Guppedantha Manasu May 17th: వసుధారత రాజీవ్ పెళ్లి.. శైలేంద్రే పెళ్లి పెద్ద.. మహేంద్ర సీక్రెట్ ప్లాన్ ఏంటంటే?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో శైలేంద్ర.. మహేంద్ర ఇంటికి వస్తాడు. వసును తనతో పంపించాలని అంటాడు. ఏదైనా అవసరం వచ్చినా, ప్రాబ్లమ్ వచ్చినా నేను మీకు ఫోన్ చేస్తానని.. అంటాడు. మామయ్యా మీ కొడుకును కాపాడే బాధ్యత నాది అని వసు అనగా.. కొడుకా, కొడుకేంటని శైలేంద్ర ఆలోచిస్తాడు. మీరు దత్తత తీసుకోవాలనుకున్న కొడుకును కాపాడే బాధ్యత నాదంటూ కవర్ చేస్తుంది. అలా వసు శైలేంద్రతో వెళ్తుంది. కారులో వెళ్తుండగా.. ఇందులో ఎలాంటి మత్లబ్ లేదుకదా అంటూ వసు అనగా.. ఏం లేదని పోలీసులకు ఇప్పటికే ఫోన్ చేశానని చెబుతాడు. మనం వెళ్లి ఓ నాలుగు మాటలు మాట్లాడేలోపే పోలీసులు వస్తారని అంటాడు.

కానీ రాజీవ్ మాత్రం కారుకు అడ్డంగా నిల్చుంటాడు. దీంతో అతనెవరో తెలియక శైలేంద్ర కోప్పడతాడు కానీ దగ్గరకు వెళ్లి చూసేసరికి రాజీవ్ కనిపించగా.. వసుతో పాటు శైలేంద్ర షాక్ అవుతాడు. బ్రదర్ నువ్వా అని శైలేంద్ర, బావా అంటూ వసు పిలుస్తారు. అవును పిల్లా నీ బావనే అంటూ వసు అంటుంది. నిన్ను సొంతం చేసుకోకుండా వదలను అంటాడు. శైలేంద్ర నీకేదో మాటలు చెప్పడానికి తీసుకు వచ్చాడు కదా అంటూ చెప్పుకొస్తాడు. ఇదంతా మా ప్లాన్ అంటూ వివరిస్తాడు. వాడు నిన్ను కాపాడడు అంటూ వసును లాక్కెళ్తాడు. తాను వదలమంటూ గొడవ చేయగా.. శైలేంద్ర ఆపే ప్రయత్నం చేస్తాడు. వద్దు బ్రదర్ అనగా.. పెళ్లికి ముందు చేయి పట్టుకోవద్దని అంటున్నావా అంటూ చేయి విధిలించుకుంటుంది. చూస్తూ ఉండు ఈరోజుటితో నీ చాప్టర్ క్లోజ్ అంటూ వివరిస్తాడు. అలా వసుకు మత్త మందు పెడతాడు.

Shailendra asks Mahendra to send Vasu with him on Guppedantha Manasu May 17th 2024 Episode 1077

శైలేంద్ర కారులోనే కూర్చోబెట్టి.. నేను చెప్పిన లొకేషన్ కు కాకుండా ఇక్కడికి ఎందుకు తీసుకు వచ్చావంటూ పైర్ అవుతాడు. నువ్వేకదా మా పెళ్లికి పెద్దవి కారెక్కు అంటూ తీసుకెళ్తాడు. నేనేసిన ప్లాన్ వేరేలా మారిందని.. వసును కాపాడి రాజీవ్ ను ఎలా పోలీసులకు అప్పగించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే రాజీవ్ గన్ తీసి మరీ కారు ఎక్కు బ్రదర్ అంటూ చెప్పుకొస్తాడు. అలాగే శైలేంద్ర ఫోన్ కూడా తీసుకుని స్విచ్ఛాఫ్ చేస్తాడు. కారెక్కితే సీక్రెట్ ప్లేస్ కు తీసుకెళ్తానంటాడు. అదెక్కడా అని అడిగినా చెప్పకుండా వారిద్దరినీ తీసుకెళ్తాడు రాజీవ్. ఇక ఆ తర్వాత మహేంద్ర, అనుపమలు టెన్షన్ పడుతూ కనిపిస్తారు. ఏంటి అనుపమ టెన్షన్ గా ఉందా అంటూ అడగ్గా.. మను నిర్దోషిగా బయటకు వస్తాడా లేదా అని ఉండేదని.. కానీ ఇఫ్పుడు వసు పరిస్థితి ఏంటని భయంగా ఉందంటూ వివరిస్తుంది.

