Guppedantha Manasu May 11th: మనుకు సాయం చేయబోతున్న శైలేంద్ర.. కష్టాల్లో రాజీవ్, కథ మార్చేస్తున్న వసు!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో వసు మొదటి నుంచి నేను తనని అనుమానిస్తూనే వచ్చాను.. మీరే సాయం చేశాడు మంచి వారంటూ నెత్తిన పెట్టుకున్నారని చెబుతుంది. ఇప్పుడు మనం 50 కోట్లు ఎక్కడి నుంచి తీసుకు వస్తామంటూ మహేంద్రను ప్రశ్నిస్తుంది. మహేంద్ర కూడా మనం నమ్మిన వాళ్లంతా మనల్ని ఇలా మోసం చేస్తున్నారేంటని అంటాడు. ఆ తర్వాత వసు లేచి తాను వెళ్లి మనును నిలదీస్తానని.. లేదంటే ఈ నోటీస్ అతడి మొహాన కొట్టి వస్తానని అంటుంది. నేను కూడా వస్తానని శైలేంద్ర అంటాడు. కానీ తాను మాత్రం వద్దని, ఇందాక వెళ్తే ఏం జరిగిందని అంటుంది. అలా ఆమె అక్కడి నుంచి వెళ్లగానే... మన ప్లాన్ వర్కౌట్ అవుతుందని వసుధారకు మహేంద్ర మెసేజ్ చేస్తాడు.

ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి మనును నిలదీస్తుంది. ఆ పోలీస్ వాళ్లేం మాట్లాడుకుంటున్నారో.. శైలేంద్రకు ఫోన్ చేసి మరీ వినిపిస్తాడు. ఆ విషయం గుర్తించిన వసు, మనులు కూడా ఆ నాటకాన్ని కంటిన్యూ చేస్తారు. ఈ నోటీసులు ఏంటి, మీరు మంచి వాళ్లు అనుకున్నానంటూ వసు ఫైర్ అవుతుంది. కానీ మను మాత్రం.. మీ కాలేజీ నాకు 50 కోట్ల అప్పు ఉందని చెబుతాడు. అలాగే వాటిని కచ్చితంగా తీర్చాలని అంటాడు. వసు మాత్రం ముందు నుంచి మీ మీద నాకు నమ్మకం లేదని, మహేంద్ర గారు చెప్పడం, అనుపన గారి కొడుకు అని తెలియడంతో నేను మిమ్మల్ని నమ్మానంటూ వివరిస్తుంది. కాలేజీ సవ్యంగా నడిపిస్తే చాలు అన్న మీరు ఇప్పుడిలా చేశారేంటనగా.. ఎప్పుడైనా అప్పు ఇచ్చినప్పుడు తిరిగి తీసుకోవచ్చు అని అంటాడు. వసు కూడా ఫైర్ అవుతుంది.

Shailendra Going to help For Manu on Guppedantha Manasu May 11th 2024 Episode 1072

మీరు చేసేది కరెక్టు కాదని వసు అనగా.. నా 50 కోట్లు నేను అడుగుతున్నాను... ఇందులో ఏమైనా తప్పుందా కానిస్టేబుల్ గారు అంటూ మను అడుగుతాడు. మీరే నాకు డబ్బు ఎగ్గొట్టాలనుకున్నారని అనగా... ఇచ్చేయాలనే అనుకున్నామని వసు అంటుంది. అయితే 15 రోజుల సమయం చాలదని.. మిమ్మల్ని నమ్మినందుకు చాలా బాగా బుద్ధి చెప్పారని అంటుంది. మీరేం చేయాలనుకున్న సరే ఆ 50 కోట్లు మాత్రం కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని అంటాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ బయటకు వచ్చి తానే ఫోన్ మాట్లాడతాడు. మీరిచ్చిన ఆఫర్ నచ్చి వాళ్లేం మాట్లాడుకుంటున్నారో వినిపిస్తున్నానని అంటాడు. ఎవరైనా సరే చివరకు డబ్బుకు దాసోహం అవ్వాల్సిందేనంటూ శైలేంద్ర మనసులో అనుకోగా.. సార్ మరి డబ్బులు అంటాడు. ఇస్తానని ఇంకెవరు వచ్చినా వినిపించాలని శైలేంద్ర చెబుతాడు.

