twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే: షో మీద మరించి అంచనాలు పెంచిన వీడియో!

    |

    113 రోజులు... ఆఖరి ఆదివారం... కంటిన్యూస్‌గా షోను ఫాలో అవుతూ ఇంత సపోర్ట్ చూపించి బిగ్ బాస్ సీజన్ 2న బ్లాక్ బస్టర్ చేశారు అంటూ.... గ్రాండ్ ఫినాలె ఈవెంటులో నాని ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా కూడా ఈ గ్రాండ్ ఫినాలె ఈవెంటులో తమ ఆట పాటలతో అలరించబోతున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం అయ్యే షోపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతూ ప్రోమో వదిలారు. ఇందులో ఎవరెవరు? ఎలా పెర్ఫార్మెన్స్ చేశారో హింట్ ఇస్తూ షోపై మరింత ఆసక్తి రేకెత్తించారు.

    ఆట పాటలతో జోష్...

    ఆట పాటలతో జోష్...

    బిగ్ బాస్ షో నుండి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన బాబు గోగినేని, తేజస్వి, గణేష్, శ్యామల, దీప్తి సునైనా, నందినీ రాయ్ ఇలా అందరు కంటెస్టెంట్స్ ఆదివారం సాయంత్ర ప్రసారం అయ్యే షోలో తమ ఆట పాటలతో అలరించనున్నారు.

    అదిరేటి డ్రెస్సు అంటూ...

    అదిరేటి డ్రెస్సు అంటూ...

    బిగ్ బాష్ షోకు రాక ముందే తన డాన్స్ ఆల్బమ్స్‌తో యూట్యూబ్‌ స్టార్‌గా పాపులర్ అయిన దీప్తి సునైనా.... బిగ్ బాస్ గ్రాండ్ పినాలె షోలో అదిరేటి డ్రెస్సు మేమేస్తే... బెదిరేటి లుక్కు మీరిస్తే దడ అంటూ డాన్స్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టబోతోంది.

    రంగీలా పాపగా తేజస్వి, పెర్ఫార్మెన్స్ అదుర్స్

    రంగీలా పాపగా తేజస్వి, పెర్ఫార్మెన్స్ అదుర్స్

    తేజస్వి మదివాడ ఈ రోజు సాయంత్ర ప్రసారం అయ్యే గ్రాండ్ ఫినాలె షోలో రంగీలా పాపగా దర్శనమివ్వబోతోంది. రంగీలా చిత్రంలోని యాయీరే యాయీరే పాటకు అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ప్రేక్షకులను అలరించబోతోంది.

    తెగ ఊపేసిన పిన్నిగారు

    తెగ ఊపేసిన పిన్నిగారు

    బిగ్ బాస్ ఇంట్లో పిన్నిగారుగా పాపులర్ అయిన యాంకర్ శ్యామల..... ఆదివారం సాయంత్రం ప్రసారం అయ్చే షోలో థిలానా థిలానా నా కసికల్ల కూన అంటూ ముత్తు మూవీ సినిమా పాటకు డాన్స్ చేస్తూ బిగ్ బాస్ షోను ఒక ఊపు ఊపబోతోంది. పిన్నిగారిగా కంటిన్యూ అవుతారా? పిన్ని కూతురుగా కంటిన్యూ అవుతారా? అని నాని ప్రశ్నించగా... నానిగారి చెల్లెలిగా కంటిన్యూ అవుతాను అంటూ శ్యామల పంచ్ ఇచ్చింది.

    అన్ని రసాలు కలగలిపి

    మొత్తానికి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలె షో.... ఎంటర్టెన్మెంట్, ఎమోషన్స్, ఫన్ ఇలా రసాలు కలగలిపి బిగ్ బాస్ సీజన్ 2 మొత్తానికి హైలెట్ అయ్యేలా సాగబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    English summary
    All set for BiggBossTelugu2 Grand Finale. Kaushal, Geetha Madhuri, Deepthi Nallamothu, Tanish and Samrat Reddy have made it to the finals of Bigg Boss Telugu 2 and host Nani will announce one of these five contestants as the winner of the show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X