జబర్దస్త్ అవినాష్‌కు చేదు అనుభవం.. స్టేజి మీదనే చొక్కా లాగేసిన హీరోయిన్స్!

జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న వాళ్లలో అవినాష్ ఒకడు. ముక్కు అవినాష్ గా పేరు తెచ్చుకున్న అతను తన గంభీరమైన వాయిస్ తో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి తనదైన కామెడీతో అభిమానులను నవ్వించాడు. ఇక బిగ్ బాస్ ఆఫర్ ను అందుకోవడానికి జబర్దస్త్ వారికి డబ్బులు చెల్లించి మరీ వెళ్లడంతో.. తిరిగి ఈటీవీలోకి అతను రాలేకపోయాడు. దీంతో అవినాష్ ను మా టీవీ అక్కున చేర్చుకుంది.

ప్రతి షోలో అవినాష్ ఎంట్రీ లేకుండా ఉండదు. ప్రతి షోలో తనదైన కామెడీతో అదరగొడుతూ మంచి పేరునే తెచ్చుకుంటున్నాడు. నీతోనే డ్యాన్స్ లో కూడా అరియనాతో జంటగా పాల్గొన్న అవినాష్ .. కొన్ని ఎపిసోడ్స్ కే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఇక అవినాష్ ప్రస్తుతం ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే షోలో కమెడియన్ గా చేస్తున్నాడు.

serial heroines fun with mukku avinash in Aadivaaram with Star Maa Parivaaram Star wars show

శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో హరి, అవినాష్ ఆమెకు అసిస్టెంట్స్ గా కామెడీని పంచుతున్నారు. ప్రతి ఆదివారం సరికొత్త థీమ్ తో బుల్లితెర నటీనటులను పిలిచి.. రెండు భాగాలుగా విభజించి.. చెరో టీమ్ కు హరి అండ్ అవినాష్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక వారి టీమ్ తో.. ఎదుటివారి టీమ్ తో వీళ్ళు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ఇక ఈ వారం శ్రీముఖి.. హీరోయిన్స్ వర్సెస్ విలన్స్ అనే థీమ్ తో వచ్చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమోలో విలన్స్ అందరూ అవినాష్ ను ఒక ఆట ఆడుకున్నారు. హీరోయిన్స్ కు సపోర్ట్ గా హరి ఉండగా.. విలన్స్ కు సపోర్ట్ గా అవినాష్ నిలబడ్డాడు. ఇక విలన్స్ గా వచ్చిన నటీమణులు అందరూ కలిసి అవినాష్ తో ఒక సాంగ్ చేశారు.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలోని జామురేయి వేళల్లో వీరుడల్లే వస్తాడు అనే సాంగ్ కు డ్యాన్స్ వేశారు. ఇందులో అవినాష్ ను కూర్చోపెట్టి అతడి జుట్టు పీకుతూ.. అందరూ చుట్టుముట్టి చొక్కాను కూడా లాగేశారు. ఇక దీని తరువాత అవినాష్.. నా లైఫ్ లో ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు మొదటిసారి అమ్మాయిలు అంటే భయమేసింది అని దండం పెట్టాడు.

serial heroines fun with mukku avinash in Aadivaaram with Star Maa Parivaaram Star wars show

ఇక ఆ తరువాత జీవన జ్యోతి హీరోయిన్ తో హరికి పెళ్లి చేశారు. పెళ్లి తరువాత కార్యక్రమం మొదలు పెట్టండి అనగానే వారు భయపడి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ షో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు ప్రసారం కానుంది. అవినాష్ ఉంటె సందడే అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X