Guppedantha Manasu May 13th: తల్లితో శైలేంద్ర గొడవ.. శైలేంద్రకు గట్టి షాకివ్వబోతున్న వసు, మహేంద్ర!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో శైలేంద్ర, వసుధారలు ఫణీంద్ర ఇంటికి వెళ్తారు. అక్కడే వరితో మాట్లాడుతూ.. మను పంపిన నోటీసుల గురించి వివరిస్తారు. అది విని అంతా షాక్ అవ్వగా.. దేవయాని ఫైర్ అవుతుంది. అలా ఎలా చేస్తాడంటూ అడుగుతుంది. అసలు కాలేజీ కష్టాల్లో ఉందని తెలియడం ఏంటి.. అప్పుడే మను ఎంట్రీ ఇవ్వడం ఏంటని అంటుంది. అసలు ముందు నుంచి మను మీద నాకు డౌట్ గానే ఉందంటూ వివరిస్తుంది. అలాగే దత్తత కార్యక్రమం అలా జరిగిందే కావచ్చని శైలేంద్ర అనగా.. లేదని తానే కావాలని చేయించుకోవాలనుకున్నట్లు మహేంద్ర చెబుతాడు. ఆ తర్వాత దేవయాని మాట్లాడుతూ.. దత్తత జరగకపోవడం మీకే మంచిది అయిందని చెప్పుకొస్తుంది.

మనును దేవయాని చాలా మాటలు అంటుండగా.. నాకు కోపం వస్తుందమ్మా అంటూ మహేంద్ర వసు చెవిలో అంటాడు. ఆగండి మామయ్యా.. కాస్త ఓర్చుకుంటేనే మనం అనుకున్నది చేయగలమని చెబుతుంది. అంతలోనే దేవయాని ఆపుతాడు ఫణీంద్ర. మేం మాట్లాడతాంగా దాని గురించి అంటూ ఫణీంద్ర శైలేంద్ర దీని గురించే నీవిలా డల్ గా ఉన్నావా అంటూ ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత నువ్వు మనును ప్రశ్నించావా అనగా.. చెడామడా తిట్టానని, తాను మాత్రం నోటీసులు కాన్సిల్ చేయనని చెప్పినట్లు వివరిస్తుంది. నాకిదంతా నిజం అనిపించట్లేదని, శైలేంద్ర మాటలు నమ్మాలనిపించట్లేదని ఫణీంద్ర అంటాడు. మను చాలా మంచివాడని.. ఇలాంటోడు ఇలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేయలేడని చెబుతాడు.

Shailendra Going to help For Manu on Guppedantha Manasu May 13th 2024 Episode 1073

నోటీసులు ఇచ్చారు కదా మరి ఏం చేయాలనుకుంటున్నారని మహేంద్రను అడగ్గా.. ఏమో తెలియట్లేదు అన్నయ్యా అంటూ చెబుతాడు. ముందు మను పోలీస్ కస్టడీ నుంచి బయటకు వస్తే.. కాలేజీని జప్తు చేయకుండా ఆపొచ్చని అంటాడు. అతడిని బయటకు తీసుకు వచ్చేందుకు ఎంత దూరమైన వెళ్దామని ఫణీంద్ర అనగా.. సరేనని అంటాడు శైలేంద్ర. ఆ తర్వాత వసు, మహేంద్ర, అనుపమలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. మనును వాళ్లు తిడుతుంటే నాకు చాలా కష్టంగా ఉందని.. తెగ ఫీల్ అయిపోతాడు. దీంతో వసు మహేంద్రకు శైలేంద్రను నమ్మించాలంటే ఇలా చేయక తప్పదని అంటాడు. మనును బయటకు తీసుకు రావడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇదంటూ వివరిస్తుంది. ముల్లును ముల్లుతోనే తీయాలని అంటాడు. ఆ రాజీవ్ ను హత్య చేశాడని కావాలనే ఇరికించారుగా అంటాడు.

