అక్కడ చేయి వేస్తే ఎంజాయ్ చేస్తా.. బస్సుల్లో కూడా అంతే.. సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్

చిత్ర పరిశ్రమ అన్నాక గ్లామర్ తో పాటు కాంట్రవర్సీ కూడా ఉంటుంది. కొందరు ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ పై మాట్లాడుతూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంటారు. సామాజిక అంశాలు, వుమెన్ ఎంపవర్ మెంట్ విషయాలపై కొన్నిసార్లు ప్రశంసలు వస్తే.. మరికొన్ని సార్లు విమర్శలు వస్తాయి. ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువగా వేధింపులకు గురైనట్లు వింటూనే ఉంటున్నాం. వాటి నుంచి దూరంగా ఎలా ఉండాలో హీరోయిన్స్ కొందరు చెబుతుంటే.. ఓ బుల్లితెర నటి మాత్రం వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.

బిగ్ బాస్ ద్వారా: ఎన్నో అనుమానాలు, అంచనాలతో ప్రారంభమైన రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి భారతదేశంలోకి బిగ్ బాస్ గా వచ్చిన విషయం తెలిసిందే. మొదటగా హిందీలో ప్రారంభమైన ఈ షో తర్వాత వివిధ భాషల్లోకి వచ్చేసింది. తెలుగులో బిగ్ బాస్ కు ఎంతటి ఆదరణ ఉందో తమిళంలో కూడా అదే స్థాయిలో మనన్నలు పొందింది. అలాంటి తమిళ బిగ్ బాస్ ద్వారా ఆకట్టుకున్న వారిలో రేఖ నాయర్ ఒకరు.

Serial Actress Rekha Nair Shocking Comments On Women Dress Code

సీరియళ్లతో: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని సీరియళ్ల ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ రేఖ నాయర్. బ్యూటిఫుల్ రేఖ నాయర్ తమిళంలోని బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అంతకుముందు పలు సీరియళ్ల ద్వారా తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.

Serial Actress Rekha Nair Shocking Comments On Women Dress Code

డ్రెస్ కోడ్: తమిళంలో వంశం, పగల్ నిలవు, ఆండాళ్ అజగర్, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, బాల గణపతి వంటి సీరియళ్ల నటించింది అందాల భామ రేఖ నాయర్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేఖ నాయర్ మహిళల డ్రెస్ కోడ్ పట్ల కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ గింగిరాలు తిరుగుతున్నాయి.

Serial Actress Rekha Nair Shocking Comments On Women Dress Code

ఎంజాయ్ చేయాలి: ఇటీవల మహిళలు చాలా సెక్సీ డ్రెస్సులు ధరిస్తున్నారు. అందువల్లే అబ్బాయిలు అలా ప్రవర్తిస్తున్నారంటారా? ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటీ? అని రేఖ నాయర్ ను యాంకర్ అడిగింది. దీనికి రేఖ నాయర్ సమాధానమిస్తూ.. "అమ్మాయిల నడుము మీద అబ్బాయిలు చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి. అంతే కానీ, ఏదో జరిగిపోయిందంటూ నానా హంగామా చేయొద్దు" అని తెలిపింది.

నేను ఆనందిస్తా: రేఖ నాయర్ ఇంకా కొనసాగిస్తూ "డ్రెస్ కోడ్ విషయంలో అమ్మాయిలు తమ వ్యక్తిగత స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాకుండా నేను వేసుకునే డ్రెస్ గురించి చాలా మంది అమ్మాయిలు అడుగుతుంటారు. కానీ ఎవరైనా వ్యక్తి నా నడుముపై చేయి వేస్తే నేను కొప్పడను. ఆనందిస్తా. నేను చీర కట్టుకుంటే నా నడుము కనిపిస్తుంది. బస్సుల్లో వెళ్లినా ఎవరైనా చేయి వేస్తే నాకు ఎలాంటి ఫీలింగ్ రాదు" అని చెప్పుకొచ్చింది.

Serial Actress Rekha Nair Shocking Comments On Women Dress Code

అబ్బాయిలు మాత్రమే: "ఈ రోజుల్లో మహిళలు ఇలాంటి మనసత్వాలను దూరం చేసుకోవాలి. నేను జాగింగ్ చేసినా, ఏదైనా పోటీలో పాల్గొన్నా నడుము కనిపంచే డ్రెస్సులే వేసుకుంటా. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా అమ్మాయిల డ్రెస్సులను మెచ్చుకునేది కేవలం అబ్బాయిలు మాత్రమే" అని షాకింగ్ గా ఆన్సర్ ఇచ్చింది తమిళ బ్యూటి రేఖ నాయర్. ఈ వ్యాఖ్యలను కొందరు సమర్దిస్తుంటే.. మరికొందరు ఫైర్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X