కానీ నువ్వు శైలేంద్ర మాటలు నమ్మి వసును ఒంటరిగా పంపావంటూ చెబుతుంది. కానీ మహేంద్ర మాత్రం.. వసును ఒంటరిగా పంపించావెందుకని అనగా.. మను కోసం అంటాడు. అలా అని వసు గురించి ఆలోచించలేదనుకోవద్దు అంటూ చెప్పుకొస్తాడు. నా ప్లాన్ లో నేను ఉన్నాను అంటూ వివరిస్తాడు. శైలేంద్రతో పాటు వసును ఓ ఇంటికి తీసుకెళ్తాడు రాజీవ్. అక్కడ పెళ్లి ఏర్పాట్లు చూసి వసు షాక్ అవుతుంది. ముఖ్యంగా అప్పుడే పెళ్లి కొడుకు గెటప్ లోరాజీవ్ రావడం చూసి శైలేంద్రతో పాటు వసులు మరింత షాక్ అవుతారు. అప్పుడే శైలేంద్ర ఏంటి బ్రదర్ ఇదంతా అంటూ అడుగుతాడు. కానీ అదేం పట్టించుకోకుండా నేనెలా ఉన్నానంటూ రాజీవ్ అంటాడు. వసును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొస్తాడు.

నీ మెడలో తాళి కట్టకుండా నిన్ను పంపించేదే లేదంటూ రాజీవ్ వసుతో చెబుతాడు. నిన్ను దక్కించుకోవాలనేది ఇన్నాళ్లు నా కళ అంటూ వివరిస్తాడు. నిన్ను ఈరోజు అస్సలే తప్పించుకోనంటూ చెబుతాడు. నిన్ను ఇలా కట్టేసే నీ మెడలో తాళి కడతానంటాడు. మరీ ఇంత హింస పెట్టి పెళ్లి చేసుకోవడం అవసరమా అంటూ అనగా.. వసును దక్కించుకోవడమే నా ప్లాన్ అంటూ వెళ్లడిస్తాడు. రాజీవ్ ను పట్టిస్తానని చెప్పి మమ్మల్నే చీట్ చేస్తావా అంటూ వసు అడుగుతుంది. మా మధ్య గొడవ పెట్టి మా నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా అంటూ అఢుగుతాడు. శైలేంద్ర భయ్యా నాకు ప్లాన్ చెప్పి మరీ నిన్ను నాకు అప్పగించి కాలేజీ దక్కించుకోవాలనుకుంటున్నాడని అంటాడు. ఆ తర్వాత శాస్త్రోక్తంగా నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ వివరిస్తాడు. ముహూర్తానికి ఇంకా సమయం ఉందని చెబుతాడు.

ఏంటి భయ్యా ఇలా టెన్షన్ పడుతున్నావంటూ శైలేంద్రను అడుగుతాడు రాజీవ్. నేను చిన్న పని చూసుకుని వస్తానంటూ శైలేంద్ర అనగా.. వద్దు నువ్వు ఇక్కడే ఉండాలి భయ్యా అంటాడు. ఆతర్వాత గన్ తీసి అతడిపై పెడతాడు. కంగారు పడకు అంటూనే.. తాను పెళ్లి చేసుకునే వరకు కచ్చితంగా పక్కనే ఉండమంటూ చెప్పుకొస్తాడు. ఇదే తన జీవిత ఆశయం అని త్వరలోనే అది నెరవేరబోతుందంటూ చెప్పుకొస్తాడు. ఏం చేస్తాడో, ఏంటో ఎలాగైనా సరే వసుధార మెడలో తాళి కట్టకుండా చేయాలంటూ చెప్పుకొస్తాడు. ఏమైనా చేయాలనుకుంటున్నావా అందులో బుల్లెట్లు లేవంటూ వివరిస్తాడు. ఇంతటితో ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X