Bigg Boss Telugu 7: మరోసారి టైటిల్ ఫేవరెట్‌కు నాగార్జున హింట్.. రియలైజ్ అయి స్ట్రాటెజీ మార్చిన సీరియల్ హీరో!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతోంది. ఈ షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు గానీ అద్భుతంగా సాగుతూ అందరినీ తెగ అలరిస్తోంది. ఇప్పటికే 12 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో నేటితో 13వ వారంలోకి అడుగు పెట్టింది. ముఖ్యంగా ఈరోజు నామినేషన్లలో అందరూ చెలరేగిపోయారు. ఈరోజు బిగ్ బాస్ టీం నిర్వాహకులు విడుదల చేసిన ప్రోమో చూస్తుంటేనే ఆ విషయం అర్థం అయిపోతుంది. ముఖ్యంగా ఆదివారం రోజు ఎపిసోడ్ లో నాగార్జున ఇచ్చిన హింట్ తో అంబటి అర్జున్ తన గేమ్ స్ట్రాటెజీ మార్చుకున్నాడు. ఎలాగైనా సరే టాప్ 5లో నిలవాలని తెగ ట్రై చేస్తున్నాడు.
ముఖ్యంగా ఈ వారం నాగార్జున ఇంట్లోని వాళ్లు ఎవరెవరు ఏయే గ్రూపుల్లో ఉన్నారనేది చెప్పారు. ముఖ్యంగా స్పై, స్పా, చుక్క, మొక్క బ్యాచ్ ల గురించి ప్రత్యేకంగా వివరించారు. అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్ లు స్పా అని.. శివాజి, పల్లవి ప్రశాంత్, యావర్ లు స్పై బ్యాచ్ అని అన్నారు. ఈక్రమంలోనే అంబటి అర్జున్ ఎక్కడా లేకుండా పోయాడంటూ చెప్పుకొచ్చాడు. కానీ అమర్ దీప్ మాత్రం అర్జున్ అన్న మా గ్రూపే అంటూ నాగార్జునకు వివరించాడు. అది విన్న నాగార్జున... కాదు అంబటి అర్జున్ కూడా స్పైబార్ బ్యాచ్ లోనే ఉండే వాడని చెప్పుకొచ్చాడు.
Recommended Video


స్పైబార్ అంటే.. శివాజి, పల్లవి ప్రశాంత్, యావర్, అంబటి అర్జున్, రతికా రోజ్ లు అని అర్థం. ఆ విషయం చెప్పి ముందు ఉండేది కానీ.. ఇప్పుడు స్పైబార్ లేదని పేర్కొన్నారు. అయితే ఆ విషయాన్ని మైండ్ కు తీసుకున్న అంబటి అర్జున్ నామినేషన్స్ లో దీన్నే పాయింట్ గా వాడుకున్నాడు. ముఖ్యంగా శివాజిని నామినేట్ చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. నాగార్జున సార్ కూడా చెప్పారంటే అంతా అలాగే అనుకుంటూ ఉంటారని.. నేను ఏ బ్యాచ్ కాదని చెప్పడానికి ఇలా చేస్తున్నానంటూ వివరించాడు.
అయితే ఇదంతా విన్న శివాజి మాత్రం చాలా ఫీలయ్యాడు. ఇది సరైన పద్ధతి కాదని చెబుతూనే... నువ్వు నాకు నిజంగా ఫ్రెండ్ వి అనే అనుకున్నానని.. కానీ అదంతా అబద్ధమే అని ఇప్పుడు ప్రూవ్ అయిందంటూ ఎమోషనల్ అయ్యాడు. కేవలం మాటలు చెప్పడమే కాకుండా అంబటి అర్జున్ తనకు తొడిగిన ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ను కూడా తీసేశాడు. నిజంగా స్నేహమే మనిద్దరి మధ్య ఉందనుకుని, నమ్మి ఈ బ్యాండ్ చేతికి ఉంచుకున్నానను కానీ... అది లేదని తెలిసినప్పుడు ఉంచుకోవడం వేస్ట్ అంటూ శివాజి తెలిపాడు.

ప్రతీ వారం నాగార్జున అంబటి అర్జున్ కు... ఆయన ఒక్కడికే కాకుండా... టైటిల్ పేవరెట్లు, ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ వాళ్లకు ఏదో ఒక హింట్ ఇస్తూనే ఉన్నారు. దాన్ని బట్టే వాళ్లు తమ స్ట్రాటెజీలను మారుస్తూ.. గేమ్ ఆడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి ఈ సీజన్ లో టాప్ 5 వరకు ఎవరు వస్తారు.. కప్పు ఎవరు కొడతారనేది తెలియాలంటే మాత్రం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











