Bigg Boss 7 Leaks: 2వ వారం ఎలిమినేషన్ లీక్.. మంచిగా ఆడినా పంపేశారుగా.. అసలు కారణం ఏంటంటే!
సరికొత్త కాన్సెప్టుతో నడిచే షోనే అయినా.. గతంలో ఎన్నడూ చూడని టాస్కులు, గొడవలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల అంశాలు హైలైట్ చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్‌ను లాక్కుంది బిగ్ బాస్. అదే ఇంప్రెషన్‌ను కంటిన్యూ చేస్తూ రేటింగ్‌ను భారీగా రాబడుతోంది. ఫలితంగా నిర్వహకులు వరుసగా సీజన్లను కంప్లీట్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో దానిని నడుపుతున్నారు.
బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, నటి శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమరదీప్‌లు అడుగు పెట్టారు. వీరిలో మొదటి వారం జరిగిన ఎలిమినేషన్‌లో కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి వెళ్లిపోయింది.

ఈ సీజన్‌లోని రెండో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియను కొత్త టాస్కుతో జరిపారు. ఇందులో ఎన్నో గొడవలు జరిగాయి. మొత్తంగా ఈ వారంలో 9 మంది సభ్యులు పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శివాజి, అమర్‌దీప్‌లు కంటెస్టెంట్ల ఓట్లతో నామినేట్ అయ్యారు. అయితే, ప్రిన్స్ యావర్‌ను మాత్రం సందీప్ ఈ వారానికి నేరుగా నామినేట్ చేశాడు.
రెండో వారానికి గానూ జరిగిన ఓటింగ్ ప్రక్రియ అంతా చిత్ర విచిత్రంగా సాగినట్లు తెలిసింది. మొదటి రెండు స్థానాల్లో ప్రశాంత్, శివాజి ఉండగా.. మిగిలిన అన్ని స్థానాల్లో ఆయా కంటెస్టెంట్ల ఆటను బట్టి మార్పులు వచ్చాయని తెలిసింది. ముఖ్యంగా టాప్ కంటెస్టెంట్లుగా పేరు తెచ్చుకున్న వాళ్లు కూడా తక్కువ ఓటింగ్‌నే పొందారు. దీంతో ఎలిమినేషన్‌పై చాలా ఆసక్తి పెరిగింది.

వాస్తవానికి బిగ్ బాస్ షోకు సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది చాలా సీక్రెట్‌గా జరిగే వ్యవహారమే అని తెలిసిందే. అయినా ఇది ఒకరోజు ముందుగానే షూటింగ్ జరుపుకోవడంతో సమాచారం మొత్తం లీక్ అయిపోతుంది. ఇక, ఏడో సీజన్ రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఢీలా పడిపోతున్నారు.

ఇప్పుడు హౌస్‌లో ఉన్న వారితో పోల్చుకుంటే షకీలా ఎంతో ఫేమస్ అయిన ఆర్టిస్టు. అయినప్పటికీ ఆమెకు ఇప్పుడు పెద్దగా ఫాలోయింగ్ లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ ప్రియుల నుంచి ఈ సీనియర్ నటికి సపోర్టు పెద్దగా లభించడం లేదు. దీంతో మంచిగా ఆట ఆడినా కూడా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











