పెళ్లయ్యాక బిగ్‌బాస్‌ బ్యూటీతో మానస్ ప్రేమాయణం.. అందరి ముందే హగ్గులు.. షాక్‌లో ఫ్యాన్స్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ మానస్ గురించి అందరికీ తెలిసిందే. సీరియల్ నటుడిగా కెరియర్ ప్రారంభించిన ఇతడు.. బిగ్ బాస్ హౌస్ లో అద్బుతమైన ఆట తీరుతో అందరినీ మెప్పించాడు. అలాగే అక్కడ ఉండగా.. తరచుగా తన వెంట పడుతున్న ఓ హాట్ బ్యూటీతో మంచి బంధాన్ని ఏర్పరుచుకున్నాడు. అది వేరేలో వెళ్తుందని తెలుసుకుని దూరంగా ఉన్నాడు. కానీ ఆమె మాత్రం ఇతడిపై ప్రేమను చూపించడం ఆపలేదు. షో జరిగి చాలా రోజులు అవుతుండగా.. మరోసారి ఆయన ఈ ముద్దుగుమ్మతో రొమాన్స్ చేశాడు. ఆ వివరాలు ఏంటి ఆ అమ్మాయి ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొన్న వాళ్లలో ప్రియాంక్ సింగ్ కూడా ఒకరు. ఆమే ఎక్కువగా మానస్ తో మెలిగింది. అతడిని బావా అని కూడా పిలుస్తూ రచ్చ చేసింది. ఓవైపు సిరి, షణ్ముక్, జశ్వంత్, శ్రీరామ చంద్రలతో చాలా క్లోజ్ గా ఉంటూనే... మరోవైపు కాజల్, మానస్, సన్నీలతో కూడా స్నేహాన్ని కంటిన్యూ చేసింది. కాకపోతే మానస్ పై తనకు క్రష్ ఉండేది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా నడిచింది. కానీ బయటకు ఎలా పోతుందోనని భయపడిన మానస్ ప్రియాంకను దూరం పెట్టడం చేశాడు.

Serial Actor Manas Romance With Bigg Boss Beauty After He Getting Married Check Detials

తాను మాత్రం మానస్ ను మర్చిపోలేక చాలా ఇబ్బంది పడింది. అతడు కాదంటున్నా వెనువెనుకే తిరుగుతూ తన ప్రేమను వ్యక్త పరిచింది. అతడు మాట్లాడకపోతే అన్నం కూడా తినను అంటూ మారా చేసింది. కానీ ఆయన మాత్రం పింకీతో కలవలేదు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాకా కూడా వీరిద్దరూ ఎప్పుడూ ఓచోట కలవలేదు. అయితే ఇటీవలే మానస్ పెళ్లి చేసుకున్నాడు. చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇదంతా ఇలా ఉండగా.. ఇప్పుడు మరోసారి ప్రియాంక సింగ్ తో రొమాన్స్ చేశాడు.

ఢీ జోడి అనే షో ప్రారంభం కాగా.. మానస్ తో పాటు ప్రియాంక సింగ్ డ్యాన్స్ చేసింది. కేవలం మానస్ మాత్రమే కాదు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో పాల్గొన్న్ యాంకర్ శివ కూడా ఇందులో పాల్గొన్నాడు. నిజానికి శివకు జోడీగానే ప్రియాంక సింగ్ ఈషోలో అడుగు పెట్టింది. కానీ ఆమె కంగ్రాట్స్ చెప్పడానికి అన్నట్లుగా తొలి పర్ఫార్మెన్స్ ముగ్గురు చేశారు. ఈక్రమంలోనే ప్రియాంక సింగ్ గురించి చెప్పమని మానస్ ను అడగ్గా.. తాను చాలా అందంగా ఉంటుందని అన్నాడు. బయట మాత్రమే కాదు లోపలి నుంచి కూడా అంటూ వివరించాడు.

Serial Actor Manas Romance With Bigg Boss Beauty After He Getting Married Check Detials

అలాగే ఆమె చాలా మంచిదని.. ఇలాగే కెరియర్ లో మరింత ముందుకు వెళ్లాలంటూ చెప్పుకొచ్చాడు.దీనికి స్పందించిన పింకీ.. చాలా థాంక్స్ మానస్ గారు అంటూ చెప్పుకొచ్చింది. ఏంటి గారు అంటున్నావంటే.. ఏరా మానస్ బాగున్నావా అంటూ మరోసారి క్యూట్ గా అడిగింది. దీనికి అంతా ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. ఆ తర్వాత మానస్ పింకీని దగ్గరకు తీసుకుని ఓ హగ్ ఇచ్చాడు. తనకు ఎప్పుడూ ఫ్రెండ్ గా సపోర్టింగ్ గానే ఉంటానంటూ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X