Bigg Boss 7 Telugu: షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఆరోజే రాబోతున్న హీరో.. ఇకపై ఆ బ్యాచ్‌కు కష్టాలేనా?
కాన్సెప్టుతో సంబంధం లేకుండా ఎప్పుడు ప్రసారం అయినా.. భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఏడేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో విజయాన్ని అందుకున్న ఈ కార్యక్రమం దేశంలోనే టాప్ షోగా పేరు తెచ్చుకుంది. దీంతో నిర్వహకులు ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు బిగ్ బాస్ ఏడో సీజన్‌ను నడుపుతున్నారు. ఇందులోకి త్వరలోనే ఓ కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసింది. ఎవరు వస్తున్నారో మీరే చూడండి!
ఆరంభం నుంచే ఆసక్తికరంగా:తెలుగులో ఆరు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ ఏడో సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ముఖ్యంగా ఇందులో గతంలో ఎన్నడూ చూడని ట్విస్టులు ఇస్తున్నారు. ఫలితంగా ఇది ఎంతో సందడిగా సాగుతోంది. అదే సమయంలో ఈ సీజన్ రోజురోజుకూ మరింత రంజుగా మారుతోంది.

14 మందిలో ఆమె ఎలిమినేట్:ఏడో సీజన్‌లోకి సీరియల్ నటి ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ నటి శోభా శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమరదీప్‌లు వచ్చారు. వీరిలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది.
20 మంది అనుకున్న తక్కువే:వాస్తవానికి బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి దాదాపు 20 నుంచి 22 మంది వరకూ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తారని ఓ రేంజ్‌లో ప్రచారం జరిగింది. కానీ, ప్రీమియర్ ఎపిసోడ్‌లో కేవలం 14 మందిని మాత్రమే లోపలికి పంపించి అర్థాంతరంగా ముగించేశారు. దీంతో ప్రేక్షకులు అందరూ డైలమాలో పడిపోయారు. కొందరైతే మన అభిమాన సెలెబ్రిటీలు షోలోకి రాలేదని షాక్‌కు కూడా గురయ్యారు.
వాళ్లను కూడా పంపుతారంటూ:ప్రస్తుతం ప్రసారం అవుతోన్న 7వ సీజన్‌లో నిజంగానే 20 మంది వరకూ సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా సెలెక్ట్ అయ్యారట. అయితే, ఇది ఉల్టా పుల్టా సీజన్ కావడంతో మిగిలిన వాళ్లను వారం మధ్యలో లేదా వచ్చే శని, ఆదివారాలు ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లలో పంపించే అవకాశం ఉందని టాక్ వచ్చింది. మొదటి వీకెండ్‌లో మాత్రం షోలోకి ఎవరూ అడుగు పెట్టలేదు.
మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో:బిగ్ బాస్ షో అంటేనే ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఇక, ఉల్టా పుల్టాగా సాగే ఏడో సీజన్‌లో ఇవన్నీ ఇంకాస్త ఎక్కువగా ఉంటాయని ముందు నుంచీ నిర్వహకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఈ సీజన్‌లోకి ఈ వారాంతంలో అంటే శని లేదా ఆదివారం ఎపిసోడ్‌లు ముగిసిన తర్వాత ఓ సెలెబ్రిటీ వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్‌గా రాబోతున్నారట.
వైల్డ్ కార్డ్‌తో వచ్చేది హీరోనే:బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న తాజా సమాచారం ప్రకారం.. ఈ వారాంతంలో హౌస్‌లోకి అడుగు పెట్టబోయే సెలెబ్రిటీ ప్రముఖ సీరియల్ హీరో అంబటి అర్జున్ అని తెలిసింది. తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లలో నటించిన అతడు.. బిగ్ బాస్ 7వ సీజన్ కంటెస్టెంట్‌గా ఎంపికయ్యాడు. కానీ, నిర్వహకులు కొద్ది రోజులు ఆపి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపనున్నారు.
ఆ బ్యాచ్‌కు కష్టాలు మొదలు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో అమర్‌దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్‌లు స్టార్ మా బ్యాచ్ అనే పేరు తెచ్చుకున్నారు. వీళ్లు ముగ్గురూ ఎప్పుడూ కలిసే ఉంటూ కావాలనే ఒకరిని టార్గెట్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బ్యాచ్‌కు చెక్ పెట్టేందుకు అర్జున్‌ను దింపుతున్నారని సమాచారం. అతడి రాకతో షో మరింత రంజుగా మారే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











