Guppedantha Manasu May 16th: మనును కాపాడేందుకు వసు రిస్క్.. రాజీవ్‌ను మోసగిస్తున్న శైలేంద్ర!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో వసు, మహేంద్ర, అనుపమలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా రాజీవ్ బతికే ఉన్నాడని.. శైలేంద్ర కూడా మా ట్రాప్ లో పడ్డాడని చెబుతారు. అలాగే ఆ అగ్రిమెంట్ గురించి వివరిస్తారు. రిషి, జగతిల ప్రాణం అయిన ఆ కాలేజీని శైలేంద్రకు అప్పగించడం ఏంటంటూ అనుపమ ప్రశ్నిస్తుంది. శైలేంద్ర కాలేజీ కోసం ఏదైనా చేస్తాడని.. మనును విడిపించాకా ఎండీ పదవి ఇవ్వకపోతే అస్సలే ఊరుకోడని అంటుంది. ఇలా చేయడం నాకు చాలా భయంగా ఉందని చెబుతుంది. దీని వల్ల ఎవరికి ఏం జరగుతుందో కూడా అర్థం కావట్లేదంటూ వివరిస్తుంది. మను నా కొడుకులాంటోడే అని, తనంటే నాక్కూడా ఇష్టమే అంటూ వివరిస్తాడు. మనును బయటకు తీసుకు వచ్చేందుకు నేనేమైనా చేస్తానంటూ వివరిస్తాడు.

అలాగే నేను చెప్పినట్లు వసుధార చేయాలి అన్నాడుగా.. ఏం చేయబోతున్నాడో అంటూ మహేంద్ర అంటాడు. వసు మాత్రం.. మనల్ని ఇబ్బంది పెట్టే ప్లాన్ అయితే చేయడని, కానీ రాజీవ్ ను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం మాత్రం చేస్తాడని అంటాడు. ఆ తర్వాత అనుపమ మాట్లాడుతూ.. మీరు చేసే ఈ ప్రయత్నం వల్ల ఎవరికీ ఇబ్బంది కల్గకూడదని అంటుంది. ఇకఆ తర్వాత శైలేంద్ర.. రాజీవ్ తో మాట్లాడుతూ కనిపిస్తాడు. వసు నీకేమైనా చెప్పిందా అని రాజీవ్ అనగా.. లేదంటాడు శైలేంద్ర. మళ్లీ నువ్వేదైనా వెదవ పని చేశావా అంటూ శైలేంద్ర ప్రశ్నించగా.. నీ మరదలు నాకు చిరాకు తెప్పిస్తుందని.. అన్ని విషయాల్లో అడ్డు వస్తోందని అంటాడు. ఆమె ప్రాణం తీసేయాలన్నంత కోపం వస్తుందనగా.. నీకోసం ఆలోచించే ఊరుకుంటున్నానంటాడు.

Shailednra Give Shock to His Mother Devayani on Guppedantha Manasu May 16th 2024 Episode 1076

నాకోసమైనా నా మరదలును వదిలేయాలని.. రాజీవ్ అనగా.. శైలేంద్ర మాత్రం ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్లిపో అంటాడు. వసును ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లిపో అనగా.. సరేనంటాడు రాజీవ్. నేనే నీ మరదలును నీ దగ్గరకు తీసుకు వస్తానని చెబుతాడు. కానీ ఇది విన్న రాజీవ్.. నాకు నువ్వు ఆఫర్ ఇస్తున్నావా, ఇరికిస్తున్నావా అంటూ అడుగుతాడు. దీంతో తాను వెళ్లిపోబోగా.. ఆగమంటాడు రాజీవ్. ఎండీ పదవి కోసం చివరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంటాడు. ఇది విన్న రాజీవ్ నాక్కూడా ఈ ఆఫర్ వదులుకోవాలని లేదంటాడు. కానీ వసును ఎలా తీసుకు వస్తావని అడుగుతాడు. ఏదో ఒకటి చేసి తీసుకు వస్తానంటాడు. ఆ తర్వాత ప్లాన్ చెప్పి ఓ లొకేషన్ చెప్పి వసును అక్కడకు తీసుకు వస్తానంటూ వివరిస్తాడు. రాజీవ్ శైలేంద్రను పూర్తిగా నమ్ముతాడు.

