ్‌గా ప్రచారం అవుతోన్న సీరియల్ నటుడు మహేశ్ బాబు కాలిదాసు ఎంట్రీ ఇచ్చాడు. మెయిన్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించిన అతడిని చూసి కీర్తి ఎమోషనల్ అయింది. రావడం రావడమే మహేశ్ 'అప్పుడు నా వీడియో కాల్ వద్దని.. మానస్ కాల్ కావాలని అడిగావా' అని ఆమెను సరదాగా ప్రశ్నించాడు.

డ్యాన్స్ చేసి.. ధైర్యం చెప్పి

డ్యాన్స్ చేసి.. ధైర్యం చెప్పి


మహేశ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన సమయంలో ఫ్రీజ్ అయి ఉన్న కీర్తి భట్.. ఆ తర్వాత పరుగు పరుగున వచ్చి అతడిని హగ్ చేసుకుంది. అప్పుడతను డ్యాన్స్ చేద్దామా అని అడిగి పాట పెట్టమని బిగ్ బాస్‌ను రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఇద్దరూ కలిసి కాసేపు రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఆమెకు ఆట ఎలా ఆడాలో వివరించడంతో పాటు ధైర్యంగా ఉండమని చెప్పాడు.

శ్రీ సత్యకు షాకిచ్చిన మహేశ్

శ్రీ సత్యకు షాకిచ్చిన మహేశ్

మహేశ్ ఎంట్రీ ఇచ్చిన కాసేపటికి హౌస్‌మేట్స్ అందరూ బయటకు వచ్చారు. ఆ సమయంలో అతడికి వాళ్లంతా సాదరంగా స్వాగతం పలికారు. అందుకు అనుగుణంగానే అతడు కూడా కంటెస్టెంట్లు అందరితో సరదాగా మాట్లాడి.. వాళ్ల ఆట గురించి వెల్లడించాడు. కానీ, శ్రీ సత్యతో మాత్రం మహేశ్ మాట్లాడలేదు. పైగా ఆమె ముఖం వైపు కూడా చూడకుండా పరువు తీసేశాడు.

అందుకే అలా చేశాడా అని

అందుకే అలా చేశాడా అని

రెండు వారాల క్రితం జరిగిన నామినేషన్స్ టాస్కులో కీర్తి భట్‌ను శ్రీ సత్య ఓ రేంజ్‌లో వెక్కిరిస్తూ ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలో ఇద్దరికీ పెద్ద గొడవ కూడా జరిగింది. దీన్ని మనసులో ఉంచుకునే మహేశ్ ఆమెతో అలా ప్రవర్తించి ఉంటాడా అని అంతా చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఫ్యామిలీ ఎపిసోడ్ వల్ల శ్రీ సత్యకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X