Bigg Boss Telugu 7 మహానటి ప్రియాంక .. అమర్, శోభాతో కలిసి ఫెర్ఫార్మెన్స్‌ మామూలుగా లేదుగా..!

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఇక నాలుగో వారంలోకి అడుగుపెట్టిన ఈ షో... నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీలు మొదలయ్యాయి. ఇక ఈ పోటీల్లో కంటెండర్స్ అయిన పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ పాల్గొన్నారు. అయితే ప్రశాంత్ గెలవకుండా ఉండేందుకు సీరియల్ బ్యాచ్ తో రతిక కలిసి చిల్లర చేష్టలు చేసింది. అయితే అనుహ్యాంగా పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్రను గెలుచుకున్నారు. ఇక ప్రశాంత్ పవర్ అస్త్ర గెలుచుకున్న అనంతరం సీరియల్ బ్యాచ్ రియాక్షన్ వీడియోలో నెట్టింట వైరల్ గా మారాయి. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. హౌజ్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా... ముగ్గురు (కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ) ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలింది 11 మంది. అందులో ఇప్పటికే పవర్ అస్త్రను గెలుచుకుని ఆట సందీప్, హీరో శివాజీ, కార్తిక దీపం ఫేం మోనిత హౌజ్ మేట్స్ గా స్థిరపడ్డారు. ఇక నాలుగో పవర్ అస్త్ర కోసం... ఈ వారం పోటీలు నిర్వహించారు.

erial Batch Amardeep, Priyanka, Shobha Shetty

ఈ వారం కంటెండర్స్ గా ఎంపిక అయిన శుభ శ్రీ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్... పవర్ అస్త్ర కోసం పోటీ పడ్డారు. బిగ్ బాస్ వారికి టాస్కులు ఇవ్వగా... పోటీల్లో కంటెండర్స్‌ ఓడిపోయేలా... చేయడానికి మిగిలిన కంటెస్టెంట్స్ డిస్ట్రబ్ చేసుకోవచ్చని బిగ్ బాస్ ఓ అవకాశం ఇచ్చారు. ఇక ఇదే దొరికింది ఛాన్స్ అనుకుని.. రతిక.. ప్రశాంత్ పై రెచ్చిపోయింది. సీరియల్ బ్యాచ్ అమర్ తో కలిసి రతిక చిల్లర చేష్టలు చేసింది. ప్రశాంత్ ఓడిపోయేందుకు పాతవి అన్ని తవ్వి... ఓవర్ యాక్షన్ చేసింది.

మొదట కంటెండర్స్ కు పట్టు వదలకు డింభకా అనే ఛాలెంజ్ ఇవ్వగా... ముగ్గురు పాల్గొన్నారు. ఇక రతిక మాత్రం ప్రశాంత్ ను హేళన చేస్తూ.. రెచ్చగొట్టేలా మాట్లాడింది. కానీ ప్రశాంత్ ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా తన గేమ్ లో పాల్గొన్నాడు. అమర్ దీప్ కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. నిన్ను అక్క అని ఎందుకు అన్నాడు అంటూ ప్రశాంత్ పై అమర్ దీప్ వెకిలిగా మాట్లాడుతూ రెచ్చగొట్టాడు. దానికి రతిక కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ... అపరిచితుడు తనకు ఏ రిలేషన్ గుర్తుంటుందో తెలియదు అంటూ కామెంట్స్ చేసింది.

 Pallavi Prashanth

ఎట్టకేలకు బిగ్ బాస్ పెట్టిన పోటీల్లో పవర్ అస్త్రను గెలుచుకుని విజయం సాధించాడు. ఇక అప్పుడు రతిక ఎక్స్ ప్రెషన్ చూస్తే... ఎవరికైనా నవ్వు రావాల్సిందే. మూతి తిప్పుకుని కూర్చొంది. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట వైరల్ గా మారింది. మరోవైపు అప్పటి వరకు సీరియల్ బ్యాచ్ అంతా... ప్రశాంత్ పై పగబట్టినట్లు సూటిపోటి మాటలు అన్నారు. గెలవగానే... అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి వెళ్లి ప్రశాంత్ కు కంగ్రాట్స్ చెప్పారు.

Bigg Boss Telugu7

ఇక ప్రియాంక అయితే మహానటిని మించిపోయింది. ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ... ప్రశాంత్ దగ్గరకు వెళ్లి విష్ చేసింది. ఇక అమర్ సైతం... ప్రశాంత్ ను హగ్ చేసుకుని కంగ్రాట్స్ చెప్పాడు. ఇక శోభా శెట్టి అయితే టైట్ హాగ్ ఇచ్చి ప్రశాంత్ ను మెచ్చుకుంది. రతిక మాత్రం దూరంగా మూతి ముడుచుకుని కూర్చొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టంట వైరల్ అవుతుండగా... సీరియల్ బ్యాచ్, రతిక ట్రోలింగ్ కు గురవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X