Devara Movie: దేవర సినిమా నుంచి భయపెట్టే పాట.. ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే?\

ఆ తర్వాత మను కానిస్టేబుల్ ఫోన్ ద్వారా వసుకు కాల్ చేస్తాడు. వసు లేపగానే.. మనును అని చెబుతాడు. స్పీకర్ ఆన్ చేయమని చెప్పగానే.. ఆన్ చేస్తారు. అంతా ఉన్నారా అంటే ఉన్నామని వసు అనగా.. అనుపమ మేడమ్ ఉన్నారా అంటాడు. ఉందనగా.. మీరు కంగారు పడకండి, నేను బాగానే ఉన్నాను, వసు, మహేంద్రలు సాయంగా ఉన్నారు నేను త్వరలోనే బయటకు వస్తానని తల్లికి ధైర్యం చెబుతాడు. అదే మీరు నాకు నేర్పించిన ధైర్యం, నిజాయితీలే నన్ను బయట పడేలా చేస్తాయంటూ చెప్పుకొస్తాడు. మీరు నన్ను కాపాడేందుకు చాలా రిస్క్ చేస్తున్నారాని.. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటాడు. ఇందులో మీకేమైనా అయితే నేను తట్టుకోలేనని అంటాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొస్తాడు.

Shailednra Give Shock to His Mother Devayani on Guppedantha Manasu May 16th 2024 Episode 1076

నేను ఎన్ని బాధలు అయినా పడతానని.. కానీ మీకేమైనా అయితే మాత్రం నేను తట్టుకోలేనని చెబుతాడు. నువ్వెలాంటి ఇబ్బందులు పడ్డావో మేమంతా కూడా అలాంటి పరిస్థితులే ఎదుర్కున్నామని.. నిన్ను కాపాడుకునే బాధ్యత నాదని చెబుతాడు. ఆ శైలేంద్ర విష సర్పం అని నాకు తెలుసు అని.. వాడిని ఎలా డీల్ చేయాలో కూడా బాగా తెలుసు అంటూ వివరిస్తాడు. ఒకవేళ ఈ ప్రయత్నం ఫెయిల్ అయితే మరో ప్రయత్నం చేస్తానని.. అదీ కాకపోతే ఇంకోటి చేస్తానంటాడు. దీంతో మను.. నా మీద మీకెందుకంత ఇది సార్ అంటాడు. అది విన్న మహేంద్ర.. నేను నిన్ను కొడుకులా ఫీల్ అవుతున్నానని చెప్పుకొస్తాడు. నాది వన్ సైడ్ లవ్ అని కూడా వివరిస్తాడు. అందుకే నేను నిన్ను వదులుకోలేనని వివరిస్తాడు. నేను నీకోసం ఏమైనా చేస్తానని చెప్పుకొస్తాడు.

ఆ తర్వాత శైలేంద్ర.. మహేంద్ర ఇంటికి వస్తాడు. వసును నాతో పంపించాలని అంటాడు. వసుధార నాతో వస్తేనే రాజీవ్ బయటకు వస్తాడని చెప్పుకొస్తాడు. కానీ మహేంద్ర మాత్రం తాను అందుకు ఒప్పుకోనని చెబుతాడు. అంతా కలిసి చేస్తేనే మను బయటకు వస్తాడని.. ఎక్కడికి తీసుకు వెళ్తావో చెప్పమంటాడు. నువ్వైనా చెప్పు వసు అనగా.. నేనెల్తాను అంటుంది. వద్దని మహేంద్ర అంటాడు. నువ్వు ఆ రాజీవ్ వద్దకే వసును తీసుకు వెళ్తున్నావు కదా అనగా.. అవునంటాడు శైలేంద్ర. నీకు నిజంగా, బుద్ధి, జ్ఞానం లేదా అంటూ ఫైర్ అవ్వగా.. వసుధార అడ్డు తొలగించుకని కాలేజీ దక్కించుకోవాలనేదే కదా నీ ప్లాన్ అంటూ చెప్పుకొస్తాడు. ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేశానని.. వాళ్లు అక్కడకు వస్తున్నారని అంటాడు. మహేంద్ర తాను కూడా వస్తానంటే వద్దంటాడు.

Shailednra Give Shock to His Mother Devayani on Guppedantha Manasu May 16th 2024 Episode 1076

రాజీవ్ గాడికి మన ప్లాన్ తెలియకూడదు అంటే వసుధార, నేను మాత్రమే వెళ్లాలని అంటాడు. మూడో పర్సన్ వస్తే పెద్ద ఇబ్బందే వచ్చి పడుతుందని అంటాడు. ఏదైనా అవసరం వచ్చినా, ప్రాబ్లమ్ వచ్చినా నేను మీకు ఫోన్ చేస్తానని.. అంటాడు. మామయ్యా మీ కొడుకును కాపాడే బాధ్యత నాది అని వసు అనగా.. కొడుకా, కొడుకేంటని శైలేంద్ర ఆలోచిస్తాడు. అలా ఈ సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X