Bigg Boss Telugu 7 లో బుల్లితెర మెగాస్టార్, యాటిట్యూడ్ స్టార్.. ఇది ఊహించని స్కెచ్!
తెలుగులో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే టైటిల్ తో అమెరికాలో ప్రారంభమై సూపర్ సక్సెస్ అయిన ఈ షో తర్వాత ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. హిందీలో మొదటగా వచ్చిన ఈ షో మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో వివిధ భాషల్లో కూడా బిగ్ బాస్ షో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులో ఇప్పటికీ 6 రెగ్యులర్, ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో బుల్లితెర మెగాస్టార్ గా పిలవబడే ప్రభాకర్ కంటెస్టెంట్ గా చేస్తున్నట్లు టాక్ వస్తోంది.
విపరీతమైన క్రేజ్: యాహు అనే టీవీ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ప్రభాకర్. ఈ షో తర్వాత ఈటీవీలో పలు సీరియల్స్ లో నటించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలాగే పలు పాపులర్ షోస్ కి క్రియేటివ్ హెడ్ గా పనిచేశారు. అలాగే సీరియల్స్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా చెపట్టారు. నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఆయనకు మంచి అనుభవం ఉంది.

సినిమాల్లో: సీరియల్స్ నుంచి ఫేమస్ అయ్యాక పలు సినిమాల్లో కూడా నటించారు ప్రభాకర్. శ్రీకాంత్-పోసాని కృష్ణమురళి కాంబినేషన్ లో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన సినిమాలో పోలీసుగా నటించి ఆకట్టుకున్నారు ప్రభాకర్. ఆ తర్వాత వరుసపెట్టి సీరియల్స్ చేసి పూర్తిగా బిజీ అయిపోయారు. అంచెలంచెలుగా ఎదిగిన ప్రభాకర్ బుల్లితెరకు మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల వదినమ్మ సీరియల్ లో నటించారు.
అప్పుడే ప్రారంభం: ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సందడి నెలకొననుంది. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రోమోను ఇదివరకే విడుదల చేశారు. సాధారణంగా ప్రతీ టీవీ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రసారం అవుతుంది. కానీ బిగ్ బాస్ తెలుగు 7 మాత్రం ఇంకాస్తా ముందుకు వస్తూ జూలై నెలాఖరున, లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

సభ్యులు సెలెక్ట్: బిగ్ బాస్ ప్రారంభం అవుతుందంటే అందులో ఎవరెవరూ పాల్గొంటున్నారనేది హాట్ టాపిక గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయ్యారని టాక్ వస్తోంది. వారిలో యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల ఉందని టాక్ నడిచింది. కానీ, అందులో నిజం లేదని తాజాగా వీడియో ద్వారా చెప్పేసింది.
తండ్రీకొడుకులు: తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు 7లో ప్రభాకర్ కంటెస్టెంట్ గా వస్తున్నారని టాక్. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రభాకర్ సీజన్ 6లో రోహిత్ కు సపోర్ట్ గా వచ్చాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ లో అడుగు పెడితే రచ్చ రచ్చే అంటున్నారు నెటిజన్లు. ఒకవేళ ప్రభాకర్ ఈ ఆఫర్ కు నో చెబితే.. ఆయన కుమారుడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వచ్చినా సరే అంటున్నారు.

యాటిట్యూడ్ తో: ప్రభాకర్, ఆయన కొడుకు చంద్రహాస్ లో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌజ్ లో అడుగు పెడితే మాములుగా ఉండదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ను హీరోగా ఇటీవల పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనౌన్స్ మెంట్ లో చంద్రహాస్ తనదైన యాటిట్యూడ్ తో నిల్చోవడం, పోజులివ్వడంపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.


Click it and Unblock the Notifications











