Bigg Boss Nominations: 6వ వారం నామినేషన్స్ లీక్.. ఏడుగురు నామినేట్.. టైటిల్ ఫేవరెట్‌కే ఎక్కువ ఓట్లు
బుల్లితెర చరిత్రలోనే దేశ వ్యాప్తంగా సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్న దీనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ భారీగానే అందుతోంది. అందుకే ఈ షో ప్రసారం అయిన ప్రతిసారీ ఆయా భాషల్లో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఇది దేశంలోనే ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోంది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఏడో సీజన్‌ను నడుపుతున్నారు. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుస్తోన్న ఈ సీజన్‌కు సంబంధించిన ఆరో వారంలో నామినేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులు మీకోసమే!
కొత్త కంటెంట్.. 2.O కూడా:బిగ్ బాస్ నుంచి ఏడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే దీన్ని ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో మొదలు పెట్టారు. ఇందులో ఆరంభం నుంచే ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత ఆదివారమే 2.0 వెర్షన్ మొదలు పెట్టారు. ఇందులో ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

వాళ్లు బయటకు.. అతడేమో:ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ఆరంభంలో 14 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారం దామిని, నాలుగో వారం రతికా రోజ్, ఐదో వారంలో శుభశ్రీ రాయగురులు ఎలిమినేట్ అయ్యారు. అలాగే, మరో కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూమ్‌లోకి పంపించారు.
నామినేషన్.. రెండు రకాలు:ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్లుగానే కొత్త వచ్చిన వాళ్లను పోటుగాళ్లు అని, పాత వాళ్లను ఆటగాళ్లు అని రెండు టీమ్‌లుగా విభజించారట. మొదట పోటుగాళ్లు.. పాత కంటెస్టెంట్లు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పాత వాళ్లు ఒక పాత, ఒక కొత్త కంటెస్టెంట్‌ను నామినేట్ చేయాలని తెలుస్తోంది.
పోటుగాళ్లు X ఆటగాళ్లుగా:సాధారణంగానే బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కులో గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియలో కొందరు కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా పోటుగాళ్లు వర్సెస్ ఆటగాళ్లు అన్నట్లుగా ఈ టాస్క్ జరిగినట్లు సమాచారం. దీంతో ఈ ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఏడుగురు నామినేషన్‌లో:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని ఆరో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని తెలిసింది. అందులో టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టి, పూజా మూర్తి, అశ్విని శ్రీ, నయనీ పావనిలు ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చేసింది.
అతడికే ఎక్కువ ఓటింగ్:బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియలో కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లతో పాటు పాత వాళ్లు కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్న అమర్‌దీప్ చౌదరినే ఎక్కువగా టార్గెట్ చేశారని తెలిసింది. దీంతో ఈ సీజన్‌లోనే ఎవరికీ రాని విధంగా అత్యధిక ఓట్లను అందుకుని అతడు నామినేట్ అయ్యాడని సమాచారం.
వాళ్లు మాత్రమే సేఫ్‌గా:ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఎనిమిది మంది పాత కంటెస్టెంట్లు, ఐదుగురు కొత్త వాళ్లు ఉన్నారు. ఇందులో కెప్టెన్ అయిన పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రియాంక జైన్, సందీప్ మాస్టర్, అంబటి అర్జున్, భోలే షావలిలు నామినేషన్ నుంచి సేఫ్ అయినట్లు తెలిసింది. ఇక, ఇందులో కొత్త, పాత వాళ్లు ఉండడంతో ఈ వారం ఓటింగ్ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











