Mahi Shivan: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి మహేశ్వరి.. ఎవరు పుట్టారో తెలుసా?
ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు పిల్లల్ని కంటూ.. తెగ సంబురపడిపోతున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ప్రతీ విషయాన్ని వీడియో తీసి నెట్టింట పెడుతూ అన్ని అప్ డేట్లు ఇస్తున్నారు. అలాంటి వాళ్లలో ఒకరే సీరయల్ నటి మహేశ్వరి. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ రెండోసారి తల్లి అయింది. అయితే మొదటి సారి పాప పుట్టగా.. ఇప్పుడు ఎవరు పుట్టారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సీరియల్ నటి మహేశ్వరి, శివనాగ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేశ్వరి నటిస్తుండగా.. శివనాగ్ కూడా సినీ రంగానికి చెందిన కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఓవైపు సీరియల్స్ లో నటిస్తూనే.. ఆమె యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా టీవీలోనే అనేక షోలలో భర్తతో కలిసి కనిపిస్తూ తెగ సందడి చేస్తుంటుంది. కేవలం భర్తే కాదు.. తన కూతురుతో కూడా కనిపిస్తూ రచ్చ చేస్తుంటుంది. అయితే వీరిద్దరూ ప్రేమించుకోగా.. మహేశ్వరి తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు.

అయినప్పటికీ.. ఈ జంటకు శివనాగ్ తల్లిదండ్రులే పెళ్లి చేశారు. అత్త, మామలే తల్లిదండ్రులుగా మారి మహేశ్వరిని చాలా చక్కగా చూసుకుంటున్నారు. ఆమె కూడా అనేక వీడియోల్లో తన అత్తయ్య, మామయ్యలను.. వాళ్లు తనకోసం చేసే ప్రతీ చిన్న పనిని చూపించడంతో ఈ విషయాలన్నీ అందరికీ తెలిసాయి. అయితే చాలా ఏళ్ల క్రితమే వీరికి ఓ పాప పుట్టింది. రెండోసారి కూడా ఆమె తల్లి అయి ఇంకొకరు పుట్టాలని ఆమె అత్తగారు చాలా కాలంగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా మనవడు పుడితే చూడాలని ఉందంటూ చాలా సార్లే చెప్పుకొచ్చింది. ఈక్రమంలోనే మహేశ్వరి రెండోసారి గర్భం దాల్చింది.
ఈ విషయాన్ని అటు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా, ఇటు యూట్యూబ్ వీడియోల ద్వారా వెల్లడించింది. అప్పటి నుంచి ఆమె ఫుడ్, హాస్పిటల్ చెకప్స్ గురించి ఎప్పటికప్పుడు చెబుతూ.. వస్తోంది. ముఖ్యంగా వాటినే వీడియోలుగా మలుస్తూ... అన్ని అప్ డేట్లు ఇఛ్చింది. ఇటీవలే రెండు సార్లు చాలా గ్రాండ్ గా సీమంతం చేసుకుందీ క్యూట్ బ్యూటీ. అయితే తాజాగా ఈ పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చినట్లు ఆమె భర్త శివనాగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
అయితే నేరుగా అబ్బాయి పుట్టాడని చెప్పలేదు కానీ.. తన భార్య, కూతురుతో పాటు న్యూ బార్న్ బేబీ హ్యాండ వీడియోను పోస్ట్ చేశాడు. ఈక్రమంలోనే మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ మగ, ఆడ పిల్లలతో పాటు భార్యాభర్తలు కలిసి ఉన్న ఎమోజీని యాడ్ చేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే వారంతా కోరుకున్నట్లుగా వారికి బాబే పుట్టాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విషయం తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ వారికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











