Bigg Boss Telugu 7 : ఈ వారం షోలోకి మరో ఇద్దరు.. ఆ హీరోతో పాటు నటి కూతురి ఎంట్రీ... హౌస్‌లో ఫుల్ మసాలా
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం అయి రెండు వారాలు అవుతోంది. ఇక ఉల్టా పుల్తా అంటూ బిగ్ బాస్ షోను స్టార్ట్ చేసిన నాగార్జున అక్కినేని అందుకు తగ్గట్లుగానే షోను ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. ఇక ఈ షోలో 14 మంది ఎంటర్ అవ్వగా.. ఒకరు గతవారం ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం షోలోకి మరో ఇద్దరు ఎంట్రీ ఇవ్వనున్నారట. ఓ సీరియల్ హీరోతో పాటు... ప్రముఖ నటి కూతురు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే...
తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్స్, ఒక ఓటీటీ వర్షన్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో... ఇప్పుడు ఏడో సీజన్ లోకి అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ముఖ్యంగా ఇందులో గతంలో ఎన్నడూ చూడని ట్విస్టులు.. టాస్కులు పెడుతూ... ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ ఏడో సీజన్ సెప్టెంబర్ 3న గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఇందులోకి 14మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు.

ఏడో సీజన్ లోకి సీరియల్ నటి ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభ శ్రీ, సీనియర్ నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ నటి శోభా శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమరదీప్‌లు ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిలో కిరణ్ రాథోడ్ గతవారం ఎలిమినేట్ అయ్యారు.
ఇక బిగ్ బాస్ షోలోకి మొదట 20 నుంచి 22 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తారని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని రేంజులో 14మంది మాత్రమే ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం 13మంది మాత్రమే బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నారు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని అంటున్నారు. అందులో ఒకరిని ఎలిమినేట్ చేసినట్లు చెప్పి... సీక్రెట్ హోంలోకి పంపనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక ఆ విషయం పక్కన పెడితే... ఈ వారం హౌజ్ లోకి మరో ఇద్దరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. యువ సీరియల్ హీరో అంబటి అర్జున్ అని తెలిసింది. తెలుగు బుల్లితెరపై దేవత సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు... బిగ్ బాస్ 7వ సీజన్ కంటెస్టెంట్ గా ఎంపికయ్యాడని సమాచారం.

ఇక అంబటి అర్జున్ తో పాటు... ప్రముఖ నటి సురేఖా వాణి కూతురు సుప్రిత కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న సుప్రిత... ఇప్పుడు హౌజ్ లోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. ఆమె అందాల ఆరబోత మామూలుగా ఉండదు. అలాంటిది ఆమె హోజ్ లోకి అడుగుపెడితే.. ఎన్ని లవ్ ట్రాకులు మొదలుకానున్నాయో... ఎలా నడవనుందో చూడాలి. ఈ వార్తలు నిజమవుతాయా? గాసిప్‌గానే మిగిలిపోతాయా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











