twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్లు పక్కలోకి రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు: సీరియల్ నటి సంచలనం

    |

    గుండమ్మకథ, పుసుపు కుంకుమ, శ్రావణ సమీరాలు లాంటి సీరియల్స్ చేసిన టీవీ నటి చరిష్మా... తాజాగా ఓ వెబ్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. అవకాశాలు ఇవ్వాలంటే నిర్మాతలు, దర్శకులు కమిట్మెంట్ అడగటం నిజమే అని, తెలుగు సీరియల్ రంగంలో తెలుగు వారు కమిట్మెంట్ ఇవ్వడం లేదనే బెంగుళూరు వారికి అవకాశాలు ఇస్తున్నారని తెలిపారు.

    మెహర్ అనే రైటర్ ద్వారా నేను ఇండస్ట్రీకి వచ్చాను. వారి ద్వారా ఒక సీరియల్‌లో అవకాశం లభించింది. కమిట్మెంట్‌ను నమ్ముకోకుండా నా సొంత టాలెంటుతో ఈ స్థాయికి ఎదిగాను అని చరిష్మా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బెంగుళూరు నటీమణులపై చరిష్మా షాకింగ్ కామెంట్స్ చేశారు.

    తెలుగు వారికి అవకాశాలు ఇవ్వడం లేదు

    తెలుగు వారికి అవకాశాలు ఇవ్వడం లేదు

    ఈ మధ్య కాలంలో తెలుగు సీరియల్స్‌లో కూడా బెంగుళూరు వారిని ఎక్కువగా తీసుకుంటున్నారు. తెలుగు వారిని తక్కువగా తీసుకుంటున్నారు. ఆ విషయంలో చాలా బాధ ఉంది. తెలుగు వారికి క్యారెక్టర్లు ఇస్తున్నారు కానీ మెయిన్ లీడ్ ఇవ్వడం లేదు. అక్క, చెల్లి, ఫ్రెండ్ పాత్రలు మాత్రమే ఇస్తున్నారు. ఒకటి రెండు సీరియల్స్‌లో మాత్రమే తెలుగు వారు చేస్తున్నారు. అందరూ బెంగుళూరు వారే ఉన్నారని చరిష్మా తెలిపారు.

    వాళ్లు పక్కలోకి రమ్మంటే వస్తారు...

    వాళ్లు పక్కలోకి రమ్మంటే వస్తారు...

    బెంగుళూరు వారిని తీసుకోవడానికి కారణం వారు పక్కలోకి రమ్మంటే వస్తారు... పొమ్మంటే పోతారు. తెలుగు అమ్మాయిలు ఇలాంటివి చేయడానికి ఆలోచిస్తారు. బెంగుళూరి వారి ఫ్యామిలీస్ అక్కడ ఉంటాయి కాబట్టి వారు పెద్దగా ఆలోచించరు. కమిట్మెంట్ ఇచ్చేస్తారు... అని చరిష్మా చెప్పుకొచ్చారు. బెంగుళూరు వాళ్లు ఇలా చేస్తారని చాలా మంది అనుకుంటుండగా విన్నాను.. కానీ నా కళ్లతో చూడలేదని ఆమె స్పష్టం చేశారు.

    తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారనే...

    తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారనే...

    తెలుగు వారు ఇలాంటి కమిట్మెంట్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. అలా చేస్తే మన ద్వారా కాకపోయినా పక్కవారి ద్వారా తెలిసినా మన తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? నా కూతురు ఇలా చేసిందా? నా కూతురు ఇలా అయితేనే వెళుతుందా? అని బాధపడతారు, అందుకే తెలుగు వారు కమిట్మెంట్లకు దూరంగా ఉంటారని చరిష్మ తెలిపారు.

    సినీ ఇండస్ట్రీలో నాకూ ఇలాంటివి ఎదురయ్యాయి

    సినీ ఇండస్ట్రీలో నాకూ ఇలాంటివి ఎదురయ్యాయి

    తాను సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఫేస్ చేశాను. సీరియల్ ఇండస్ట్రీలో ఎవరి నుంచి అలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. సినిమా ఇండస్ట్రీలో కోఆర్డినేటర్లు, మేనేజర్ల కమిట్మెంట్స్ అడిగేవారు. ఇచ్చిన వారినే పెట్టుకోండి అని నేను ఆ అవకాశాలను వదులుకునేదాన్ని అని చరిష్మా తేల్చి చెప్పారు.

    ఇలాంటివి చేసేవి వారే...

    ఇలాంటివి చేసేవి వారే...

    ఇలాంటి కమిట్మెంట్స్ చిన్న సినిమాల విషయంలో ఎక్కువగా ఎదురయ్యేవి. కొత్తగా ఇండస్ట్రీకి ఏదో సాధిద్దామని వచ్చేస్తారు. కానీ వారు సాధించేది ఏమీ ఉండదు కమిట్మెంట్స్ తప్ప. అందుకే వారు అక్కడే ఉండిపోతారన ఆమె వ్యాఖ్యానించారు.

    English summary
    Serial Actress Charishma Sensational Comments on Commitments in Serial industry. "Telugu girls don't get offers from tv serial makers, Because they do not agree to do bad things." She said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X