కష్టాల్లో అమర్‌దీప్ భార్య తేజు.. బిగ్ బాస్ అవి చూపించట్లేదు.. శివాజిని లాగుతూ హీరో సంచలన వ్యాఖ్యలు
తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ షోగా వెలుగొందుతూ.. వరుస సీజన్లతో సందడి చేస్తోంది బిగ్ బాస్. ఇప్పటికే పలు సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకున్న ఇది.. ఇప్పుడు ఏడో దానితో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న శివాజి తరచూ అమర్‌దీప్ చౌదరిని టార్గెట్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ సీరియల్ హీరో మానస్ నాగులపల్లి కొన్ని విషయాలపై స్పందించాడు. ఈ క్రమంలోనే శివాజిపైన, బిగ్ బాస్ టీమ్‌పైనా విమర్శలు చేశాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

మా ఫ్యామిలీలానే వాళ్లు కూడా: మానస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో అమర్‌దీప్, బయట వాళ్ల ఫ్యామిలీ పడుతున్న ఇబ్బందులను వివరించాడు. 'నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ చూశారో.. ఇప్పుడు అమర్ ఫ్యామిలీ కూడా అలాగే ఇబ్బంది పడుతోంది. దయచేసి కుటుంబ సభ్యులను వదిలేయండి' అని రిక్వెస్ట్ చేశాడు.

ఫైనాన్సియల్‌గానూ తక్కువే: మానస్ కంటిన్యూ చేస్తూ.. 'అమర్ వాళ్ల ఫ్యామిలీ మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, ఫైనాన్సియల్‌గా చాలా ఇబ్బంది పడుతున్నారు. పీఆర్ టీంలు మీ స్ట్రాటజీలు మార్చుకోండి. మీరు కంటెస్టెంట్‌ను టార్గెట్ చేసుకోండి.. వాళ్ల ఫ్యామిలీలను కాదు. అమర్‌ను ఎంతైనా టార్గెట్ చేసుకోండి. కానీ, వాళ్ల ఫ్యామిలీని మాత్రం ఏమీ అనకండి. వాళ్లు అంత బాధలో ఉన్నారు' అన్నాడు.

శివాజి గారు టార్గెట్ అందుకే: ఆ తర్వాత మానస్ మాట్లాడుతూ.. 'అమర్‌ను శివాజి గారు టార్గెట్ చేయడం ఆయన స్ట్రాటజీలో భాగమే. మధ్యలో వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ను కూడా మెచ్చుకునే ఆయన.. మొదటి నుంచీ ఉన్న అమర్‌ను ఎందుకు దూరం పెడుతున్నారు? శత్రుత్వాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన చేయడమే కాకుండా ఎదుటి వాళ్లపై ఎందుకు రుద్దుతున్నారు' అని ప్రశ్నించాడు.
బలవంతంగా ఒప్పిస్తున్నారు: మానస్ కొనసాగిస్తూ.. 'ఓ సందర్భంలో తేజ వచ్చి అమర్ బాగా ఆడాడు కదన్నా అని అన్నాడు. అప్పుడు శివాజి గారు ''ఏం ఆడాడు? అమర్ తప్ప మిగిలిన వాళ్లంతా బాగానే ఆడుతున్నారు'' అని చెప్పారు. అంటే.. బలవంతంగా ఎదుటి వాళ్లను కూడా ఒప్పించాలని చూస్తున్నారు. ఇలాంటివి చేస్తున్నారంటే ఆయన అమర్ విషయంలో పక్కా స్ట్రాటజీతోనే ఉన్నారు' అని చెప్పాడు.

అమర్ స్ట్రాంగ్ అని తెలుసు: అనంతరం మానస్ 'ఎవరైనా ఒక మనిషికి అవకాశం ఇస్తేనే కదా వాడు చేస్తాడా? చేయడా? మంచా చెడా అనేది తెలిసేది. అసలు దగ్గరకే రానివ్వకుండా ఉంటే ఎలా తెలుస్తుంది. అమర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని శివాజి గారికి తెలుసు. దాన్ని బట్టే ఆయన టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అందుకే లో చేయడానికి తరచూ అమర్‌ను ఏదో ఒక మాట అంటూ ఉంటున్నారు' అన్నాడు.

విలన్ ఎవరో తెలుస్తుందని: తర్వాత మానస్ 'ప్రతి ఒక్క సీజన్‌కి ఒక్క హీరో.. ఒక్క విలన్ ఉంటాడు. విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే హీరో అంత హైలైట్ అవుతాడు. బిగ్ బాస్ కూడా మూడున్నర గంటల సినిమా లాంటిదే. అయితే, ఈ షో మూడు నెలల సినిమా. ఎవరు హీరోనో ఎవరు విలనో ఈ జర్నీనే డిసైడ్ చేస్తుంది. శివాజీ గారిలా ఎదుటివాళ్లపైకి రుద్దడం లేదు. జనానికే వదిలేస్తున్నా' అని చెప్పుకొచ్చాడు.
తేజు అలా.. చూపించట్లేదు: చివర్లో మానస్ 'నేను ప్రతిరోజు తేజు (అమర్ భార్య)తో మాట్లాడుతున్నాను. ఆమె చాలా బాధగా ఉంది. మెంటల్‌గా ఫిజికల్‌గా ఇబ్బంది పడుతోంది. తను 24 గంటలు చూస్తూనే ఉంది. ఆమె ఆరోగ్యం కూడా పాడవుతుంది. అలాగే, శివాజీ అమర్‌ని హర్ట్ చేస్తూ మాట్లాడిన మాటలు లైవ్ ఎపిసోడ్‌లో వస్తోంది కానీ మెయిన్ ఎపిసోడ్‌లో రావట్లేదు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


Click it and Unblock the Notifications











