పైనుంచి కిందవరకు అలా చూసి.. వస్తావా అని అడిగారు: టెలివిజన్ నటి సంచలన వ్యాఖ్యలు
ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. గత రెండేళ్ల నుంచి బయటపడుతున్న కొంత మంది యాక్టర్స్ లీక్స్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మీటూ ఉద్యమం ఎక్కడికి వెళుతుందో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ వివాదాలు ఎక్కువ రోజులు కొనసాగలేదు. అంతా ముగిసింది అనుకున్న సమయంలో మరోసారి కొంత మంది తారలు మరోసారి ఆ మీటూ ఉద్యమాన్ని గుర్తు చేస్తున్నారు.

మార్పు రాలేదా?
మీటూ ఉద్యమానికి టాప్ లో ఉన్న హీరోయిన్స్ కంటే కూడా చిన్న తరహా నటీమణులే ఎక్కువగా సపోర్ట్ చేశారు. సినీ ప్రముఖుల సీక్రెట్స్ బయటపెడుతూ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. అయితే ఎంతమంది ఉద్యమంలో ఉన్నా కూడా మార్పు రాలేదని అనిపిస్తోంది. ఈ మీటూ ఉద్యమానికి పెద్దగా న్యాయం జరిగింది లేదు. మళ్ళీ అదే తరహాలో కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు వారి మాటలకు విలువ లేకుండా పోతోంది.

సీరియల్ యాక్టర్స్..
వెండితెరపై నటించే వారికే కాకుండా బుల్లితెరపై నటించే వారికి కూడా ఈ లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇక తెలుగులో నటించే సీరియల్ ఆర్టిస్ట్ లు కూడా ఈ మధ్య ఎవరు ఊహించని విధంగా వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి భయటపెడుతున్నారు. రీసెంట్ గా సీనియర్ తెలుగు నటి రాగిణీ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెట్టింది.

కొన్ని అవకాశాలు వధులుకోవాల్సి వచ్చింది ..
ఓ యూ ట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాగిణీ తన పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు ఎదురైన చేదు అనుభవాల గురించి వివరణ ఇచ్చింది. తన తల్లిదండ్రులకు తాను 13వ సంతానమని చెబుతూ.. నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ఇండస్ట్రీలో అడుగు పెట్టినట్లు వివరణ ఇచ్చారు. అలాగే కొన్ని వ్యక్తిగత కారణాలు కొన్ని సినిమా అవకాశాలను వధులుకోవాల్సి వచ్చిందని అన్నారు..
Recommended Video

తెలిసినవాళ్లే..
ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ లైంగిక వేధింపులపై స్పంధించిన రాగిణీ తనకు ఎదురైన పలు చేదు అనుభవాల గురించి బయటపెట్టారు. 'సినిమా రంగంలో తెలిసిన వాళ్లనే బాగున్నవా అడిగితే.. పై నుంచి కిందవరకు చూసి.. వస్తావా అని అడుగుతుంటారు. అప్పుడు చాలా బాధగా ఉంటుంది' అని మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడినట్లు రాగిణీ తెలియజేశారు.


Click it and Unblock the Notifications











