Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో కలకలం.. పరుగులు తీసిన కంటెస్టెంట్లు.. షో చరిత్రలోనే తొలిసారి

అనుమానాల నడుమ ప్రారంభమైనా.. ఊహించని రీతిలో తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుని సూపర్ డూపర్ హిట్ షోగా మారింది బిగ్ బాస్. భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించిన ఈ షో.. టీఆర్పీ రేటింగ్‌లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఫలితంగా తెలుగు బిగ్ బాస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.

అదే సమయంలో కొన్ని సీజన్లను భారీ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకుంది. ఇక, ఇటీవలే ఏడోది కూడా ప్రారంభం అయింది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఊహించని సంఘటన జరిగింది. అసలు ఏమైంది అనే దానిపై పూర్తి వివరాలను మీరే చూడండి!

Shakeela and Sivaji Prank Highlight In Bigg Boss 7 Telugu Show

నిజంగా ఉల్టా పుల్టా సీజనే: తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు వచ్చినా హిట్ అవుతుంది. దీంతో నిర్వహకులు ఇటీవలే ఏడో దానిని కూడా మొదలెట్టారు. అయితే, గతంలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల షో రేటింగ్ పడిపోవడంతో ఇప్పుడు ఉల్టా పుల్టా అనే సరికొత్త కాన్సెప్టును తీసుకొస్తున్నారు. అంతేకాదు, టాస్కుల్లో కూడా వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. దీంతో ఈ సీజన్ అనుకున్నట్లుగానే సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది.

వాళ్లిద్దరు మాత్రం పెద్దోళ్లు: బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో గతంలో కంటే ఈ సారి నిర్వహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో షకీలా మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఆమె బ్యాగ్రౌండే. అలాగే, హీరో శివాజి కూడా బాగానే హైలట్ అయ్యాడు. ముఖ్యంగా వీళ్లిద్దరూ హౌస్‌లో పెద్దోళ్లుగా ఉన్నారు.

శివాజి సీక్రెట్ టాస్క్ రచ్చ: గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో శివాజి చేసిన సీక్రెట్ టాస్క్ ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు కాఫీ కావాలని, తన టాబ్లెట్లు పంపించలేదని బిగ్ బాస్‌పై విరుచుకుపడ్డాడు. 'బొక్కైనా భయపడను.. అన్నీ పగలనూకుతా.. డోర్స్ తీసేయవయ్యా నేను వెళ్లిపోతా' అంటూ నానా రచ్చ చేసి అందరినీ భయపెట్టి ప్రేక్షకుల మనసు దోచేశాడు.

Sivaji Bigg Boss

ఈ సారి డైరెక్టర్‌గా చేశాడు: శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో అర్ధరాత్రి సమయంలో షకీలా, కిరణ్ రాథోడ్‌తో కలిసి గార్డెన్ ఏరియాలో ఉన్న శివాజి.. 'అమ్మా (షకీలా) బాగా బోర్ కొడుతుంది. ఏదైనా ప్లాన్ చేద్దాం' అని ఓ ప్రాంక్‌ చేద్దామని చెప్పాడు. ఇందులో భాగంగా షకీలాకు ఒంట్లో బాలేదని అందరినీ నమ్మించాడు. అప్పుడు డాక్టర్ అయిన గౌతమ్ వచ్చి ఆమెను పరీక్షించి కొన్ని సూచనలు చేశాడు.

దెయ్యం పట్టినట్లు షకీలా: గౌతమ్ పరీక్షలు చేస్తున్న సమయంలో షకీలా బిగుసుకుపోయినట్లు నటించింది. దీంతో అతడు భయపడిపోయాడు. ఆ తర్వాత ఆమెను లోపలికి తీసుకువెళ్లి పడుకోబెట్టారు. అప్పుడు శివాజి బిగ్ బాస్‌తో 'మేము ప్రాంక్ చేస్తున్నాం. మీరు టెన్షన్ పడకండి' అని చిన్నగా చెప్పాడు. ఆ తర్వాత షకీలా రెచ్చిపోయి మరీ తనకు ఎవరో కనిపిస్తున్నట్లు నటిస్తూ అందరినీ భయపెట్టేసింది.

భయంతో పరుగు.. దేవుడా: షకీలా ప్రవర్తన అక్కడున్న వారిని అందరినీ భయపెట్టేసింది. ముఖ్యంగా ఆమె ఎదురు బెడ్‌లో ఉన్న దామిని అయితే 'ఓం నమో వెంకటేశాయా' అంటూ దేవుడిని ప్రార్థించడం మొదలెట్టింది. ఆ తర్వాత చాలా మంది షకీలాను చూడాలంటేనే భయపడేలా ఆమె నటించింది. ఆ దెబ్బతో ఒక్కరు కూడా నిద్రపోలేదు. టేస్టీ తేజ అయితే ఆమె ఉలిక్కిపడి లేవడంతో యమా భయపడ్డాడు.

తొలిసారి.. సారీ చెప్పాలి: ఈ సంఘటన గురించి తెలియని వాళ్లందరూ బిగ్ బాస్ షోలో తొలిసారి ఇలా జరిగిందని చెప్పుకున్నారు. కొద్ది సేపటి తర్వాత షకీలాతో కలిసి టేస్టీ తేజను భయపెట్టడం కోసం శివాజి తాము ప్రాంక్ చేశామని అందరికీ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దామిని.. శివాజి, షకీలా అందరినీ కూర్చోబెట్టి తప్పు చేశాము సారీ అని చెప్పాలంటూ డిమాండ్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X