ఆ తర్వాత వసు కానిస్టేబుల్ ని పిలిచి మొత్తం వినిపించారా అని అనగా.. మీరు చెప్పినట్లే వినిపించానని చెబుతాడు. మీరు నాకు చేసిన సాయం ముందు ఇదెంత అని వెళ్లిపోతాడు. ఆ తర్వాత మనుతో మాట్లాడుతూ మనం అనుకున్నదే జరుగుతుందని చెబుతుంది. నేను కూడా వెళ్లి మనం అనుకున్నది జరిగేలా చేస్తానని అంటుంది. ఆ తర్వాత మను మాట్లాడుతూ.. మీరు ఇక్కడికి ఎక్కువగా రాకండి అని చెబుతాడు. ఆ రాజీవ్, శైలేంద్రల కళ్లు అన్నీ మనపైనే ఉన్నాయని చెబుతాడు. ఆ తర్వాత శైలేంద్రను చూపిస్తారు. దేవయాని, ఫణీంద్ర, ధరణిలతో కలిసి కూర్చుని తింటున్న ఈయన.. ఆలోచిస్తూ ఉంటాడు. అలా అన్నం కింద వేసుకుంటాడు. అది చూసిన ఫ్యామిలీ మెంబర్స్ ఇదేంటని అనుకుంటారు. కానీ చప్పుడు చేయరు.

Shailendra Going to help For Manu on Guppedantha Manasu May 11th 2024 Episode 1072

కిందనే అన్నంతో పాటు కూర వేసుకున్న అతడు కలుపుకుంటాడు. దీంతో ఫణీంద్ర పిలిచి ఏమైందని అంటాడు. ఏం లేదనగా.. కింద చూడని చెబుతాడు. అది చూసిన శైలేంద్ర ఆ తర్వాత ధరణిపై ఫైర్ అవుతాడు. ఇలా కింద ఎందుకు పెట్టావని అనగా.. ఫణీంద్ర భోజనం పెట్టుకుంది నువ్వేనని అంటాడు. ఏమైంది, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని అంటాడు. లేదు ఏదో ఉంది చెప్పు అనగా... నువ్వు ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నావా అంటూ అడుగుతాడు. ధరణి చెప్పినట్లు మరో అమ్మాయితో మాట్లాడుతున్నావా అంటూ అడుగుతాడు. మరి వెధవ వేషాలు వేస్తే బాగోదు అంటాడు.

ఆ తర్వాత వసు, మహేంద్రలు రాగానే అన్నం తినమని ఫణీంద్ర అంటాడు. అన్న అంత ప్రేమగా అడిగేసరికి వాళ్లు కూడా భోజనం చేస్తారు. నువ్వు కూడా తని ధరణి అంటూ మహేంద్ర అనగా తాను తర్వాత తింటానంటుంది. ఏం లేదన్నయ్యా.. మీకు శైలేంద్ర చెప్పలేదా అంటాడు. ఏ విషయం వసుధార అని శైలేంద్ర అనగా.. ఫణీంద్ర ఏం చేశావ్ రా అని అడుగుతాడు. వెధవ పని చేయలేదు కానీ మనుపై కోప్పడ్డాడని అంటాడు. ముందు ఏం జరిగిందో చెప్పమని ఫణీంద్ర మహేంద్రను అడగ్గా.. కాలేజీ జప్తు చేసుకుంటానంటున్నాడని చెబుతారు. 50 కోట్లు ఇవ్వమంటున్నారని వివరిస్తారు. తన అసలు రంగు ఇప్పడే బయటపడిందని దేవయాని అనగా.. ఫణీంద్ర మాత్రం షాక్ లో ఉంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X