అమర్‌దీప్ భార్యకు నరకం.. అసభ్యకరంగా తేజస్విని ఫొటోలు.. బయటపెట్టిన సీరియల్ యాక్టర్ నరేష్

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. ఇండియాలోని చాలా భాషల్లో నెంబర్ వన్ ప్లేస్‌కు చేరింది బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో ఇది సంచలనాలను సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా వరుసగా సీజన్లను ప్రసారం చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం జరుగుతోన్న ఏడో సీజన్‌లో సీరియల్ యాక్టర్ అమర్‌దీప్ చౌదరి కూడా కంటెస్టెంట్‌గా వచ్చాడు. హౌస్‌లో అతడు కష్టాలను ఎదుర్కొంటున్నట్లుగానే.. బయట అతడి భార్య తేజస్విని నరకం చూస్తోంది. ఈ విషయాన్ని మరో సీరియల్ నటుడు నరేష్ లొల్ల బయట పెట్టాడు. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

Serial Actor Naresh Lolla Reveals Amardeep Chowdary Wife Tejaswini Struggles

అమర్‌దీప్ హాట్ టాపిక్‌గా: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ఎన్నో అంచనాలతో అడుగు పెట్టిన అమర్‌దీప్ చౌదరి ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే, క్రమంగా అతడి ఆటతీరు, మాటతీరు మెరుగుపడింది. ఫలితంగా గ్రాఫ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. దీంతో టైటిల్ రేసులోనూ నిలిచాడు. ముఖ్యంగా కొన్ని వారాలుగా అమర్ అద్భుతంగా ఆడుతూ హాట్ టాపిక్‌గా మారిపోతున్నాడు.

ట్రోల్స్.. నరేష్ సపోర్టుగా: బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న అమర్‌దీప్‌పై కొంత మంది కావాలని ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో అతడికి మరో సీరియల్ నటుడు నరేష్ లొల్ల అండగా నిలుస్తున్నాడు. ఇందుకోసం బయటకు వచ్చి మరీ ఇంటర్వ్యూలు ఇస్తూ.. ట్రోలర్స్‌పై చర్యలు తీసుకుంటున్నాడు. అదే సమయంలో అమర్‌ భార్య తేజస్వినికి సైతం ధైర్యం చెప్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంటర్వ్యూ ఇచ్చాడు.

సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు: తాజా ఇంటర్వ్యూలో నరేష్ లొల్ల 'అమర్‌ను, అతడి ఫ్యామిలీని కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై నేను సైబర్ క్రైమ్‌కు కూడా వెళ్లాను. నేను కూడా గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో వాళ్ల అకౌంట్లు క్లోజ్ చేసుకున్నారు. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా దాదాపు 300 అకౌంట్లు క్లోజ్ చేపించాను. కొందరు మంచిగానే విన్నారు.. కొందరు భయంతో పోయారు' అన్నాడు.

అర్ధరాత్రి కూడా వదల్లే: నరేష్ కంటిన్యూ చేస్తూ 'నేను అబ్బాయిని కాబట్టి ఫైట్ చేయగలిగాను. కానీ అమ్మాయిలు అలా కాదు. అమర్‌‌ను సపోర్ట్ చేస్తూ ఓ అమ్మాయి పోస్ట్ పెట్టిందని.. ఆమె గురించి దారుణంగా కామెంట్లు పెట్టి హింసిస్తున్నారు. తను రాత్రి 12.30కి నాకు ఫోన్ వాళ్ల టార్చర్ భరించలేకపోతున్నానని చెప్పింది. ఆ అకౌంట్స్ నేను చూస్తే నిజంగానే మెసేజ్‌లు పెడుతున్నారు' అని తెలిపాడు.

తేజూ పిక్ మార్ఫ్ చేసి: నరేష్ కొనసాగిస్తూ.. 'ఇప్పటి వరకూ చాలా మంది బిగ్ బాస్‌లోకి వెళ్లారు. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. కానీ తేజస్విని అంత ఇబ్బంది ఎవరూ పడలేదు. నేను ఈ విషయం ఇప్పటి వరకూ చెప్పలేదు. అసలు చెప్పొచ్చో లేదో కూడా తెలియదు.. తేజూ ఫొటోలను మార్ఫింగ్ చేశారు. అసభ్యకరమైన బాడీలకు ఆమె ఫేస్ పెట్టి తననే ట్యాగ్ చేశారు' అని వెల్లడించాడు.

నరకం అనుభవిస్తూ: ఆ తర్వాత నరేష్ 'ఫొటో మార్పింగ్ విషయం తేజూ నాతో చెప్పలేదు. నేనే చూసి కంప్లైంట్ చేశాను. తర్వాత ఆ అకౌంట్‌లను డిలీజ్ చేయించా. నాకు తెలిసీ ఆ అమ్మాయి అంత బాధ ఎవరూ అనుభవించి ఉండరు. తను అమ్మాయి. ఎవరితోనూ తన బాధను చెప్పుకోలేదు. భర్త షోలో ఉన్నాడు. అత్తమామలు అమ్మనాన్నలతో చెప్పుకోలేక నరకం చూసింది' అని ఎమోషనల్ అయ్యాడు.

భయపడిపోతుందని: అనంతరం నరేష్ 'తేజూను ఎంతలా టార్చర్ చేశారంటే.. యూట్యూబ్‌లో అమర్‌కు సపోర్టుగా వీడియో పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఏమైనా పెడదాం అంటే ట్రోల్స్ చేస్తారని భయపడుతుంది. అంతేతప్ప కావాలని సపోర్టు చేయట్లేదు అనేది అబద్ధం. తను షూట్‌లో బిజీగా ఉన్నా ఫోన్‌లో షో చూస్తూనే ఉంటుంది. ఎప్పుడూ అమర్‌ గురించే ఆలోచిస్తుంది. దయచేసి ఇకనైనా ఈ ట్రోలింగ్ ఆపండి. పోటీ అనేది పద్దతిగా ఉండాలి. ఇలా ఎదుటి వాళ్లను టార్చర్ చేసేలా కాదు' అని ముగించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X