Bigg Boss 7 Telugu: షోలో ముద్దు సీన్.. లిప్‌స్టిక్ వేసుకుని మరీ.. అడగ్గానే పెట్టేసిన లేడీ
తెలుగు బుల్లితెరలో ప్రసారం అయ్యే షోలు అన్నింటిలోనూ ప్రత్యేకమైనదిగా నిలుస్తూ.. చాలా కాలంగా హవాను కొనసాగిస్తోంది బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని సరికొత్త కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి మన ప్రేక్షకులు భారీ స్థాయిలోనే స్పందన అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలా ప్రతి ఏడాది ఒకటి చొప్పన ఇప్పటికే ఎన్నో సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే గత ఆదివారమే ఏడోది కూడా ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయింది. ఇక, తాజా ఎపిసోడ్‌లో ముద్దు సీన్లు హైలైట్ అయ్యాయి. ఆ వివరాలు మీకోసమే!
ఆరంభంలోనే మంచి స్పందన:భారీ అంచనాల నడుమ ఇటీవలే ఏడో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. పాత సీజన్లను మరిపించేలా దీనిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సారి 14 మంది కంటెస్టెంట్లను పంపి సరికొత్త టాస్కుల పరిచయం చేస్తున్నారు. దీనికితోడు గొడవలు, ఎమోషన్స్ వంటి వాటితో ఈ సీజన్‌కు ఆరంభంలోనే అదిరిపోయే స్పందన దక్కుతోంది.

అందరితో అతడు ఫన్నీగానే:ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్పెషల్‌గా నిలిచారు. వారిలో జబర్ధస్త్ మాజీ కమెడియన్, ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ కూడా బాగా ఫోకస్ అయ్యాడు. ఇతడు మాత్రం తనదైన కామెడీని చూపించే ఏవీ ప్రదర్శన అనంతరం వచ్చాడు. అంతేకాదు, ఫుడ్ ప్రింట్ చేసిన డ్రెస్ వేసుకుని హౌస్‌లోకి అడుగు పెట్టి హైలైట్ అయ్యాడు.
నవ్విస్తూ, నవ్వుతూ సందడి:బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే టేస్టీ తేజ తనదైన రీతిలో కామెడీని పంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరినీ గౌరవంగానే పలకరిస్తూ, అప్పుడప్పుడూ పంచులు, సెటైర్లు వేస్తూ సందడి చేస్తున్నాడు. దీంతో అతడిని అందరూ లైట్ తీసుకుంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్‌లో తేజ ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ మిగిలిన కంటెస్టెంట్లకు మజా పంచుతున్నాడు.
చిన్న పిల్లాడిలా మార్చేశారు:తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఖాళీ సమయంలో లేడీ కంటెస్టెంట్లు అందరూ కలిసి టేస్టీ తేజను చిన్న పిల్లాడిలా మార్చేశారు. ఇందుకోసం అతడికి చిన్న పిలకను వేయడంతో పాటు బొట్టు, బుగ్గ చుక్క పెట్టి రెడీ చేశారు. అప్పుడు తన బుగ్గపై లిప్ మార్కు కావాలని టేస్టీ తేజ అడిగాడు. దీంతో శుభ శ్రీ మేకప్ బ్రష్‌తో అతడి బుగ్గపై లిప్ మార్కును వేసేందుకు ప్రయత్నాలు చేసింది.
ఎంత ముద్దు వస్తున్నావురా:టేస్టీ తేజను చిన్న పిల్లాడిలా రెడీ చేసిన తర్వాత అందరూ అతడిని చూసి నవ్వుకున్నారు. ఆ సమయంలోనే అతడిని అలా చూసిన షకీలా 'అరేయ్ ఎంత ముద్దు వస్తున్నావురా' అంటూ టేస్టీ తేజ నుదుటిపై ముద్దు పెట్టింది. ఆ వెంటనే నాకు బుగ్గపై కూడా ముద్దు కావాలి అంటూ చిన్న పిల్లాడిలా మారాం చేశాడు. దీంతో అక్కడున్న శుభ శ్రీ, రతికా కొంచెం దూరంగా వెళ్లిపోయారు.
మళ్లీ వచ్చి ముద్దు పెట్టేసి:తనకు బుగ్గపై ఎవరైనా అమ్మాయి ముద్దు పెట్టాలని టేస్టీ తేజ అడిగినా ఎవరూ ముందుకు మాత్రం రాలేదు. ఆ సమయంలోనే షకీలా వచ్చి అతడి బుగ్గపై ముద్దు పెట్టేసింది. ఈ సీన్‌లో ఆమె అతడికి తల్లిలా భావించి కిస్ చేసినట్లు చెప్పింది. ఆ తర్వాత కూడా తేజను పలుమార్లు నువ్వు నా కొడుకువురా అంటూ చెప్పింది. మొత్తానికి తేజ కామెడీతో ప్రేక్షకులకు వినోదం దొరికింది.


Click it and Unblock the Notifications











