Guppedantha Manasu May 25th: దేవయానిని ఓ ఆటాడుకున్న ధరణి.. మోసం చేసిన వాళ్లు అంతం చేస్తానంటున్న రాజీవ్!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో దేవయాని ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. అప్పుడే ధరణి వచ్చి మీరు దేని గురంచో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు కదా అంటుంది. అవునని అనగా.. నేను మీకోటి చెప్పాలి అంటుంది. వద్దని దేవయాని అన్నప్పటికీ.. ఆ తర్వాత చెప్పమంటుంది. కానీ ధరణి మాత్రం నేను చెప్పను అంటూ రచ్చ చేస్తుంది. ఈక్రమంలోనే దేవయాని నీవు తెలివి లేని దానివి అంటూ చెప్పగా నాకు చాలా తెలివి ఉందని అంటుంది. కావాలంటే నా తెలివి ప్రూవ్ చేసుకుంటానని చెబుతుంది. పొడుపు కథలు వేస్తాను సమాధానం చెప్పండి అనగా... దేవయాని ఓకే అంటుంది. అలా ధరణి అంగట్లో పెట్టి అమ్మేది కాదు, తూకట్లో వేసి జోకేది కాదు.. అది లేకపోతే మనిషే కాదు.. ఏంటో చెప్పండి అంటూ అడుగుతుంది.
దీనికి దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది. మీకు తెలియకపోతే మీ కొడుకును అడిగి మరీ చెప్పండి అంటూ వివరిస్తుంది. ఎలాగూ రాత్రి మీ కొడుకు వచ్చాకా మీరు మాట్లాడుకుంటారు కదా అప్పుడు అడగండి.. ఆన్సర్ తెలుసుకుని చెప్పండి అంటూ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత దేవయాని దీనికి వసు వల్లే దీనికి ఇన్ని తెలివితేటలు వచ్చాయి అంటూ మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత శైలేంద్రను చూపిస్తారు. ఈ రాజీవ్ కు వాడిని పట్టించింది నేనే అని తెలుసా, లేదా అని అనుకుంటాడు. అప్పుడే రాజీవ్ అతడిపై చేయి వేయగా.. శైలేంద్ర నేను కాదు, నేను కాదంటూ అరుస్తాడు. ఏంటి భయ్యా జైల్లో ఉంది నువ్వా, నేనా అంటూ అడుగుతాడు. అసలు ఏంటి భయ్యా ఇలా జరిగింది అని రాజీవ్ అనగా.. అసలు వాళ్లు ఇంత జాగ్రత్తగా ఎలా ఉన్నారు అంటూ రాజీవ్ అంటాడు.

ఆ సంఘటన ప్రతీ క్షణం నా కళ్ల ముందు కదలాడుతుంటే.. నా మరదలు పిల్ల నాకు దూరం అయిందంటే చాలా బాధగా ఉందని అంటాడు. మహేంద్ర గారు హీరోలా వచ్చి నా మరదలు పిల్లను కాపాడారు అంటూ చెప్పుకొస్తాడు. అసలు నిన్ను ఎవరు పట్టించారు భయ్యా అనగా.. ఇంకెవరు మీ బాబాయి, మా మరదలు పిల్లే నన్ను పట్టించారంటూ వివరిస్తాడు. కానీ వాళ్ల వెనుక ఎవరో ఉన్నారని చెప్పగా.. నేను కాదంటూ శైలేంద్ర భయ పడతాడు. నువ్వు కాదు బ్రదర్.. నువ్వు నాకు మిత్రుడివి ఇలా ఎందుకు చేస్తావంటూ అడుగుతాడు. దేవయాని మేడమ్ కు మనం ఇద్దరం రెండు కళ్ల లాంటి వాళ్లం.. మీరు నన్నెప్పుడూ మోసం చేయరంటూ వివరిస్తాడు. తనపై రాజీవ్ కు ఉన్న నమ్మకం చూసి శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు.
వసుతో తన పెళ్లిని అడ్డుకున్న వారెవరో తనకు తెలియాలని.. వాడిని చంపిన తర్వాతే వసుధార మెడలో మూడు ముళ్లు వేస్తానని రాజీవ్ శపథం చేస్తాడు. ఊహించుకోవడానికి భయంగా వాడి చావు ఉంటుందని శపథం కూడా చేస్తాడు. అయితే ఇదంతా చూసిన శైలేంద్ర మాత్రం చాలా భయపడిపోతాడు. అలాగే వసు, మహేంద్రలకు సాయం చేసి తనను పోలీసులుకు పట్టించిందో ఎవరో తెలుసుకుని తనకు సాయం చేయాలని శైలేంద్రను కోరతాడు. కానీ అతడు విపరీతంగా భయపడగా.. రాజీవ్ కు అనుమానం వస్తుంది. దీంతో నువ్వేమైనా చేసావా భయ్యా అనగా.. లేదు లేదంటూ తడబడతాడు శైలేంద్ర. ఇంకాసేపు ఇక్కడే ఉంటే దొరికిపోతానని అక్కడి.. నేను వెళ్తున్నానంటూ వచ్చేస్తాడు. కానీ రాజీవ్ మాత్రం పిలుస్తూనే ఉంటాడు.

ఇక ఆ తర్వాత దేవయానిని చూపిస్తారు. ధరణి వేసిన పొడుపు కథకు సమాధానం చెప్పకపోతే తన పరువు పోతుందని.. తెలివి లేని దద్దమ్మగా మిగిలిపోవాల్సి వస్తుందని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శైలేంద్ర అక్కడకు వస్తాడు. కానీ అది గుర్తించదు దేవయాని. ఏమైందమ్మా ఏదో ఆలోచిస్తున్నావంటూ శైలేంద్ర అడగగా.. పొడుపు కథ గురించి చెబుతుంది దేవయాని. దానికి తనకు సమాధానం తెలియదంటాడు శైలేందర. మోసం చేయడం, చంపడం లాంటివి చేస్తాను కానీ ఇలాంటివి నాకు తెలియదంటూ వివరిస్తాడు. ధరణిని సమాధానం చెప్పమని బతిమాలినా ఆమె నోరు విప్పదు. చెప్పనంటూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాజీవ్ ను కలిసిన విషయం గురించి వివరిస్తాడు శైలేంద్ర.
తనను పోలీసులకు పట్టించింది మహేంద్ర, వసులే అని రాజీవ్ నమ్ముతున్నాడని.. కాను అతడు అడిగిన ప్రశ్నల వల్ల తనపై అనుమానం మొదలైందని అంటాడు. తనను ఫేస్ కూడా చేయలేకపోతున్నానని అనగా.. నేను చూసుకుంటాను వాడి గురించి.. నువ్వు వసు, మహేంద్రలపై రివెంజ్ తీర్చుకోవడం గురించి ఆలోచించమని చెబుతుంది. ఇలా సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











