Bigg Boss 7 Telugu: ఆమెకే బిగ్ బాస్ ఫేవర్.. ఏమీ చేయకపోయినా విన్నర్.. నిజం బయటపెట్టిన కంటెస్టెంట్
వేరే భాషల్లో ఎప్పుడో వచ్చినా... ఏడేళ్ల క్రితమే తెలుగులోకి పరిచమైంది బిగ్ బాస్ షో. అంచనాలు లేకుండానే లాంచ్ అయినా మన భాషలో చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులు మద్దతును అందించారు. దీంతో ఇది తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ షోగా మారిపోయింది.
దీంతో వరుస పెట్టి సీజన్ల మీద సీజన్లను జరుపుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను మొదలు పెట్టారు. ఇది ఆరంభం నుంచీ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కంటెస్టెంట్ల నోటి నుంచి ఓ ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటో మీరే చూడండి!

ఎన్నో ప్రయోగాలతో 7వ సీజన్: ఎప్పుడు ప్రసారం అయినా బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే మొదలైన ఏడో సీజన్ కూడా ఎంతో ప్రయోగాలతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఇది మొదలై ఒక వారమే అయినా.. అప్పుడే ఇందులో ఎన్నో కొత్త అంశాలను చూపించారు. అలాగే, గతంలో కంటే వైవిధ్యంగా నడుపుతున్నారు. దీంతో ఈ సీజన్ జనరంజకంగా సాగుతూ మజాను అందిస్తోంది.

14 మంది.. ఆమె చాలా హైలైట్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా వచ్చిన వారిలో తెలుగు భామ రతికా రోజ్ ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ అమ్మడు పెద్దగా పాపులర్ కాలేదు. కానీ, బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టిన వెంటనే ఫుల్ ఫేమస్ అయింది. అందుకు అనుగుణంగానే తనదైన స్వభావంతో ముందుకు సాగుతూ యమ హైలైట్ అయిపోతోంది.
ఇప్రెస్ ది బిగ్ బాస్ టాస్కుతో: ఒక కంటెస్టెంట్‌కు కన్ఫర్మేషన్‌తో పాటు 5 వారాల ఇమ్యూనిటీని అందించే టాస్కులో భాగంగా ఈ వారంలో కొన్ని రౌండ్లు జరిగాయి. అందులో మొదటి దాంట్లో సందీప్, ప్రియాంక గెలిచారు. ఆ తర్వాత 'ఇంప్రెస్ ది బిగ్ బాస్' టాస్క్ పెట్టి కంటెస్టెంట్లకు కొన్ని టాస్కులు ఇచ్చారు. ఇందులో ఎవరైతే బిగ్ బాస్‌ను మెప్పిస్తారో వాళ్లనే ఆయన గెలిచినట్లు ప్రకటిస్తాడని చెప్పారు.

వాళ్లిద్దరే సెలెక్ట్.. అంతా షాక్: గత ఎపిసోడ్‌లో జరిగిన 'ఇంప్రెస్ ది బిగ్ బాస్' టాస్కు ఎంతో సందడిగా, ఊహించని మలుపులతో సాగింది. ఇందులో హీరో శివాజి, రతిక బిగ్ బాస్‌ను మెప్పించి విజేతలుగా నిలిచారు. ఈ విషయాన్ని బిగ్ బాస్ స్వయంగా ప్రకటించాడు. దీంతో అందరూ అవాక్కైపోయారు. శివాజీని వదిలేసినా అసలు రతికా ఏం చేసిందని విన్నర్‌గా ప్రకటించారు అని నోరెళ్లబెట్టేశారు.
బిగ్ బాస్ పైనే ఆరోపణలు: తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో రతికా రోజ్‌ను టాస్కులో విజేతగా ప్రకటించడంపై కంటెస్టెంట్లు అందరూ అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా షకీలా 'శివాజీ అన్న ఏదో ఒకటి చేసి బిగ్ బాస్‌ను ఇంప్రెస్ చేస్తున్నారు. కానీ, ఆ అమ్మాయి రతికా ఏం చేసింది? ఆమె ఏమీ చేయకపోయినా బిగ్ బాస్ ఎందుకు పొగుడుతున్నారు? ఎందుకో ఫేవర్ చేస్తున్నట్లు ఉంది' అని ఆరోపించింది.

ప్రేక్షకులు కూడా కన్యూజ్: 'ఇంప్రెస్ ది బిగ్ బాస్' టాస్కులో ఇంట్లోని ప్రతి ఒక్కరికీ కొన్ని రకాల టాస్కులు ఇచ్చారు. అందులో చాలా మంది సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా శివాజి బిగ్ బాస్‌పైనే గొడవ పడుతున్నట్లు నటించి మెప్పించాడు. కానీ, రతికకు ఏ టాస్క్ ఇచ్చాడు? ఆమెను ఎందుకు విజేతగా ప్రకటించాడు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపై ప్రేక్షకులూ కన్ఫ్యూజ్ అవుతున్నారు.
అందుకే తప్పించేశారుగా: రెండు రౌండ్లలో సందీప్, ప్రియాంక, శివాజి, రతికా రోజ్‌లు గెలిచి ఇమ్యూనిటీ టాస్కులో కంటెండర్లుగా నిలిచారు. ఇక, తాజా ఎపిసోడ్‌లో వీరిలో ఎవరు అనర్హులో చెప్పమని బిగ్ బాస్ అడగ్గా.. ఇంట్లో వాళ్లు ఎక్కువ మంది రతికాకు, శివాజికి ఓట్లు వేశారు. దాదాపుగా అందరూ ఒకే కారణం చెప్పి వీళ్లిద్దరికీ ఓట్లు వేశారు. దీంతో ఈ టాస్కు నుంచి వీళ్లిద్దరినీ తప్పించినట్లు బిగ్ బాస్ చెప్పాడు.


Click it and Unblock the Notifications