Bigg Boss 7 Telugu 2.O: బిగ్ బాస్‌కే నటి షాక్.. చివరి నిమిషంలో మారిన లిస్ట్.. ఆమె స్థానంలో ఎవరంటే!
బుల్లితెరపైకి వచ్చిన తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులను దోచుకుని.. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను రాబట్టి నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. ఇలా ఇప్పటికే ఈ కార్యక్రమం ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే నిర్వహకులు ఏడో దాన్ని మొదలు పెట్టారు. ఇది సక్సెస్‌ఫుల్‌గా సాగుతుండగానే ఈ సీజన్ 2.O కోసం సన్నాహాలు చేస్తున్నారు. దీంతో చాలా మంది కంటెస్టెంట్ల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నటి బిగ్ బాస్‌కు షాకిచ్చినట్లు న్యూస్ లీకైంది. ఇంతకీ ఎవరా నటి? ఆ పూర్తి వివరాలు మీకోసమే!
ఉల్టా పుల్టాగానే ఏడో సీజన్: మిగిలిన భాషల కంటే తెలుగులోనే బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. అందుకే నిర్వహకులు ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దానిని కూడా ప్రారంభించారు. దీనికి మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను పెంచేందుకు సరికొత్త టాస్కులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తున్నారు. దీంతో ఇది ఉల్టా పుల్టాగానే సాగిపోతోంది.

నలుగురు లేడీస్ బయటకు: ఏడో సీజన్‌లోకి శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, శుభ శ్రీ, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, నటి షకీలా, సందీప్, సీరియల్ హీరో అమర్‌దీప్‌లు ఎంటర్ అయ్యారు. వీరి నుంచి తొలి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, థర్డ్ వీక్‌లో దామిని, నాలుగో వారం రతికా రోజ్‌లు వెళ్లిపోయారు.
ఐదు వారాల తర్వాత అలా: బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టాగా సాగుతుందని నిర్వహకులు ముందుగానే చెప్పారు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆరంభం నుంచే ట్విస్టులు ఇస్తున్నారు. ముఖ్యంగా పవర్ అస్త్ర అంటూ కంటెస్టెంట్లను కన్ఫార్మ్ చేశారు. కానీ, ఐదో వారం అస్త్రాలను తీసుకుని అందరినీ సమానం చేశారు. అదే సమయంలో వీళ్లకు ఈ సీజన్‌లో మొదటి కెప్టెన్సీ టాస్కును కూడా పెట్టారు.
సీజన్ 2.O.. ఆరోజున: బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారిగా ఏడో సీజన్‌లో ఐదు వారాల తర్వాత అంటే అక్టోబర్ 8న ఈ సీజన్ 2.O ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని స్టార్ మా కన్ఫార్మ్ చేసేసింది. ఆరోజున హౌస్‌లోకి మరో ఆరుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందులో అర్జున్, కెవ్వు కార్తీక్, సింగర్ భోలే, పూజ, అంజలిల పేర్లు ఇప్పటికే బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
బిగ్ బాస్‌కు అంజలి షాక్: బిగ్ బాస్ ఏడో సీజన్ 2.Oకు చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్లను ఫైనల్ చేయడంతో పాటు నేటి నుంచి వాళ్ల ఎంట్రీలను షూట్ చేయబోతున్నారు. అలాగే, శనివారమే వీళ్లను హౌస్‌లోకి పంపి.. దాన్ని ఆదవారం ఎపిసోడ్‌లో చూపించేందుకు ప్లాన్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఒక్కరోజు ముందే ఈ సీజన్ నుంచి అంజలి పవన్ తప్పుకుందని తాజాగా తెలిసింది.

ఆమె స్థానంలో ఎవరంటే: బిగ్ బాస్ ఏడో సీజన్ 2.O కోసం సెలెక్ట్ అయిన అంజలి పవన్ అనివార్య కారణాలతో తప్పుకుందని అంటున్నారు. దీంతో ఆమె స్థానంలో మరో నటి అశ్విని సిరిని తీసుకున్నారని మరో న్యూస్ లీకైంది. అయితే, ఈమె బ్యాగ్రౌండ్ ఏంటి అనేది మాత్రం కన్ఫార్మ్‌గా తెలియడం లేదు. ఫలితంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోయే ఆరో కంటెస్టెంట్ ఎవరు అన్నది సస్పెన్స్‌గా మారింది.


Click it and Unblock the Notifications