అనుపమను ఈ విషయంలో కల్గజేసుకోవద్దని.. నీకున్న భయం వల్ల మేం చేసే పని కూడా చేయలేం అంటూ చెప్పుకొస్తాడు. అయినా నీకున్న భయం వల్లే నీవు చెప్పలేవు కదా అంటాడు. మనుకు తన తండ్రి గురించి తెలిస్తే ఏమవుతుందోనని చెప్తే ఏం జరుగుతుందోనని ఊరుకున్నావంటూ వివరిస్తుంది. అసలు దానికి, దీనికి సంబంధం ఏంటంటూ అనుపమ అనగా.. రెండింటికీ సంబంధం ఉందని వివరిస్తాడు. మేం వేసిన ప్లాన్ వల్ల రాజీవ్ దొరికి మను ఇంటికొస్తే ఓకే లేదంటూ ఇంకో ప్లాన్ వేసి బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తానని అంటాడు. కానీ నీలా భయపడి ఇలా తప్పించుకుని తిరగం అంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత శైలేంద్ర అగ్గి పుల్లలు గీకి పారేస్తూ ఓ చోట కూర్చుని కనిపిస్తాడు. ఎండీ పదవి ఇస్తానని మను అన్న మాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు.

Shailendra Going to help For Manu on Guppedantha Manasu May 13th 2024 Episode 1073

డాడీకి కూడా విషయం తెలిసిందని.. నేనిప్పుడు ఏం చేయాలని మనసులో అనుకుంటాడు. ఇంకా నయం ఆ మనుగాడు నాకిచ్చిన డీల్ గురించి చెప్పలేదు, చెబితే నా పరిస్థితి ఏమయ్యేదో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత దేవయాని కొడుకును చూసి అక్కడకు వస్తుంది. రాజీవ్ ఎక్కడున్నాడని అడగ్గా.. వాడా అంటూ అసలు విషయం చెప్పబోతాడు. కానీ అంతోలనే గుర్తు తెచ్చుకుని వాడు చనిపోయాడు కదా, ఇంకెక్కడున్నాడంటూ కవర్ చేస్తాడు. కానీ దేవయాని మాత్రం రాజీవ్ గురించి నా దగ్గర నీవేదో దాస్తున్నావంటూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. నేను సీరియస్ గానే అడుగుతున్నాను.. చెప్పు అంటాడు. అంతలోనే ధరణి వచ్చి.. ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ లు చేస్తున్నారని అంటుంది.

ధరణి నేనేసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానని.. ఓవర్ చేయకని చెబుతాడు. కానీ ధరణి మాత్రం ఆపకుండా...ఏడుస్తూ.. నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నాడని అంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నాకు కుర్చీ మోజు తప్ప ఇంకేం లేదని దేవయాని అనగా.. అసలు ఆ రాజీవ్ విషయం ఏంటో నాకు చెప్పు అంటూ అడుగుతుంది. కానీ శైలేంద్ర మాత్రం.. నేను వేరే దాని గురించి ఆలోచిస్తున్నానని... ఇఖ్కడి నుంచి వెళ్లిపో అంటూ చెప్పుకొస్తాడు. నువ్వు చాలా మారిపోయావు, నీకిది న్యాయం కాదంటూ దేవయాని అనగా.. నీకు తెలియకుండా నేనేం చేశానని శైలేంద్ర అంటాడు. టైం చూసి చెప్పాలనుకున్నానని అంటాడు. కానీ దేవయాని మాత్రం విషయం ఏంటో చెప్పు అంటూ అడుగుతూనే ఉంటుంది. కచ్చితంగా శైలేంద్ర నాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడని.. చెప్పుకొస్తుంది.

Shailendra Going to help For Manu on Guppedantha Manasu May 13th 2024 Episode 1073

మామయ్యా రెడీ అయ్యారా, కాలేజీకి ఆలస్యం అవుతుందని వసు అంటుంది. బాగా నటించి.. శైలేంద్రను త్వరగా నమ్మించి మనును బయటకు తీసుకురావాలని అంటుంది. నీవు కూడా ఏ పొరపాటు జరక్కుండా చూసుకో అంటూ వివరిస్తాడు. శైలేంద్ర వేలితోనే రాజీవ్ కన్ను పొడవాలని అంటుంది. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దొరికిపోతామని.. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పుకొస్తాడు. ఇలా ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X