»   » బాలయ్య‌ ఫ్యాన్స్ తడాఖా: జబర్దస్త్ టీం క్షమాపణ

బాలయ్య‌ ఫ్యాన్స్ తడాఖా: జబర్దస్త్ టీం క్షమాపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు టెలివిజన్ చరిత్రలో సంచలనాత్మకంగా టీఆర్పీ రేటింగులు సాధించి...సూపర్ సక్సెస్ అయిన కార్యక్రమం 'జబర్దస్త్ కామెడీ షో'. అయితే ఆ మధ్య ప్రసారమైన ఓ ఎపిసోడ్‌లో శకలక శంకర్ చేసిన స్కిట్ బాలయ్య అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. బాలయ్య-రామ్ గోపాల్ వర్మ మధ్య జరిగే సంభాషణ ఎలా ఉంటుంది అనే అంశంతో ఈ స్కిట్ నిర్వహించారు.

అయితే ఈ స్కిట్ బాలయ్యను అవమానించే విధంగా ఉందని పలువురు అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. బాలయ్య అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేయడంతో ....దిగి వచ్చిన 'జబర్దస్త్ కామోడీ షో' నిర్వాహకులు క్షమాపణ చెప్పారు. శకలక శంకర్ స్వయంగా మీడియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పారు.

Shakalaka Shankar apologize Balakrishna

బాలయ్య సినిమా వివరాల్లోకి వెళితే...
సింహా తర్వాత బాలకృష్ణ హీరోగా బాయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'లెజెండ్'. ఇటీవల ఆడియో వేడుక జరుపుకున్న ఈచిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తోంది.

14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి రామ్ ఆచంట, అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, సాయి కొర్రపాటి నిర్మాతలు. జగపతి బాబు ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలై ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ లుక్, పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి.

English summary
In the recent times at a comedy show called Jabardasth a comedy show was scripted with the theme of RGV doing a movie with Balayya. Mimicry artistes taking down on Balayya's style, dialogue delivery and mannerisms too have not gone well with the actor's fans that they have served warning to all such artists.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu