నాలో మ్యాటర్ ఫినిష్.. అందుకే క్లోజ్ చేశా.. జబర్దస్త్ కమెడియన్
Recommended Video
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ గుర్తింపు పొందారు. అందులో ఒకరే షకలక శంకర్. ఎన్నో స్కిట్లు వేసి కడుపుబ్బా నవ్వించిన ఆయన వెండితెరపై కాలుమోపి సినిమా హీరో అవతారమెత్తాడు. గత కొంతకాలంగా షకలక శంకర్ జబర్దస్త్ తెరపై కనిపించడం లేదు. అయితే తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. తాను జబర్దస్త్ ఎందుకు మానేశానో చెబుతూ ఆసక్తి రేకెత్తించారు.
తనదైన పంచ్ డైలాగులతో నవ్వు బుట్టించే షకలక శంకర్.. తనలో మ్యాటర్ ఫినిష్ కావడం వల్లనే 'జబర్దస్త్ మానేశానని పేర్కొన్నాడు. రోజుకో కొత్త టాపిక్ సెర్చ్ చేస్తూ తానేదైతే ప్రేక్షకులకు చుపించాలను కున్నానో అది పూర్తి చేశానని ఆయన అన్నాడు. కొన్నిసార్లు చేసినవే మళ్లీ రిపీట్ కూడా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. శంకర్.. చేసినవే మళ్లీ రిపీట్ చేస్తున్నాడు అనే టాక్ రావడం కారణంగా జబర్దస్త్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. అప్పట్లో తనతో పాటు చేసిన జబర్దస్త్ కమెడియన్స్ ఇంకా చేస్తున్నారంటే అది వాళ్ల టాలెంట్ మాత్రమే అని అన్నాడు శంకర్. 'జబర్దస్త్' తరువాత తనకు కనిపించిన మరో మార్గం సినిమానేనని అందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నాని చెప్పాడు శంకర్.

ప్రస్తుతం వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు షకలక శంకర్. ఈ నేపథ్యంలో ఇటీవలే శంభో శంకర సినిమాతో ప్లాప్ అయినప్పటికీ.. తాజాగా ఆత్రేయపురం ఆణిముత్యం అంటూ మరో సినిమాకు కమిట్ అయ్యాడు శంకర్. కాకపోతే తనకు మంచి పేరు తెచ్చింది మాత్రం 'జబర్దస్త్' అని అంటున్నాడు శంకర్.


Click it and Unblock the Notifications











