ఆస్తి కోసం సీరియల్ నటికి చిత్రహింసలు... మ్యాగీ ఫోర్క్‌ని కాల్చి

తెలుగు బుల్లితెరపై పలువురు నటీనటులు తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. సీరియల్స్‌లో ఎన్నో కష్టాలు పడే నటీనటులు నిజ జీవితంలో హ్యాపీగా ఉంటారు అనడానికి లేదు. ఎవరో కొందరు తప్పించి చాలామంది జీవితం నల్లేరు మీద నడక కాదు. పలువురు నటీనటులు తమకు ఎదురైన ఇబ్బందులను పలు ఇంటర్వ్యూలలో వెల్లడించి కన్నీరుమున్నీరైన వారే. తాజాగా బుల్లితెర నటి శ్రీవాణి.. జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిస్సిక్ టాక్ షోకు హాజరై తన జీవితంలో ఎదురైన పరిస్ధితులను వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే...

సినీరంగం నుంచి బుల్లితెరకు
హైదరాబాద్‌కు చెందిన శ్రీవాణి తొలుత కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వైభవ్ హీరోగా వచ్చిన గొడవ అనే సినిమాలో చిన్న పాత్రలో నటించారు. తర్వాత ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన సినీరంజనీ కార్యక్రమానికి యాంకర్‌‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దశలో శ్రీవాణికి సీరియల్స్‌‌లో అవకాశాలు దక్కాయి. సంఘర్షణ, కాంచన గంగ, చంద్రముఖి ధారావాహికల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. వీటితో పాటు మావిచిగురు, కలవారి కోడళ్లు, ఘర్షణ ది డ్యాన్స్ బాటిల్, ఎగిరే పావురమా, అథీరా, రాములమ్మ, తిరు మాంగళ్యం అనే సీరియల్స్‌లో నటించారు.

Serial Actress Sreevani opens up disputes with her sister in law in a podcast hosted by Jabardasth Varsha

17 ఏళ్ల వయసులోనే ప్రేమ
అయితే 17 ఏళ్ల వయసులోనే నటుడు, కొరియోగ్రాఫర్, ఈవెంట్ మేనేజర్ విక్రమాదిత్యతో ప్రేమలో పడిన శ్రీవాణి ఆయనను పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లోంచి పారిపోయారు. అమలాపురం దగ్గర ఓ ఊరిలో తలదాచుకోగా.. పెళ్లి చేసుకోవాలంటే 18 సంవత్సరాలు నిండాలని చెప్పడంతో మైనారిటీ తీరే వరకు వెయిట్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే తన తండ్రికి చెందిన వారసత్వ ఆస్తుల విషయంలో సొంత వదినతో శ్రీవాణి గొడవ పెట్టుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. తాజాగా కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు శ్రీవాణి.

ఇద్దరం సంపాదిస్తేనే ఇల్లు గడిచేది
విక్రమాదిత్య నా హజ్బెండ్‌గా రావడమే నాకు గిఫ్ట్‌. మా ఆయన డబ్బులు నా అకౌంట్‌లోనే ఉంటాయి, నా డబ్బులు నా అకౌంట్‌లోనే, మా బాబు డబ్బులు నా అకౌంట్‌కే. నాకు చాలా ఆస్తులు ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి దీని గురించి కూడా క్లారిటీ ఇస్తాను. నేను క్వార్టర్స్‌లో పుట్టి పెరిగాను, నేను మా ఆయన సంపాదిస్తేనే మా ఇల్లు గడుస్తుంది. మేం అలాంటి పరిస్ధితుల్లోనే ఉన్నాం. ఎప్పుడైతే యూట్యూబ్ పెట్టామో నెలకు ఎక్స్‌ట్రా ఇన్‌కం. చాలామంది జాబ్ చేసేవాళ్లకు బోనస్‌లు వస్తాయి కదా.. అలా యూట్యూబ్ వచ్చింది. దీని ద్వారా తొలుత నెలకు 10 వేల రూపాయలు వచ్చింది.. ఆ తర్వాత నెలకే 30 లక్షల రూపాయలు అందుకున్నామని శ్రీవాణి తెలిపారు.

మీడియా అంటే అసహ్యం
మా మావయ్య గారికి ఓ రెండు ఎకరాల ల్యాండ్ ఉంది. అందులో మాకు 300 గజాలు మాత్రం ఉంది. మా వదినతో ఆస్తి గొడవ ఇంకా రన్ అవుతోంది. నా వర్క్ నేను చేసుకుంటే.. సొంత వదిన కొట్టింది, మ్యాగీ స్పూన్‌తో కాల్చింది. ఆ గొడవ నుంచే నాకు న్యూస్ ఛానెల్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నిజంగా నేనేమైనా హింసించి ఉంటే చెప్పండి? నిజంగా మీ దగ్గర సాక్ష్యం ఉంటే చెప్పండి.. మా నాన్నకి ఇద్దరు భార్యలు. ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లే. ఆవిడకు ఇష్టం లేకుండానే మా అమ్మని ఇచ్చి పెళ్లి చేశారు. దానికి తగినట్లే మా నాన్న ఇంట్లో ఉండేవాడు కాదు.. అయ్యప్పమాల వేసుకునేటప్పుడు ఇంటికొచ్చేవాడు, అయ్యప్పమాల తీసి వెళ్లిపోయేవాడు. నన్ను స్కూల్‌కి తీసుకెళ్లడం, స్కూల్‌లో సిగ్నేచర్ కానీ లేవు.. ఇప్పటికీ నా బర్త్ సర్టిఫికెట్‌లో మా నాన్న సిగ్నేచర్ ఉండదు. ఎందుకు.. ఆడపిల్లను పుట్టానని మా నాన్నగారు సంతకం కూడా చేయకుండా వెళ్లిపోయారు. మా అక్క దాంట్లో ఉంటుంది, నా దానిలో ఉండదు అని శ్రీవాణి అన్నారు. మరి శ్రీవాణికి ఆమె వదినకు ఎందుకు గొడవ జరిగింది? సమాజంలో బతకడానికి శ్రీవాణి ఎన్ని కష్టాలు పడ్డారు? ఈ వివరాలు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: jabardasth varsha Sreevani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X