ఆ 20 నిమిషాలు.. నా భార్య రోడ్డు ప్రమాదంపై పవిత్రా జయరాం భర్త సంచలన వివరణ

కన్నడ నటి, త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అందం, అభినయంతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కర్ణాటకకు చెందిన పవిత్రా జయరాం హైదరాబాద్‌లో వుంటూ పలు తెలుగు సీరియల్స్‌లో నటిస్తోంది.

ఇటీవల ఆమె తన స్వగ్రామానికి వెళ్లింది. మే 12వ తేదీ తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా.. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) గ్రామం వద్ద పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఇంతలో కుడివైపు నుంచి వనపర్తి వస్తున్న వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో పవిత్ర జయరాం ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

serial actress pavithra jayaram s Husband chandrakanth Revealed Truths on road accident

అయితే రోడ్డు ప్రమాదం, పవిత్ర మరణం తదితర విషయాలపై సంచలన విషయాలు చెప్పారు ఆమె భర్త చంద్రకాంత్. ఆమె మృతికి రోడ్డు ప్రమాదం కాదని.. పవిత్ర చావుకు అసలు కారణాలు బయటపెట్టారు ఆయన. బెంగళూరులో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. దీంతో 3 గంటలు ఆలస్యంగా బయల్దేరామని చంద్రకాంత్ చెప్పారు.

మహబూబ్‌నగర్ చేరుకునేసరికి సోమవారం అర్ధరాత్రి అయ్యిందని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కారులో తాను, పవిత్ర, ఆమె కూతురు, మరో అమ్మాయి ఉన్నట్లుగా చంద్రకాంత్ తెలిపారు. డ్రైవర్ ఉండటంతో తాను పడుకున్నానని.. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఓ ఆర్టీసీ బస్సు ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేసిందన్నారు.

ఈ క్రమంలో డ్రైవర్ కారును కుడివైపుకు తిప్పడంతో అది డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో కారు ముందు వైపు అద్దం పగిలిందని, తనకు తప్ప ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని చంద్రకాంత్ చెప్పారు. తనను ఈచూసి పవిత్ర షాక్‌కు గురికావడంతో వెంటనే స్ట్రోక్ వచ్చిందని , గాయాల కారణంగా తాను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని .. ఆసుపత్రికి వచ్చేసరికి ఒంటిగంట అయ్యిందని ఆయన వెల్లడించారు. తెల్లవారుజామున 4 గంటలకు తాను స్పృహలోకి వచ్చానని అప్పుడే పవిత్ర చనిపోయిన విషయం తెలిసిందని చంద్రకాంత్ కన్నీటిపర్యంతమయ్యారు.

పవిత్రకు హార్ట్ ఎటాక్ రాగానే అంబులెన్స్‌కు ఫోన్ చేశానని.. కానీ అంబులెన్స్ దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని.. ఒకవేళ అది టైమ్‌కి వచ్చుంటే తన భార్యను కాపాడుకునేవాడినని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఎలాంటి గాయాలు కానప్పటికీ.. కేవలం గుండెపోటుతో మరణించడం బాధాకరమని, పవిత్ర మృతిని తట్టుకోలేకపోతున్నానని చంద్రకాంత్ ఎమోషనల్ అయ్యారు.

ఈ క్రమంలోనే భార్యతో దిగిన చివరి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన.. ''పాప నీతో దిగిన ఆఖరి పిక్ రా.. నువ్వు నన్ను ఒంటరివాడిని చేశానన్న నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఓసారి మామ అని పిలువు ప్లీజ్ .. నా పవిత్ర ఇక లేదు. ప్లీజ్ మళ్లీ రావా అంటూ '' చంద్రకాంత్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X