టీవీ నటి అదృశ్యం... ప్రేమ వ్యవహారమే కారణమా?
టీవీ నటి అదృశ్యమైన ఘటన హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. పలు తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్న అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతానికి చెందిన లలిత అనే నటి అమీర్‌పేట ప్రాంతంలో లేడీస్ హాస్టల్‌లో ఉంటూ తన కెరీర్ కొనసాగిస్తోంది.
జూన్ 11 నుంచి లలిత ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చి హాస్టల్‌లో ఆరా తీయగా ఆమె కొన్ని రోజులుగా హాస్టల్‌కు కూడా రావడం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులను పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హాస్టల్‌లో ఆమెతో పాటు ఉంటున్న వారిని ఆరా తీయగా.... ఒక వ్యక్తి వచ్చిన ఆమెను తీసుకెళ్లాడని, అయితే అతడు ఎవరో తమకు తెలియదని వారు తెలిపినట్లు సమాచారం. బన్నీ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చన ఫిర్యాదులో పేర్కొన్నారు.
లలిత అదృశ్యం వెనక ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదే మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కాల్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











