బిగ్ బాస్ టీమ్‌తో శివాజి కోల్డ్ వార్: నాగార్జునే కాదు దేవుడైనా వదలను.. వెలుగులోకి సంచలన నిజాలు

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి పరిచయం అయినా.. ఎవరూ ఊహించని రీతిలో తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన షో బిగ్ బాస్. ఇంత సక్సెస్ అయింది కాబట్టే నిర్వహకులు వరుసగా సీజన్లను చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో దాన్ని పూర్తి చేసుకున్నారు.

ఇందులో బాగా హైలైట్ అయిన కంటెస్టెంట్లలో శివాజి అలియాస్ శివన్న ఒకరు. ఈ డేరింగ్ సెలెబ్రిటీ ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా శివాజి బిగ్ బాస్ యూనిట్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. అసలేం జరిగిందో మీరే చూసేయండి మరి!

Seventh Season Contestant and Hero Sivaji Allegations On Bigg Boss Team

విన్నర్ అనుకుంటే మూడు: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి వచ్చిన ఆరంభంలోనే టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్నాడు శివాజి. అందుకు తగ్గట్లుగానే మైండ్ గేమ్‌తో మెప్పించడంతో ఈ సీజన్‌లో విజేతగా నిలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా శివాజి కూడా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిపోయాడు. ఫలితంగా మూడో స్థానంతోనే సరిపెట్టుకుని సెకెండ్ రన్నరప్ అయ్యాడు.

వరుస ఇంటర్వ్యూలతో బిజీ: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో అదరగొట్టి అందరి శివన్నగా పేరు తెచ్చుకున్న శివాజి.. షో తర్వాత బయటకు రావడానికి చాలా సమయం తీసుకున్నాడు. కానీ, రెండు మూడు రోజులుగా మాత్రం అతడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే ఎన్నో కార్యక్రమాల్లోనూ భాగం అవుతున్నాడు. దీంతో ఇప్పుడు కూడా శివాజి పేరు మారుమ్రోగిపోతోంది.

Seventh Season Contestant and Hero Sivaji Allegations On Bigg Boss Team

నాగార్జునపై గౌరవం ఉంది: బిగ్ బాస్ షోలో నాగార్జునపై శివాజి పంచ్ వేశాడని హైలైట్ చాలా మంది హైలైట్ చేశారు. దీనిపై తాజా ఇంటర్వ్యూలో అతడు స్పందించాడు. 'నాగార్జున బాబు గారిపై గౌరవం ఎప్పుడూ ఉంటుంది. ఆయన వల్లే నేను ఈ స్టేజ్‌లో ఉన్నాను. నాకు ఫస్ట్ చాన్స్ ఇచ్చింది బాబు గారే. ఇప్పుడు రీఎంట్రీకి అవసరమైన బిగ్ బాస్ ఆఫర్ కూడా ఆ స్టూడియోలోనే వచ్చింది' అన్నాడు.

నన్ను విలన్‌గా చూపారని: ఆ తర్వాత శివాజి 'బాబు గారిపై గౌరవం నా గుండెల్లో ఉంది. కానీ, నా క్యారెక్టర్ పోతున్నప్పుడు భగవంతుడు ఉన్నా తలదించుకోకుండా ప్రశ్నిస్తాను. బయటికి వచ్చిన తర్వాత నన్ను విలన్ చేయడానికి ప్రయత్నించారని నాకు అర్థం అయింది. కొంతమందిని హీరో చేయడానికి ప్రయత్నించారు. ఎందుకలా అని నాకు ఇప్పటికీ అర్థం కాలేదు' అంటూ ఆరోపణలు చేశాడు.

Seventh Season Contestant and Hero Sivaji Allegations On Bigg Boss Team

నేను అన్నది బిగ్ బాస్‌నే: శివాజి కంటిన్యూ చేస్తూ.. 'అమ్మాయిల గొడవ విషయంలో నేను ప్రశ్నించింది బిగ్ బాస్‌ను. నేను బ్రతికి ఉన్నంతవరకు బాబుగారిని ప్రశ్నించే ధైర్యం చేయను. నాకు అక్కడ కనిపించింది బాబు గారు కాదు.. బిగ్ బాస్. ఎవరైనా వేరేవాళ్లను హింసిస్తున్నప్పుడు మాటలు మీరొచ్చేమో కానీ కంటెంట్ ఇలాగే ఉంటుంది. దానినే నేను ఎక్స్‌ప్రెస్ చేశాను. అదే ఇష్యూ అయింది' అని చెప్పాడు.

Seventh Season Contestant and Hero Sivaji Allegations On Bigg Boss Team

క్లారిటీ తీసుకుంటాను అని: ఈ ఇంటర్వ్యూలో శివాజి 'నన్ను పన్నెండో వారం నుంచి విలన్‌గా చూపించే ప్రయత్నం చేశారు. అలా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. నా స్క్రీన్ స్పేస్ కూడా చాలా వరకూ తగ్గించారు. దీనిపై నేను ఎవరి దగ్గర క్లారిటీ తీసుకోవాలో వారి దగ్గరే తీసుకుంటాను' అని చెప్పుకొచ్చాడు. తద్వారా బిగ్ బాస్ టీమ్‌తో పోరాటానికి రెడీ అవుతున్నట్లు పరోక్షంగా ప్రకటన చేసేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X