అరగంటలోనే లక్షా 60 వేలు.. నటించి కాదు అడుక్కుని సంపాధించిన సీరియల్ హీరో.. ఎందుకో తెలుసా?
ఈ మధ్య కాలంలో అనేక మంది సీరియల్ నటులు.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గర అవుతున్నారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను యూట్యూబ్ ఛానెళ్లు స్టార్ట్ చేసుకుని మరీ చెబుతున్నారు. తమ మేకప్, జ్యువెల్లరీ, హెయిర్ స్టైల్, చీరలు, డ్రెస్సులు ఇలా అన్నింటినీ చూపిస్తూ సవాలక్ష వీడియోలు చేస్తూ బాగా సంపాధించుకుంటున్నారు. సీరియల్స్ వచ్చే డబ్బుల కంటే కూడా యూట్యూబ్ ఇన్ కమ్ యే ఎక్కువ ఉండండతో చాలా మంది వీటిపై దృష్టి వాలుస్తున్నారు. అయితే ఇదే బాటలో నడుస్తున్న ఓ సీరియల్ నటుడు తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో అప్ లోడ్ చేశారు. అందులో అడుక్కుని తాను లక్షా 60 వేలు సంపాధించినట్లు చెప్పాడు. అతడెవరు, ఎందుకు అడుక్కున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ బెస్ట్ ఫ్రెండ్, జానకి కలగనలేదు సీరియల్ నటుడు నరేష్ లొల్ల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈయన లొల్లాస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఈ ఛానెల్ వేధికగా అనేక ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు. అయితే ఇటీవలే అమర్ దీప్ తో పాటు తేజస్విని ఇంటర్వ్యూ చేసిన ఈయన.. తాజాగా మరో వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ విడియో ప్రారంభం కావడమే.. ఓ గుడికి వచ్చిన అతడు దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఆ తర్వాత తాను అడుక్కోబోతున్నట్లు చెప్పి అందరినీ షాక్ కు గురిచేశాడు.
ముందుగా అడుక్కుతిందామనుకుంటున్నాను అని అన్న ఆయన... ఆ వెంటనే సారీ అడుక్కొని పెడదామనుకుంటున్నాను అని అన్నాడు. ఆ తర్వాత వీటికి కారణాలు చెబుతూ అసలైన రీజన్స్ చెప్పాడు. తాను చేసే వీడియోలు అన్నింటి కిందా.. నువ్వు బెగ్గర్ వి, వాళ్లవీ, వీళ్లవీ వీడియోలు చేసుకుంటూ అడుక్కుంటున్నావు, అడుక్కు తింటున్నావు, బిచ్చాగాడివి అని కామెంట్లు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే ఇవన్నీ చూసి బాధ పడిన తనకు ఓ అద్బుతమైన ఆలోచన వచ్చిందని.. తన సబ్ స్క్రైబర్లు అందరినీ ఒక్కో రూపాయి అడుక్కొని.. వాటిని తన సబ్ స్క్రైబర్లలోనే బాధల్లో ఉన్న వారికి ఇస్తానని చెప్పుకొచ్చాడు.

అయితే న్యూ ఇయర్ రిజల్యూషన్ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఈక్రమంలోనే సబ్ స్కైబర్లు అందరినీ ఒక్కో రూపాయి ఇవ్వమని వీడియో చేశాడు. అలా తనను నమ్మే వాళ్లు, తనతో పాటు ఇతరులకు హెల్ప్ చేయాలనుకున్న వాళ్లు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఇవ్వాలని చెప్పాడు. అలాగే కింద కామెంట్లలో తమకు ఉన్న సమస్య గురించి సింపుల్ గా చెప్పాలని.. చదువు కోసం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్యం ఇలా మెన్షన్ చేయాలని వివరించాడు. ఇదంతా విన్న ఆయన సబ్ స్క్రైబర్లు మనిషికి ఒక రూపాయి ఇవ్వగా.. మొత్తంగా ఆయనక లక్షా 60 వేల రూపాయలు వచ్చాయి.

అయితే ఈ డబ్బును ఎవరికి, ఏ సమస్య కోసం ఉపయోగించబోతున్నానో త్వరలోనే చెబుతానని త్వరలో వివరించాడు. అయితే ఆయన ఎవరికి సాయం చేశాడో, ఎలాంటి సమస్యను తీర్చేందుకు ఈ డబ్బును వాడాడో తెలియాలంటే ఆయన పెట్టే మరో వీడియో వరకు అగాల్సిందే. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











